చైనా అగ్రరాజ్యం ఎట్లా అయ్యింది ?

*చైనా అగ్రరాజ్యం ఎట్లా అయ్యింది ?*
ఇవి జవాబులు 👇
‘ఆకలిగా ఉన్నవాడికి ఒక చేపనిస్తే ఒక రోజు మాత్రమే తినగలుగుతాడు. చేపలు పట్టడం నేర్పితే జీవితాంతం తినగలుగుతాడు’.

🇨🇳 చైనా దాన్ని ఆచరణలో పెట్టింది.
ప్రజల ఆకలి సమస్యలకు ఉచితాలు ఇవ్వడం శాశ్వత పరిష్కారం కాదని, ఉపాధి మాత్రమే సరైన మార్గమని గుర్తించింది. దేశ ప్రజలను ఉత్పాదక రంగం వైపు మళ్ళించి, వారు చేసిన ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెటింగ్‌ కల్పించింది.

🌕 భూగోళంపై విస్తరించిన ప్రతి దేశం, ప్రతి ప్రాంతంలో తమ ఉత్పత్తులను అమ్ముకునే స్థాయికి చేరుకుంది.

🦉దేశంలో పిచ్చుకల వల్ల ధాన్యాలు దుర్వినియోగం అవుతున్నాయి, కాబట్టి పిచ్చుకలను చంపేయాలని, చైనా ప్రభుత్వం ప్రజలకు పిలుపు నిచ్చింది.
రెండేళ్లలో దేశంలో మచ్చుకి కూడా పిచ్చుక కానరాని పరిస్థితి వచ్చింది.
అయితే, పిచ్చుకల వల్ల లాభమేనని అవి ఉండడం వల్లనే క్రిమికీటకాలు తగ్గుతాయని తెలుసుకుని 1960లో రష్యా నుంచి పిచ్చుకలను దిగుమతి చేసుకుంది.

👿 వరుసగా నాలుగేళ్ళు దుర్భిక్షం,భయంకరమైన కరువును అనుభవించింది.
ప్రపంచమంతా ఆ నాడు చైనా అవివేకాన్ని చూసి నవ్వుకుంది. అలాంటి చైనా క్రమంగా విజ్ఞతాయుతంగా అడుగులు వేస్తూ ప్రపంచస్థాయికి చేరుకుంది.

⚖ 1968 నుంచి 1988 వరకు భారత్‌, చైనాల జీడీపీలో పెద్దగా వ్యత్యాసం లేదు.
💰 1.54 శాతంలో భారత్‌ ఉండగా, 1.62 శాతంలో చైనా ఉండేది. కానీ, పదేళ్లు తిరిగేసరికి భారత్‌ జీడీపీ 1.34 శాతానికి తగ్గింది.
చైనా జీడీపీ మాత్రం 2 రెట్లు పైగా పెరిగి 3.28 శాతానికి చేరింది.
2018లో భారత్‌ (ప్రపంచ జీడీపీలో మన శాతం) 3.17 శాతం, కాగా చైనాది 15.85 శాతంతో 5 రెట్లు పెరిగింది.

🏆 2008లో బీజింగ్‌లో చైనా నిర్వహించిన ఒలింపిక్స్‌ చూసి, ఆ తరువాతి ఒలింపిక్స్‌ నిర్వహించవలసిన ఇంగ్లాండు నివ్వెరపోయింది.
‘మా స్థాయిలో మేం నిర్వహిస్తాం కానీ చైనాతో పోల్చుకోవద్ద’ని ప్రపంచాన్ని కోరిందంటే చైనా పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

🥶 అవినీతి కేసులలో ప్రభుత్వ ఉద్యోగులు దొరికితే కుల సంఘాలతో పైరవీలు చేయించుకునే స్వేచ్ఛ చైనాలో లేదు.
🚦పౌరులకు ట్రాఫిక్‌ నిబంధనలు ధిక్కరించే స్వేచ్ఛ లేదు.
👳 నాయకులకు వేలు, లక్షల కోట్లు అవినీతి చేసుకునే స్వేచ్ఛ లేదు.
🙏 విధులలో ఉన్న సమయంలో పూజలు, ప్రార్థనలు చేసుకునే హక్కు ఏ మతస్థులకీ లేదు.
📍కులం, మతం, ప్రాంతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు పురిగొల్పే, ఆ శవాలతో రాజకీయం చేసుకునే స్వేచ్ఛ చైనాలో అసలే లేదు.

👍 మనం ఏదైతే స్వేచ్ఛగా భావిస్తున్నామో, అది స్వేచ్ఛ కాదు.
విశృంఖలత, బాధ్యతా రాహిత్యం.

💡భారత్‌లోని రాజకీయ పార్టీలు, మన పాలకులు చైనా నుంచి తెలుసుకోవలసింది :
పేదరికాన్ని పారదోలాలంటే, పేదల పక్షం.. అంటే ఎప్పుడూ పేదవారితో ఉండడమో, ఉన్నట్లు నటించడమో, వారుండే గుడిసెల చుట్టూ సానుభూతితో తిరగడమో, తినే బియ్యం ఉచితంగా అందించడమో కాదు.
వారికి ఉపాధి కల్పించాలి, పనిని ప్రోత్సహించాలి.
అప్పుడు మాత్రమే పేదరికం పోతుంది. దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుంది.

🙏 సానుభూతి మాత్రమే చూపిస్తే పేదరికం ఇంకా పెరుగుతూనే ఉంటుంది.

Post a Comment

0 Comments