1991జూన్ 21 - భారతదేశానికి తొలితెలుగు ప్రధానిగా ఢిల్లీ పీఠం అధిరోహించిన పి.వి గా పిలుసుకొనే పాములపర్తి వెంకటనరసింహారావుగారు

1991జూన్ 21 - భారతదేశానికి తొలితెలుగు ప్రధానిగా ఢిల్లీ పీఠం అధిరోహించిన పి.వి గా పిలుసుకొనే పాములపర్తి వెంకటనరసింహారావుగారు

SHYAMPRASAD +91 8099099083
0
"భారతదేశానికి తొలితెలుగు ప్రధానిగా ఢిల్లీ పీఠం అధిరోహించిన జ్ఞాపకార్థం"
"
ఒక ఎనిమిది సంవత్సరాల కుర్రాడు జట్కా బండిలో పక్క ఊరికి వెళుతున్నాడు.భూసామి కుటుంబస్తుడయినందువల్ల జట్కా బండివెంట ఇద్దరి పనివాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. కొంతదూరం వెళ్ళిన తరువాత ఆ పిల్లవాడు బండిఆపి వాళ్ళను ఎక్కమన్నాడు. అయితేవారు భయపడి మేము అలా ఎక్కకూడదని,మీ నానకు తెలిస్తే చంపేస్తాడని చెప్పేరు. అయినా ఆ బాలుడు ఎక్కాలసిందే అని పట్టుపట్టాడు. వారు వినలేదు. అయితే నేనూ కూడా మీతోనే నడిసివస్తానని బండిదిగి వారితో నడవసాగేడు. ఆ అబ్బాయినడిచాడని వాళ్ళ నానకు తెలిస్తే తమను శిక్షస్తాడని భయపడిన పనివాళ్ళు ఇంకచేసేది లేక బండెక్కినారు. అలా పనివాళ్ళను కూడా సమానభావంతో చూసిన విశాల హృదయంగల ఆ బాలుడే తర్వాతకాలంలో భారతదేశానికి తొలి తెలుగు ప్రధాని అయి ప్రపంచంలో భారత్ ను ఒక ప్రముఖ ఆర్థికశక్తికి మలిచినాడు. తెలుగువాళ్ళందరికీ గర్వకారణమైన రోజు ఈ రోజునే. ఆ వ్యక్తి యే పి.వి గా పిలుసుకొనే పాములపర్తి వెంకటనరసింహారావుగారు.
  కుల,వర్గ ప్రాంతీయవైషమ్యాలకు పేరుబడ్డ ఆంథ్రప్రదేశ్ లో ఎటువంటి కోటరీ లేకుండానే సొంత ఇమేజ్ తో రాష్ట్రమంత్రి గానూ,ముఖ్యమంత్రిగానూ, కేంద్రమంత్రిగానూ, చివరన ప్రధానమంత్రిగానూ ఎన్నో పదవులలంకరించిన మేధావి పి.వి గారు. ముఖ్యంగా 1972లో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 70% సీట్లు వెనకబడినతరగతులకు ఇచ్చి సంచలనం సృష్టించాడు. అలాగే భూ సంస్కరణలలో లాండ్ సీలింగ్ ,పట్టణభూపరిమితి చట్టం పక్కాగా అమలుచేసినందున భూస్వాముల ఆగ్రహానికి గురైనారు.
దేశచరిత్రలో గాంధీ ,నెహ్రూయేతర కుటుంబాలనుంచి వచ్చి ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తిచేసుకొన్న మొదటి ప్రధాని ఇతనే.అలాగే ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదుసంవత్సరాలు నడిపిన ఘనత కూడా పి.వి గారిదే. వరల్డ్ బ్యాంక్ పనిచేస్తున్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థికమంత్రిని చేసి సంస్కరణలకు నాందిపలికేరు. మంచి వ్యక్త,బహుభాషా కోవిదుడు,కవి,సాహితీవేత్త మితభాషి అయిన పి.వి గారు ప్రధానిగా భారతదేశానికే కాకుండా మన తెలుగుజాతికి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అయితే ఉత్తరభారతదేశ ఆధిపత్య ధోరణివల్ల,ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ లాంటి గుంటనక్కల రాజకీయాలకారణంగా కొన్ని అపవాదులు ఎదుర్కొని తగినంత గుర్తింపుకు నోసుకోలేకపోయాడు. 1991జూన్ 21 అంటే ఇదే రోజు ప్రధాని అయిన సందర్భంగా తన జ్ఞాపకార్థం ఒక తెలుగువాడిగా ఈ చిన్న వ్యాసం.   

సేకరణ🙏🙏🙏🙏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!