కథ - శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్క

కథ - శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్క

SHYAMPRASAD +91 8099099083
0
ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు. కుక్కకి  సౌకర్యంగా లేదేమో మొరుగుతూ తెగ అల్లరి చేస్తోంది. విసుక్కున్నారు రాయల వారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరివల్లా కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి "మహారాజా తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను" అన్నాడు. సరేనన్నారు రాయలవారు. 
             వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కని తీసుకు పోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతోంది. కాసేపయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే కుక్క ఒక మూలకి పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయల వారు "ఏం మాయ చేశావు రామకృష్ణా" అని అడిగారు. 
              రామకృష్ణ నవ్వేసి "మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశ పడతారు. నీటిలో పడేశాక అంతకు ముందు తనెంత సురక్షిత ప్రదేశంలో వున్నదో అర్ధమయి కుక్కకి జ్ఞానోదయం అయింది"
అన్నాడు.
            " అలా మనదేశంలో కూడా ఊరికే మొరుగుతూ గంతులు వేసే కుక్కల్ని సిరియా, ఇరాక్, పాకిస్తాన్ ల్లో పారేసి ఆరునెలల తర్వాత వెనక్కి తీసుకొస్తే ముడుచుకుని ఒక మూల పిల్లుల్లా పడుకుంటాయి" అని ముగించాడు అందరి కరతాళ ధ్వనుల మధ్య!!

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!