ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్సు దినోత్సవం ( ѕ¢ιєи¢є ∂αу )

ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్సు దినోత్సవం ( ѕ¢ιєи¢є ∂αу )

SHYAMPRASAD +91 8099099083
0
🔭🔭нαρρу ѕ¢ιєи¢є ∂αу🔭🔭

🍥జాతీయ సైన్సు దినోత్సవం సందర్భం గా 🍥💮

🍀ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్సు దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ వరవడి 1986వ సంవత్సరం నుండి ప్రారంభమైంది. దేశంలో వర్తమాన శాస్త్ర సాంకేతిక ప్రగతిని సమీక్షించుకోవడం, భవిష్యత్తులో ప్రతిభా రంగాలను గుర్తించి ప్రోత్సహించడం, దేశం యావత్తు, ఆ రోజును ఓ పండుగలా జరుపుకోవడం జాతీయ సైన్సు దినోత్సవ ప్రధాన లక్ష్యాలు.
🍀ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేక అంశం మీద ఆ రోజు నుంచి మరుసటి జాతీయ సైన్సు దినోత్సవం వరకు కార్యక్రమాలను నిర్వహించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా జాతీయ సైన్సు దినోత్సవ సంబరాల్లో అంతర్భాగం.
🍀2018 సంవత్సరపు జాతీయ సైన్సు దినోత్సవ ప్రత్యేక అంశం: 'సమతులానాభివృద్ధి - భవిత కొరకై శాస్త్ర సాంకేతిక రంగాలు'(Science and Technology for Sustainable Future).. 2017 సంవత్సరపు అంశం : ప్రత్యేక దివ్యాంగులకై శాస్త్ర సాంకేతిక రంగాలు (Science and Technology for Specially Abled Persons)సాధారణ శారీరక అంగ నిర్మాణం లేనందు వల్ల ప్రత్యామ్నాయాంగిక పద్ధతుల్లో జీవన కార్యక్రమాల్ని నిర్వర్తించుకొనేలా శారీరక అంగ వైకల్యం ఉన్న వారికి శాస్త్ర సాంకేతిక రంగాలు సహకరించేలా సాధనాలు ఉత్పత్తి చేయాలన్న ఆకాంక్షతో 2017 సంవత్సరపు లక్ష్యం ఉద్ధేశించబడింది.
🍀పర్యావరణానికి, జీవావరణానికి శక్తి వనరుల వినియోగానికి గడ్డు కష్టాలు లేకుండా భవిష్యత్తరాల కోసం భూగోళాన్ని సమతులన పద్ధతిలో బదలాయించడం వర్తమాన తరపు కర్తవ్యమన్న భావన ఆధారంగా ఈ సంవత్సరపు నినాదం ఏర్పడింది.
🍀ఫిబ్రవరి 28వ తేదీనే జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. రామన్‌ ఫలితం (Raman Effect) గురించి భారతీయులందరూ వినే ఉంటారు. ఆకాశం నీలి రంగులో ఉంటుంది ! సముద్రం కూడా నీలిరంగులో కనబడుతుంది. ఎందుకని? సూర్యకాంతిలోని సప్తవర్ణాల్లో నీలికాంతి ఎక్కువగా వెదజల్లబడుతుంది. ఫలితంగా ఆకాశము, సముద్రం నీలిరంగులో కనపడతాయి. దీనినే కాంతి పరిచ్చేదనము "స్కేటరింగ్ ఆఫ్ లైట్" అంటాము.
🍀ఈ దృగ్విషయాన్ని రేలీ అనే శాస్త్రవేత్త పరిశీలించాడు. కాబట్టి రేలీ పరిచ్చేదనము లేదా రేలీ స్కేటరింగ్ అంటాము. ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం" గా మనం పరిగణిస్తున్నాం. కారణం, 1928వ సంవత్సరం, ఫిబ్రవరి 28వ తేదీన భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ (సర్.సి.వి.రామన్) ఒక వినూత్న, విజ్ఞాన శాస్త్ర ప్రయోగ ఫలితాన్ని ప్రపంచానికి అందజేశాడు.
🍀 "ఏక వర్ణకాంతి, వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను "స్టోక్ రేఖ" లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా "వ్యతిరేక స్టోక్" రేఖలనీ అంటారు.
ఇటువంటి దృగ్విషయాన్ని "రామన్ ఫలితము" అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్ పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు.
🍀రేలీ పరిచ్చేదనంలో పతనకాంతి hv, పరిచ్చేదనకాంతి శక్తి (hv) రెండూ సమానము.రామన్ పరిచ్ఛేదనంలో పతనకాంతి శక్తి (hv1) , పరిచ్చేదనకాంతి శక్తి (hv2) సమానము కావు. hv1≠hv2.
🍀రామన్ వర్ణపటములో ప్రధాన రేఖకు ఒకవైపు స్టోక్ రేఖలు క్రాంతి వంతమైన మరోవైపు ప్రతి స్టోక్ రేఖలు (కాంతిహీన రేఖలు) ఏర్పడటాన్ని పరిశీలించవచ్చు. ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని గూడ అంటారు. ప్రపంచం నలుమూలల రామన్ పేరు మారుమోగిపోయింది.
🍀భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది. ఫిబ్రవరి 28, 1928 సంవత్సరం నాడు సర్‌ సి.వి.రామన్‌ తన Phd శిష్యుడయిన క్రిష్ణన్‌తో కలిసి ఎఫెక్ట్‌ను ఆవిష్కరించారు.
🍀ఓ నూతన కాంతి (A New kind of Radiation) అనే పతాక శీర్షికతో Nature (ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనా పత్రాలను ప్రచురించే పత్రిక(Journal) లో రామన్‌ ప్రచురించాడు. రెండేళ్లు తిరక్కుండానే 1930 సంవత్సరంలో సి.వి.రామన్‌కు భౌతిక శాస్త్ర నోబెల్‌ బహుమతిని బహూకరించారు.
🍀ఆ రోజు నుంచి నేటి వరకు సుమారు 90 సంవత్సరాలు గడిచినా భారతదేశానికి శాస్త్ర రంగాల్లో మరో నోబెల్‌ బహుమతి రాకపోవడం విచారించదగ్గ విషయం. అది ప్రస్తుతం అప్రస్తుతం. అంతర్జాతీయంగా భారతదేశ శాస్త్రాభివృద్ధిని శిఖరాగ్రాన నిలిపిన రామన్‌ ఫలితం ఆవిష్కరణ జరిగిన రోజయిన ఫిబ్రవరి 28 ని ప్రేరణ సూచనగా 1986 ఫిబ్రవరి 28 నుంచి జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
రామన్ ఫలితము - అనువర్తనాలు(ఉపయోగాలు)
🍥 అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.
🍥స్పటికంలో పరమాణువుల అమరిక, స్పటిక జాలకం, స్పటికీకరణ జలవంటి విషయాలు తెలుసుకోవచ్చు.
🍥రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు  తెలుసుకోవచ్చు.
🍥అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.
🍥కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
🍥పలుచటి రాళ్ళలో స్పటిక నిర్మాణం ఎక్కువ వేడిమి, పీడనాల వల్ల ఖనిజాల స్వభావం జీవ ఖనిజాల లక్షణాలు తెలుసుకోవచ్చు.
🍥మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
🍥వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.
🍥మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.
🍥డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.
🍥పత్తాశయంలోని కొన్ని రకాల రాళ్ళు, జీవ భాగాల అయస్కాంతత్వం రామన్ పరిచ్ఛేదన పద్ధతిలో తెలుసుకోవచ్చు.
🍥 మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
🍥వివిధ రకాలైన మందులు, ఔషధాలు డి.యన్.ఏ.పై చూపే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
🍥వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.
🍥జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.
🍥ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.
🍥ఏక, ద్వి, త్రిబంధ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
🍥ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన మరియు భ్రమణశక్తి స్థాయిల గూర్చి తెలుసుకోవచ్చు.
🍥కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.
🍥ఘన పదార్ధల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ విఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.
🌷🍀🔸🍥🏵🌐

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!