తాంబూలం అంటే ఏమిటి?

తాంబూలం అంటే ఏమిటి?

SHYAMPRASAD +91 8099099083
0
తాంబూలం అంటే ఏమిటి? 
.....................................................

కరండసేవకులనే మాట వినేవుంటారు. కరండమంటే పెట్టె. తాంబూలసేవనం  ఒకపుడు హోదాకు చిహ్నం. రాజులు జమిందారులు భూస్వాములు తాము వేసుకోనే తాంబూలపు సరంజామా మోయటానికి ఒక సేవకుడినే వినియోగించేవారు. వారికి మాన్యాలు కూడా ఇచ్చేవారు.

ఇనాటికి కూడా శుభకార్యసమయాలలో తాంబూలం ఇచ్చిపుచ్చుకోవడం ఒక ఆచారం.ఎందుకంటే బంధాలు అనుబంధాలు సంబంధాలు బంధుత్వాలు బలపడతాయి.

ఓమంచి పనికి పురమాయించటానికి తాంబూలం ఇచ్చి మొదలుపెట్టించే సత్సాంప్రదాయం భారతీయులదే.

ఒక కావ్యం అంకితం తీసుకోవాలని ఆశించినా కవికి తాంబూలం ఇచ్చి అందులో కానుకలు సమర్పంచి ఇచ్చేవారు. యుద్ధం చేయమని ప్రోత్సహించటానికి కూడా తాంబూలం ఇవ్వడం అప్పటి రాజుల సాంప్రదాయం.

ఇక కవులు కూడా మంచి పద్యం రాయాలంటే మంచి తాంబూలం ఉండాలని ఆశించేవారు.
ఉదాll క్రింది పద్యంలో చూడండి.


నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు  లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ఇది పెద్దనామాత్యులువారు కోరినట్లున్న చాటువు.

ఓ కావ్యం వ్రాయాలంటే రమణీయమైన స్థలం, అందమైన యువతిచేతి కప్పురవిడెం, అంటే కర్పూరం కలిపిన తాంబూలం, తృప్తిని కలిగించే ఇంపైన భోజనం, ఊయలమంచం, కావ్యంలో తప్పొప్పులు చూపగల లేఖకపాఠకొత్తములు, అనగా
 చెపుతుంటే వ్రాసేవారేకాదు, అందులోని తప్పొప్పులు చూపగల  వ్రాయసగాండ్రు, కావ్యరసాన్ని ఆశ్వాదించగల పాఠకులు వుండాలట.

ఇకముందు చెప్పినట్టుగా తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండంటే యుద్ధానికి వెళ్ళేముందు ఇరువర్గాల సైనికనాయకులకు తాంబూలం ఇచ్చిపంపేవారు. తన్నుకు చావండంటే యుద్ధంలో గెలిచి విజయలక్ష్మితో తిరిగిరండి, లేదా చచ్చి వీరస్వర్గం చేరండని అర్థం.

ఇక తాంబూలం ఘుమఘుమలాడటానికి రుచిగా వుండటానికి అందులో తమలపాకులు, వక్కలు, సున్నంతోపాటు పచ్చకర్పూరం,జాజికాయ, జాపత్రి, , కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము, చెక్కర వంటి సుగంధద్రవ్యాలను ఉపయోగించేవారు.

ప్రాత:కాలే ఫలాదిక్యం తు మధ్యమే
పర్ణాధిక్యం భవే ద్రాత్రౌ తాంబూల మితి లక్షణం.
........... భావప్రకాశం

భావప్రకాశం ప్రకారం తాంబూల సేవనంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వక్కలు ఎక్కువగా వుండేటట్టు,మధ్యాహ్న సమయంలో సున్నం ఎక్కువగా వుండేటట్టు, రాత్రిపూట తమలపాకులు ఎక్కువగా ఉంటేటట్టు చూచుకోవాలట. అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదట.

ఏదైనా సరే మితంగా వుంటేనే అమితానందంగా వుంటుంది. అధికంగా రకరకాల పాన్ బీడాలను, అందులో పొగాకు, ఇతర మత్తెక్కించే పదార్థాలు గుప్పించడం, గుట్కాలు కలపడం ఆరోగ్యానికి.
.......................................................................................................................................... జి.బి.విశ్వనాథ.9441 245857. అనంతపురం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!