old generation 53 సం.రాలు నిండిన మేము రెండు తరాలకు సాక్షులం

old generation 53 సం.రాలు నిండిన మేము రెండు తరాలకు సాక్షులం

SHYAMPRASAD +91 8099099083
0

 ప్రియమైన స్నేహితులు............. సరదాగా చదివి ఆనందించి ........ నవ్వుకోండి ......!                                 🙏  🙏                             

53 సం.రాలు నిండిన మేము రెండు   తరాలకు సాక్షులం..,

స్వచ్చమైన గాలి, నీళ్ళు పచ్చటి పొలాలు. 🌾🌴

పరిశుభ్రమైన...వాతావరణంలో  పుట్టిపెరిగిన వాళ్ళం... 

👦

తలపైనుండి చెంపలమీదకు     కారిపోయేలా  నూనె రాసుకుని.......

📚 

చేతికి పుస్తకాల సంచి తగిలించుకుని...

ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను

ఒక్కొక్కళ్లను కలుస్తూ పెద్దగుంపుగా.......  

👦. 👦 👩. 👧

 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి     కాళ్లకు చెప్పులు లేకుండా నడచి   వెళ్ళిన తరం వాళ్ళం.....🚶🏃

జారిపోయే నిక్కరుమీదకు   మొలతాడు లాక్కుంటూ చిరుగు    బొక్కలకు గుడ్డముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం ....., 🕺

10వ తరగతి అయ్యేవరకు నిక్కరు వేసుకున్న తరం మాదే.....! 🌲

🤸🤹

గోలీలు, బొంగరాలు,

కర్రాబిళ్ళ, నేలా బండ, కుంటాట, ఉప్పాట, ఏడు పెంకులాట.....

🥎 బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకుంటే  బంతిలాగ వొంటిమీద    ముద్రపడే  ముద్రబాల్ లాంటి    ఆటలాడిన తరం...,

🚴🏊🤽

బడికి వేసవికాలం సెలవులు రాగానే   తాటి చెట్లూ, సీమ తుమ్మ చెట్లూ..,     ఈతచెట్లు ఎక్కి కాయలు కోసుకొని    తిన్నవాళ్ళం, చెరువులు,     కాలవల్లోఎండ్రకాయలు, చేపలు పట్టి..,. వొంకల్లో, వాగుల్లో స్నానాలు చేసిన   వాళ్ళం. తాటిబుర్రలు బండితో ఆడినోళ్లం...

🪔🪔🪔

దీపావళికి తాటిబొగ్గుల రవ్వల దివిటీ కోసం వళ్ళంతా మసి పూసుకొని మరీ తయారుచేసుకనే వాళ్ళం.

5 పై.ల ఐస్ తిన్నది మేమే... పది పైసలతో బళ్ళో మ్యాజిక్ షో చూసింది మేమే.... 

🌦️ వర్షం వస్తే తాటాకు, గొడుగూ,    యూరియా సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళినవాళ్ళం......!

📖 second hand text books     కోసం పరీక్షలు 

అయినప్పటినుండి ముందు తరగతివాళ్ళని బతిమాలిన తరం......., 🤣

🚴సకెండ్ హ్యాండ్ సైకిల్ తో పక్క  తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...

✉️ ఉత్తరాలు రాసుకున్న...అందుకున్న తరంవాళ్ళం... 🌴

పండగ సెలవులు,

వేసవి సెలవులు, దసరా, సంక్రాంతి   సెలవులు

ఎన్ని సెలవులు వొచ్చినా ఐదుపైసలు   ఖర్చులేకుండా ఆనందాన్ని. 

 🤼  🏃🏻 ⚽️ 🏸 🪁🏹  🤸  ⛹️. 🏊   అనుభవించిన తరం వోళ్ళం...,

👨👩👧👦 

పెద్దలు /పిల్లలూ అందరం వీధి అరుగులమీద కూర్చుని ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు ఆనందంగా    కబుర్లు చెప్పుకుని, పొట్ట    చెక్కలయ్యేలా

నవ్వుకున్నదీ మేమే.... ☘️

ఊర్లో ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా,.   మన ఇంట్లో  జరిగినట్లు, అంతా మాదే,

అంతా మేమే అన్నట్లుగా భావించి    స్వచ్చందంగా / నిస్వార్థంగా    పాలుపంచుకున్న తరం మాదే...

🍁

🕵🏻 ఊర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని పిల్లలు అందరం కలిసి ఊరుచుట్టూ తెల్లవార్లూ ఎన్నో రాత్రులు

🔦టర్చిలైట్స్, కర్రలు పట్టుకుని  కాపలా కాసినవాళ్ళం మేమే.....

👨👩👧👧

చుట్టాలు వస్తేనే అమ్మ కోడికూర..... వండిపెట్టిన తరం....🍁

అత్తయ్యా మామయ్య, పిన్ని, బాబాయ్, అక్కా, బావఅంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,

స్కూలుమాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం........... 🤣🤣🌺

పుల్లలపొయ్యి మీద అన్నం/కూర     ఉడుకుతున్నప్పడు వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరంవాళ్ళం..,🌱

పొయ్యమీద నుంచి నేరుగా పళ్ళెంలోకి వచ్చిన వేడివేడి అన్నంలో ఆవకాయ,    వెన్నపూస వేసుకుని పొయ్యిదగ్గరే  

తాతయ్యలు అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మానాన్నా, పెదనాన్న. పెద్దమ్మ, పిన్ని బాబాయ్, అత్తయ్య మామయ్య, అక్కలు చెల్లెళ్లు అన్నయ్యలు   తమ్ముళ్లు అందరం ఒకే దగ్గర చేరి    మధురమైన అనుభూతితో  కూర్చుని అన్నం తిన్న తరం ..,..🦋

అమ్మమ్మలు / నాయమ్మలచేత గోరుముద్దలు తిన్నది, అనగనగా ఒక రాజు....కథలు విన్నది మేమే.......  ,🌵

నూనె పిండితో నలుగు పెట్టించుకుని     కుంకుడుకాయ పులుసుతో తలంటు స్నానం చేయించుకున్న తరం...,🍀

📻రడియో,

దూరదర్శన్📺

టూరింగ్ టాకీస్📽️. కాలం చూచిన వాళ్ళం... .🍁

🎥 40 పైసల నేలటిక్కెట్ తో నేల   మీదకూర్చుని....., 

1.25 రూపాయల chair టిక్కెట్ తో, రూ.2 ticket బాల్కనీలో కూర్చుని సినిమా చూసిందీ మేమే...🌵

స్కూల్, కాలేజీరోజుల్లోనే ఎలక్షన్లు   చూచినవాళ్ళం.. .🍂

అమ్మానాన్నాతో సంవత్సరానికి   ఒకసారి, పరీక్ష పాస్ అయ్యావా.. ..    అని మాత్రమే అడిగించుకున్న తరం వాళ్ళం...🌹

📲

ప్రస్తుతమున్న  Whatsapp Fb skype లు మీతోపాటు సమానంగా     వాడేస్తున్న మాతరం...,

మేమే ఆ తరానికి, ఈ తరానికి మధ్యవర్తులం...

 మేమే-- -💐

అవును.......రెండుతరాలమద్యలో    జరిగిన అనూహ్యమైన మార్పులకు   మేమే సాక్షులం  🌸

అప్పటి గుండెలోతుల్లోనుంచి   వచ్చిన     ప్రేమని చూసిన వాళ్ళం..........!

ఇప్పుడు గుండీలపైనుంచి వచ్చే    ప్రేమని 

చూస్తున్నవాళ్ళం.......!! 🌷

ఒక  విధంగా  చెప్పాలంటే మేం చాలా     అదృష్టవంతులం..

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!