Responsive Advertisement

నాన్నంటే...


నాన్నంటే..

‘‘నాన్నంటే ఓ వెన్నెముక. వెన్నెముక వెనక ఉండబట్టే కదా మనం దన్నుగా నిలబడగలుగుతున్నాం’’ అని ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి ఓ సందర్భంలో  చెప్పినట్లు.. 

నాన్నంటే ఓ భరోసా.. నాన్నంటే కొండంత అండ.  

తను తిన్నా తినకున్నా పిల్లలు కోసం దాస్తాడు. 

పిల్లలు అడిగినది కాదనకుండా.. వారి మనసును నొప్పించకుండా తనకోసం ఏమీ మిగిల్చుకోని ఓ త్యాగశీలి నాన్న. 

చంటిపిల్లవానిగా ఉన్నప్పటి నుంచి నిన్ను తన గుండెలపై మోస్తూ.. భారం అంటే ఎరుగని ఓ నిగూఢ జీవి నాన్న. 

నాన్నంటే ఓ రక్షణ. 

అందుకే తను తడుస్తున్నా తన కుటుంబం కోసం గొడుగై ఆ వర్షాన్ని అడ్డుకుంటాడు. 

అమ్మలాగా నిన్ను నిరంతరం ప్రేమిస్తున్నానంటూ చెప్పలేకపోవచ్చు.. 

నీ రక్షకుడై నిరంతరం నిన్ను ఓ కంటకనిపెడుతున్న ఓ నీడ నాన్న. 

గతి తప్పుతున్న జీవితానికి నాన్న ఓ చుక్కాని. 

నాన్న ప్రేమకు లోతెక్కువ. అందుకే అంత తొందరగా అర్థం కాడు. 

నువ్వు నాన్నవైతేనే నీకు తెలుస్తుంది అంటాడు కొన్నిసార్లు.

నాన్నా..

మూడు తరాల తర్వాత ఇంట మొదటి అడపిల్లనని..
తతగారివైపు..నానమ్మ వైపు ఇంట్లో మొదటి బిడ్డనని నన్నెంతో ముద్దుగా పెంచారు..
నాన్నా అని మిమ్మల్ని ఒక్కరినే పిలిచినా...మీ నాన్న కూడా నాకు నాన్నేగా..
మీరు అమ్ములు అంటే తాతగారు అమ్మా అంటూ
ఎప్పుడూ నా వెన్నంటి ఉండేవారు..
ఒకరి కూతురుగా ...మరొకరి మనవరాలిగా..నేనెంతో అదృష్టవంతురాలిని..
మీరెప్పుడూ నాకు గొప్పగానే కనిపిస్తారు..
గంభీరంగా..కోపంగా..అచ్చంగా మన పెంకుటింటి పెద్ద దూలంలా..
మీ మీదనే ఇల్లంతా ఉన్నా..ఓ మాట అనరు..
కర్తవ్యమే అది అన్నట్టు ఉంటారు..
నీ కాళ్ళపై ఊగిన ఉయ్యాల ఇంకా గుర్తే..
వద్దులే నాన్నా అంటే..
రా తల్లీ నా కాళ్ళ నొప్పులు తగ్గుతాయని మీరన్నప్పుడు ..
నీ వేలు పట్టుకు నడిచిన అడుగులు..
ఎలా ఉండాలో నేర్పుతూ చెప్పిన కథలు..
వద్దన్నది చేసినప్పుడు అలకలు..
కాస్త జ్వరానికే మీ కళ్ళలో నీళ్ళు..
అలసి ఇంటికొచ్చినా వాడని చిరునవ్వులు..
ప్రతీ పుట్టినరోజున వేసిన మొక్కలు ..
అవి పెరుగుతుంటే ఆ కళ్ళలో మెరుపు ఇప్పటికీ గురుతే...
చిన్న విషయాలకు పెద్ద హోదా ఇచ్చే పల్లెల్లో..
కొన్ని అనవాయితీలను....
మరికొన్ని అనవసర సంప్రదాయాలను కుదరదంటే కుదరదని 
మీ అమ్మ మాటని కూడా కాదని మాకెంతో స్వేచ్చనిచ్చి పెంచారు..
ఏడవ తరగతిలో అనుకుంటా సైకిల్ నేర్చుకుంటా అంటే..
సైకిల్ తొక్కటం నేర్పించొద్దని నానమ్మ దెబ్బలాటకి..
నానమ్మకు నచ్చ చెబుతూ మీరు..
నాకు మీ బజాజ్ చేతక్ నేర్పుతూ తాతగారు..
ఊరంతా ముక్కున వేలేసుకున్నా  గర్వంగా తలెత్తి చూస్తూ .నా కూతురనేవారు.. ఇప్పటికీ.. ఎప్పటికీ గుర్తే..
నేనెప్పుడు  పెరిగానో..
అంత పెద్దదాన్ని ఎప్పుడు అయ్యానో అప్పుడే పెళ్లా..
అని ఆలోచనల్లో ఉండగానే పెళ్లి పిల్లలు..

నాన్నా..

అప్పటివరకు మీరు నాకు నాన్న..
నేను అమ్మయ్యాక మీరు నాకు పసిపిల్లాళ్ళా అనిపించారు.
నా పిల్లలతో పిల్లల్లా కలసిపోయి మీరాడే ఆటలు..
అమ్మ నాదంటే నాదని పిల్లలంటంటే 
అమ్ములు నాదని మీరు చేసే  అల్లరి..అలకలు...
పిల్లలకు నా గురించి మీరు చెప్పే కథలు..
మీలో మరో పసివాడిని గుర్తు చేస్తాయి..
వారికి జాగ్రత్తలు చెబుతూ మీకు కూడా చెబుతుంటే 
మీ పెదాలపై విరిసే నవ్వు... కళ్ళలో సన్నటి నీటి పొర..
మీ నుండి దూరం పంపిన ప్రతీసారి ఎదో పనుందని మేం బయలుదేరే వరకు వచ్చేవారు కాదు..
రాకుండా ఉండలేక వచ్చాక వదల్లేక మీరు పడే వేదన తెలుస్తూనే ఉంటుంది..
మీరు చెప్పిన కొన్ని మాటలు ఎప్పటికీ గుర్తే..
మనపై మనకున్న నమ్మకాన్ని కానీ... 
ఎదుటి మనుష్యులపై ఉండే నమ్మకాన్ని కానీ వదలొద్దని...
నమ్మకమే మనల్ని నడిపించే శక్తి అని..
నిజమే అనిపిస్తుంది...

నాన్నా...

నమ్మకాన్ని..విశ్వాసాన్ని నింపి..
నడకను...నడవడికను నేర్పే నాన్నకు....
నీడై...తోడుండే నాన్నకు
ధైర్యమై...దారి చూపే నాన్నకు
నిజమై..నిలకడై నిలిచే నాన్నకు...
కష్టమైనా....ఇష్టమై సాగే నాన్నకు
కన్నీటిని దాచేసి..గాంభీర్యాన్ని మాత్రమే చూపే నాన్నకు..
మూసినా తెరిచినా కంటిలోనే నిలుపుకునే నాన్నకు...
కలవరాల్ని సైతం కలల వరాలుగా ఇచ్చే నాన్నకు...
ఇంకో తరాన్ని చూసినా తన బిడ్డ మాత్రం ఇంకా చంటి పాపే అనుకునే నాన్నకి...
బిడ్డల బిడ్డలతో ఆడుకుంటూ తానూ పసిబిడ్డయ్యే నాన్నకు..
ఎక్కడ ఏం తప్పటడుగులు వేస్తామో అని అడుగులు తడబడనీయని నాన్నకు ప్రేమతో .....

Shiv Prasad Chamarthi:
నాన్న దినోత్సవం సందర్భంగా
శుభాకాంక్షలు


"నాన్న నికు వందనం "🙏🙏

అమ్మ కడుపులో మేము   
ఎదుగుతున్న వేళ ని ఆనందాలకు హద్దు ల్లేవు
నాన్న నీ మధుర నుభుతికి
వందనం

మేము ఈ లోకం లోకి వచ్చిన మరుక్షణమే మమ్మల్ని
కౌగిలిలో  ఎత్తుకొని ముద్దడవు నాన్న
 నీ ప్రేమకు వందనం 

మా చేయి పట్టి నడక నేర్పినవు
ఏ కష్టం తెలియకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేశావు
నాన్న నీ పెంపకానికి వందనం

ఏ లోటూ లేకుండా,ఏ బాధ తెలియకుండా మమ్ములను పెంచినవు
మా మంచిని కొరినవు 
నాన్న నీ మంచి మనసుకి వందనం


కష్ట లు వచ్చిన, కన్నీళ్లు వచ్చిన
కడుపులోనే దచుకున్నవు
మా..కడుపు నింపే ప్రయత్నం చేస్తూ
నీవు పస్తులున్న రోజులెన్నో గడిపావు
నాన్న నీ పేగు బంధాన్ని వందనం


మా భవిష్యత్తు కై నీ నెత్తురు నే
చెమట గ మార్చి
 అలసిపో తునే సంబరపడినవు

.మాకోసం   నీ జీవితాన్ని  ధారపోసిన వు
నాన్న నీ కర్తవ్యా నికి వందనం
మి పాద పద్మాల కు అభివందనం
🙏🙏💐💐💐💐🙏🙏

మనకోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి ఒక్కరి
నాన్నకు ఈ కవిత్వం అంకితం
🚩🚩🚩🚩🚩
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

Post a Comment

0 Comments