కాలిక్యులేటర్ లోని రహస్య బటన్లు - GT, MU, M+, M-, MRC ఎందుకు వాడుతారు?
ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం.
అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి.
GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి.
కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా...
🔢 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total)
GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది.
💡 ప్రో టిప్: పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది.
💰 2. MU - మార్కప్ (Mark-Up)
ఈ బటన్ ని ఖర్చు, లాభం, డిస్కౌంట్ లను ఖచ్చితంగా, ఈజీ గా లెక్కగట్టేందుకు వాడుతారు. ఉదాహరణకి, మీరు ఒక వస్తువును 400 రూపాయలకు కొనుగోలు చేశారు అనుకోండి, దానిపై 100 రూపాయలు మీకు రావాలి ఎట్ ది సేమ్ టైం కస్టమర్‌కు 20% డిస్కౌంట్ ఇవ్వాలి.
📝 MU బటన్ ఎలా వాడాలి:
స్టెప్ 1: కొన్న ధర + లాభం = 400 + 100 = 500
స్టెప్ 2: 500 ప్రెస్ చేసి → MU → 20% → ఫలితం: 625
సింపుల్! కస్టమర్ కు చెప్పాల్సిన ధర 625 రూపాయలు
🎯 బిజినెస్ టిప్: కస్టమర్ కు డిస్కౌంట్ లు వారి ముందే లెక్కగట్టినా వారికి ఒక్క ముక్క అర్థం కాదు. మీకు లెక్క కూడా ఈజీ అయిపోతుంది!
🧠 3. M+, M- మరియు MRC - మెమరీ ఫంక్షన్స్
ఈ బటన్లను కాలిక్యులేటర్ మెమరీలో లెక్కలు పొందేందుకు వాడతారు:
M+
మెమరీ ప్లస్
M-
మెమరీ మైనస్
MRC
మెమరీ రీకాల్
🔄 M+, M-, MRC బటన్లు ఎలా వాడాలి:
ఉదాహరణ: (10 × 3) - (2 × 3) = ?
- 10 × 3 = 30 → M+ నొక్కండి (మెమరీలో 30 సేవ్)
- 2 × 3 = 6 → M- నొక్కండి (మెమరీ నుండి 6 మైనస్)
- MRC నొక్కండి → ఫలితం: 24 ✅
💪 పవర్ ఫీచర్: పెద్ద పెద్ద లెక్కలు చేసేప్పుడు పెన్ తో పేపర్ పై నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు!
📋 క్విక్ రిఫరెన్స్ గైడ్
❓ తరచుగా అడిగే ప్రశ్నలు
Q: GT బటన్ అన్ని కాలిక్యులేటర్లలో ఉంటుందా?
A: చాలా వరకు బిజినెస్ మరియు సైంటిఫిక్ కాలిక్యులేటర్లలో ఉంటుంది. సాధారణ కాలిక్యులేటర్లలో లేకపోవచ్చు.
Q: MU బటన్ వాడటం కష్టమా?
A: లేదు, ఒకసారి అర్థం అయిపోతే చాలా సింపుల్. షాప్ కీపర్లకు చాలా ఉపయోగకరం.
Q: మెమరీ ఫంక్షన్ ఎందుకు అవసరం?
A: పెద్ద లెక్కలు చేసేటప్పుడు మధ్యలో వచ్చే ఫలితాలను గుర్తుపెట్టుకోవడానికి. పేపర్‌పై రాయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.
Q: ఈ ఫీచర్స్ మొబైల్ కాలిక్యులేటర్లలో ఉంటాయా?
A: కొన్ని అడ్వాన్స్డ్ కాలిక్యులేటర్ యాప్స్లో ఉంటాయి. సాధారణ యాప్స్లో లేవు.
📱 షేర్ చేసి మిత్రులకు సహాయం చేయండి:
WhatsApp • Facebook • Twitter • Telegram లో షేర్ చేయండి!
🎯 ముగింపు
అబ్బా ఇంతుందా వీటిలో అని ఆశ్చర్యపోతున్నారా! ఇవీ మనం రెగ్యులర్ గా వాడే ఫిజికల్ కాలిక్యులేటర్ లో మనకు తెలియని విషయాలు. మనం నిత్యం వాడే వస్తువు లోనే మనకు ఇన్ని తెలియని విషయాలుంటే ఇక మన చుట్టూ ఇంకెన్ని తెలియని విషయాలుంటాయో ఆలోచించండి.
🎓 గుర్తుంచుకోండి: అందుకే సమయాన్ని వృధా చెయ్యకుండా అర్జెంటుగా నాలెడ్జి పెంచుకోండి!
అదేదో సినిమాలో మన బ్రహ్మి చెప్పినట్టు "నాలెడ్జి ఈజ్ డివైన్" మరి...ఎంత తాగితే...
సారీ ..ఎంత తెలుసుకుంటే అంత లాభం...🙂
Hi Please, Do not Spam in Comments