Who is a good friend? మంచి స్నేహితుడు ఎవరు?

Who is a good friend? మంచి స్నేహితుడు ఎవరు?

SHYAMPRASAD +91 8099099083
0

 

☘️ *మంచి స్నేహితుడు ఎవరు?* ☘️

 

చాలాకాలం క్రిందట మంచి తెలివి తేటలు, వివేకం ఉన్నఒకరాజు ఉండేవాడు. అతడి పేరుప్రతిష్టలు ఇతర రాజ్యాల వరకు పాకిపోయినవి. అనేక కళలలో ఆరితేరిన కళాకారులు అతని మెప్పును, పారితోషికం పొందేదుకూతడి దర్బారుకు విచ్చేసేవారు.

అందులో కొందరు తమ తెలివితేటలు ప్రదర్శించి రాజు వివేకాన్ని పరీక్షించడానికి కూడా దయచేసేవారు. ఒకరోజు ఒక కళాకారుడు రాజుదర్బారుకు వచ్చాడు.

తాను తయారుచేసిన మూడుబొమ్మలనుకూడా అతను తనతో కూడా తీసుకొచ్చాడు. వ్యత్యాసం లేకుండా ఒకేలా ఉండే ఆమూడు బొమ్మలనూ రాజు ముందు ఉంచుతూ "రాజా ఈ మూడు బొమ్మలు, , జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మ, ఏది వికారమైనబొమ్మో, ఏది అందంగా కాక, వికారంగాకాక ఉన్నదో పరిశీలించి చెప్పండి."అని ప్రార్ధించాడు. కళాకారుడు మాటలు విన్న రాజు ఆమూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని పరిశీలించాడు. ఆమూడుబొమ్మలూ ఒకేలా ఎత్తుగా ఉంటూ బరువు కూడా సమంగా ఉండటం, అన్నింటిపోలికలూ ఒకేలా ఉండటం రాజు గమనించాడు.ఆ మూడుబొమ్మల్లో ఎలాంటి వ్యత్యాసాన్ని అతడు

ఆమూడుబొమ్మలనూ జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు ఒకబొమ్మ రెండు చెవులలో రంధ్రమున్న సంగతిని గుర్తించాడు. ఒకసూదిని రంధ్రాలున్న బొమ్మ చెవిలొ ఒకవైపు ఉంచి ఆ బొమ్మను కదిలించాడు.

సూది మరో చెవిలో సునాయాసంగా బయటకు వచ్చినది. మరొబొమ్మచెవిలో మరియూ నోటిలో రంధ్రముండటాన్ని రాజు గమనించాడు. వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు దూరచినసూది

నోటిగుండా బయటకు వచ్చినది. మూడవబొమ్మకు ఒక్క చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు  చూడలేకపోయడు చెవిలో దూర్చిన సూది బయటకు రాకుండా లోపలే ఉండటాన్ని రాజు గమనించాడు. అతను చేసిన తెలుసుకొనిన చేసిన పనులను గురించి రాజు గంభీరంగా ఈ ఆలోచించాడు.

కాసేపైన తరువాత ఆ కళాకారుణ్ణి , ఉద్దేశించి "మీరు చాలా తెలివి కలిగిన కళాకారులు' అని అభినందించాడు. ఆ తరువాత పరిపూర్ణమైన వివేకాన్ని మీరు ఈమూడు బొమ్మల ద్వారా జనాలకు బోధించడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది.

మీ ఈ మూడుబొమ్మల మూడురకాల మిత్రులను గురించి చెబుతున్నాను. మనకష్టాలను సహనుభూతితో వింటూ, మనరహస్యాలను కాపాడుతూ, మనకు సహాయం చేయగల నిజమైన స్నేహితుడను మనము ఆశించాలి.

ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడు గురించి చెబుతుంది. మీరు మీకష్టాలను, బాధలను వినిపిస్తే అతడు అన్నింటిని వింటున్నాట్టూ అభినయిస్తారు.

కానీ అతడు నిజంగా వినడు. అతడు ఏ ఒక్కరికి ఎలాంటి సహాయం చేయడు. చెవి ద్వారా విన్నది మరో చెవి ద్వారా వదిలి వేస్తాడు. రెండవరకం స్నేహితుడికి ఈ రెండవరకం బొమ్మ ప్రతినిధిత్వం వహిస్తుంది. మీరహస్యాలను అతనితో చెప్పినప్పుడు సానుభూతితో వింటాను.

కానీ ఇతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి మీరహస్యాలను ఇతడు బట్టబయలు చేస్తాడు. ఇతడు తనలో మనరహస్యాలను దాచడు. ఈ మూడవ బొమ్మే చాలా ఉత్తమమైనది. ఈ బొమ్మ ఒక ఉత్తమ స్నేహితుడికి ప్రతిరూపం.

మీరు చెప్పే మాటలు అతడు చాలా ఓపికతో శ్రద్దతో వింటాడనీ మీరునమ్మకంగా నమ్మవచ్చును. మీరహస్యాలను అతడు తనలో భద్రంగా తనలో దాచుకున్న.

ఎంత కష్టమైనా సరే అతడు ఆ రహస్యాలను బట్టబయలు చేయడు. ఇటువంటి మిత్రుడి సన్నిధిలో మీరు సురక్షితంగా ఉండగలరు.

రాజుగారి మాటలు, విశదీకరణ ఆ కళాకారుడికి బాగానచ్చినాయి. అతడు రాజు వివేకాన్ని, తెలివితేటలను పొగిడాడు.

 

నీతి: మీ స్నేహితుల రహస్యాలను బయట పెట్టకండి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!