ఆమె | she

ఆమె | she

SHYAMPRASAD +91 8099099083
0

 *ఆమె*


ఆమెకి కావలసినంత 

టైము తీస్కోనివ్వండి..

ఆమె తాగే కప్పు కాఫీ అయినా

హాయిగా తాగనివ్వండి ...

ఎన్ని ఉదయాలు తనవాళ్ల కోసం ఎన్ని చల్లని కాఫీలు తాగలేదు...

తను కప్ కాఫీ తాగే ముందు అందరికీి అన్నీ రెడీచేసి కూర్చున్న ఆమెను, కాసేపు అలాగే ఉండనివ్వండి..


బయట హోటల్ కి వెళ్ళినపుడు ఆమెకి నచ్చినవి ఆర్డర్ చెయ్యనివ్వండి..

రోజూ ఇంట్లో అందరికి ఇష్టమైనవి ఆమె వండినపుడు ఒక్క రోజైన తనకు నచ్చింది వండుకుందామని ఆమె ఆలోచించదు కదా...


బయటకి వెళ్ళేటప్పుడు  తయారవ్వడానికి ఆమెకి కావలసినంత సమయం తీస్కొనివ్వండి...

తన  భర్త, పిల్లలు, అందరి ముందు బాగా కనిపించాలని బట్టలు బాగా ఇస్త్రీచేసి,వాటి స్థానంలో ఉన్నాయా లేదా అని పదే పదే మనకి అన్నీ ఆమె సమయానికి సమకూర్చ లేదా?


టీవీ చూసే పది నిమిషాలు అయినా ఆమెకి నచ్చినది చూడనివ్వండి...

ఎంతసేపు ఆమె చూస్తుందని?

చూసినా పరధ్యానంగానే కదా!


అయ్యో అతనికి, పిల్లలకు డిన్నర్ టైమయిందేమో...

అత్తగారికి మందుల టైమేమో ఇదే ధ్యాస కదా ఆమెది..


breakfast ఆలస్యం చేస్తే చెయ్యనివ్వండి ...

ఎంత లేట్ గా చేసినా...

మనకి మాత్రం రుచిగా ఉన్నవి,

బాగున్నవి కదా వడ్డిస్తుంది..

తాను మాత్రం మాడిన అట్లు,

మనచేత* తిట్లు తింటుంది..

( *భర్త/పిల్లలు చేత )


సాయంత్రం వేళ... 

టీ తాగాక..

కాసేపు అన్నీ మరిచి హాయిగా

కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ తనని తాను

మరిచిపోనివ్వండి!

ఎన్ని సాయంత్రాలు తన వారికోసం కేటాయించలేదు ఆమె


ఎన్ని పగళ్లు,

ఎన్నెన్ని రాత్రులు 

తన వారికోసం నిద్ర ,

తిండి మాని సేవ చెయ్యలేదు..

తన కోసం జీవితంలో 

ఆ మాత్రం సమయం ఇవ్వడం సబబే కదా...

*అవునంటారా ? కాదంటారా?*


ఆమె ఒక తల్లి...

         ఒక ఇల్లాలు.. 

         ఒక కోడలు...

స్త్రీ జాతికి...

నా హృదయపూర్వక వందనాలు!

 👏👏👏👏👏👏👏👏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!