వైద్యుడి ఎంపిక

వైద్యుడి ఎంపిక

ShyamPrasad +91 8099099083
0


వైద్యుడి ఎంపిక
వృద్ధురాలైన రాజమాత నాగమాంబకు ఉన్నట్టుండి విపరీతమైన మొకాళ్ళనొప్పులు
ఆరంభమయ్యూయి. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా వ్యాధిని నయంచేయలేకపోయూరు.
లేచి నిలబడడానికీ, నడవడానికీ తల్లి పడే యూతన చూసి మహారాజు వీరసింహుడు వేదనకు
లోనయ్యూడు. రాజుగారి విచారాన్ని గమనించిన ప్రధాన మంత్రి, మహారాజా, రాజమాత అస్వస్థతకు
ప్రకృతివైద్యం చేయిస్తే ఫలితం కనిపించవచ్చు, అన్నాడు.
మాట వినగానే రాజుకు తల్లి ఆరోగ్యం గురించి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. వెనువెంటనే
దేశమంతటా చాటింపు వేయించి దేశం నలుమూలల నుంచి ప్రకృతి వైద్యులను రప్పించారు. వారి
అర్హతలను, అనుభవాలను పరిశీలించి ప్రధానమంత్రి నలుగురు వైద్యులను రాజమాత వైద్యానికి
నియమించాడు. వాళ్ళ నలుగురూ కలిసి రాజమాతకు ఏమాత్రం కష్టం కలగకుండా, వైద్యం ప్రారం
భించారు. ఆమె తీసుకునే ఆహారంలో మార్పులు చేశారు.
అడవిలోని కొన్నిరకాల ఆకులను తెచ్చి, ఆముదంలో దోరగా వేయించి మోకాళ్ళకు కట్టు కట్టేవారు.
ఆవిరి, తైలధార పద్ధతులలో కొన్ని రోజులు క్రమం తప్పకుండా చికిత్స చేశారు. దాంతో మూడు
వారాలకల్లా రాజమాతకు నొప్పి తగ్గిపోయింది. ఊతకర్ర సాయం కూడా లేకుండా మునుపటికన్నా
ఎంతో ఉత్సాహంగా, హాయిగా లేచి నడవసాగింది. తల్లిని చూస్తూంటే మహారాజుకు సంతోషం
కలిగింది.
తల్లికి వైద్యం చేసిన నలుగురిలో ఒకరిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియ మించాలనుకున్నాడు
రాజు. అయితే, నలుగురూ ఒకే వయసు, అనుభవం కలిగిన వారే. ఎవరిని నియమించడమా అన్న
సందిగ్ధంలో పడ్డ రాజు విషయంగా మంత్రిని సంప్రదించాడు. ఇందులో పెద్దగా
ఆలోచించవలసిన దేమీ లేదు. నలుగురూ వైద్యంలో నిపుణులే గనక, నలుగురిలో తమకు
నచ్చిన వ్యక్తికి పదవి ఇవ్వండి ప్రభూ, అని సలహా ఇచ్చాడు మంత్రి.
రాజు నలుగురిలో సంగమేశ్వరశాస్ర్తిని ఆస్థాన ప్రకృతి వైద్యుడిగా నియమించి, తక్కిన ముగ్గురికి
విలువైన కానుకలిచ్చి పంపాడు. రోజు సాయంకాలం మంత్రితో కలిసి ఉద్యానవనంలో పచార్లు
చేస్తూండగా రాజు ప్రకృతి వైద్యుడి నియూమకం గురించి ప్రస్తావించాడు. అప్పుడు మంత్రి,
మహారాజా! నలుగురిలోకీ సంగమేశ్వరశాస్ర్తి అద్భుతమైన వైద్యుడు. అందులో ఏమాత్రం
సందేహం లేదు, అన్నాడు.
ఆధారంతో అంతరూఢిగా చెప్పగలుగుతున్నావు? అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా. ప్రభువుల
మన్నన, గుర్తింపు పొందాడంటే అతడు తప్పక ఉత్తమ వైద్యుడేకదా! అన్నాడు మంత్రి చిన్నగా
నవ్వుతూ. మంత్రి లౌక్యానికి మనసులో నవ్వుకున్న రాజు, చికిత్సా విధానంలో నలుగురూ
ఆరితేరినవారే. అయితే, సంగమేశ్వరశాస్ర్తి మాత్రం చికిత్స ప్రారంభించిన తొలి రోజు నుంచే వ్యాధి
తప్పక నయమవుతుందని తల్లిగారి మనసులో విశ్వాసం కలిగిస్తూ వచ్చాడు.
సంగతి తల్లిగారే నాతో చెప్పారు. వైద్యుడన్న వాడు స్పష్టమైన రోగ నిర్ధారణ చేసి, సరైన
మందులు వాడాలి; చక్కని చికిత్సా విధానంతోపాటు, రోగి మనసులో నమ్మకం కలిగించేవాడుగా
ఉండాలి. చికిత్స పొందుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించగలవాడుగా ఉండడం చాలా
ముఖ్యం. లక్షణం సంగమేశ్వరశాస్ర్తిలో ఉండడం వల్లే అతన్ని ఎంపిక చేశాను, అన్నాడు.

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!