కథ - జీవితం నుండి నేర్చుకున్న పాఠాలు:(Lesson's learned from Life)

 జీవితం నుండి నేర్చుకున్న పాఠాలు:(Lesson's learned from Life) Read completely ఒక చిన్న పారిశ్రామిక వేత్త ముంబై లో నివసిస్తూ ఉండేవాడు... అతను తన వ్యాపార లావాదేవీలలో బాగా నష్టపోయి.. తిరిగి కోలేకోలేని స్థితిలో ఉన్నానని.. తనకు చావే శరణ్యమని భావించి.. చని పోవాలని నిర్ణయించుకుని... చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు.. ఇంతలో అతను కూర్చున్న బెంచి మీదకే ఒక ముదుసలి వచ్చి కూర్చుని ఏమి నాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావు... అని అడిగాడు... వ్యాపారి తన బాధనంత చెప్పుకున్నాడు... ఆ ముదుసలి నాయన నీ బాధలు తీరాలంటే ఎంత అవసరమవుతుంది.. అని విచారించి.. 50,00,000 రూపాయలకు చెక్ రాసి ఇచి.. వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి మాయమయ్యాడు.... మన వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని ఉండడం చూసి ఆశ్చర్య పోతాడు... దేవుడు తనకు మరో అవకాశాన్ని ఇచ్చాడని కృతఙ్ఞతలు చెప్పుకుని... తిరిగి ఇంటికి వస్తాడు.... అతనికి ఆ చెక్ వాడ కుండానే పని ఎలా పూర్తీ చేయాలి అని plan చేద్దామని అనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు... అవి అన్నీ సంతృప్తిగా అనిపించి .. తెల్లవారిన తర్వాత వాటిని అమలులో పెట్టాడు... అవి 1. తను ముడి సరకు రవాణా చేసినందుకు ఇవ్వవలసిన రుణ దాత లందరినీ సమావేశ పరిచి తన పరిస్థితి వివరించి తన రుణ సదుపాయాన్ని.. 30 రోజుల నుండి 45 రోజులకు మార్చమని ప్రాధేయ పడ్డాడు... అదేమీ చిత్రమో అందరూ దానికి ఆమోద యోగ్యం తెలిపారు.... దీని వలన తనకు 15 రోజుల పాటు వడ్డీ లేని రుణసదుపాయం దొరికి కొంచెం వెసులు బాటు కలిగింది... 2. తను వస్తువులు అమ్మి ... రావలసిన డబ్బును... తనకు బకాయి పడిన వాళ్ళందరినీ పిలిచి తన పరిస్థితి తెలిపి తనకు 40 రోజుల క్రెడిట్ పీరియడ్ నుండి 30 రోజులకు కుదించమని ప్రదేయ పడ్డాడు... దీనివలన మరికొంచెం వెసులు బాటు కలిగి... మొత్తం 30 రోజుల పెట్టుబడి వ్యయం చేతికి అందింది 3. ఈ డబ్బుతో రిటైల్ లో కొనే సరుకును హోల్ సేల్ మార్కెట్లో ..... అదే ప్రదేశంలో డబ్బు చెల్లిస్తే పొందే ప్రయోజనలన్నీ పొంది... తక్కువ రేట్ లో సరుకు కొనటానికి వీలవుతుంది... దీనివలన ఉత్పాదన వ్యయం తగ్గి.. లాభాల బాట పడే అవకాశం దొరుకుతుంది... ఈ విధం గ సంవత్సరం గడిచే సరికి అతని రుణ బాధలన్నీ తీరిపోయి... తిరిగి తన అప్పు చెల్లించే స్థాయికి చేరుకుంటాడు... తను ఇచిన మాట తీర్చుకునేదానికి,,, అదే సమయంలో మన ముదుసలిని కలవటానికి ఆ పార్క్ కే వెళ్లి... అతన్ని ఆత్రంగా కలిసి అతను ఇచిన చెక్ అతనికే ఇచి తన కృతఙ్ఞతలు తెలుపుకున్దామని అనుకుంటాడు..... ఇంతలో ఒక హాస్పిటల్ నర్స్ అక్కడికి వచ్చి..... ఏమండీ ఈ ముదుసలి ఒక పిచివాడు ... తను రతన్ టాటా అనుకుంటాడు... మీకేమి ఇబ్బంది పెట్టలేదు కదా అని క్షమాపణలు అడిగి అతనిని అక్కడినుండి తీసుకు వెళుతుంది... మన వ్యాపారి హతాశుడయి మరొక్క మారు ఆ చెక్కును పరిశీలించి చూస్తాడు.. అది ఒక చెల్లని చెక్కు అని అర్ధమవుతుంది... తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వసమని... అది ఉంటె చేయలేనిదేమి లేదని అర్ధమవుతుంది... ఈ మాత్రం దానికేన తానూ చనిపోదామనుకుంది... తనను గెలిపించింది డబ్బు కాదు... మొక్కవోని ఆత్మవిశ్వాసమే తనను గెలిపించిందని భావిస్తాడు... క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు... మొక్కవోని ఆత్మా విశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించాలేనిదేమీ లేదని భావిస్తాడు... జీవితంలో క్లిష్ట మయిన సమస్యలు వచ్చినపుడే సంయమనం పాటించాలి... మనం తీసుకునే నిర్ణయాలు జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసేటపుడు ఇంకా జాగ్రత్తగా... ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి...తొందరపడి ఏ నిర్ణయానికి రాకూడదు... క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు... మొక్కవోని ఆత్మా విశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించాలేనిదేమీ లేదు... కృషి ఉంటె మనుషులు రుషులవుతారు... మహా పురుషులవుతారు.. మనకు జీవితం 100 సమస్యలను ఇచినా ఒక పరిష్కారం చాలు.. అవన్నీ తొలగిపొవటానికి... So friends be inspire, don’t worry...

Post a Comment

1 Comments