నాన్న ప్రేమ

💌నాన్న ప్రేమ💌
(దయచేసి మొత్తం చదవండి)

దుప్పటి కప్పుకొని... సెల్ ఫోన్ బ్రైట్ నెస్ తక్కువగా పెట్టుకొని ముసిముసిగా నవ్వుతూ మెసేజ్ లకు జవాబు ఇస్తున్న బిందు... తన గది బయట ఏదో చప్పుడు వినిపించేసరికి ఫోన్ లాక్ చేసి మెల్లిగా దుప్పటి తీసి డోర్ దగ్గరకు వెళ్లి తలుపు సందులోంచి బయటకు చూసింది....
హాలు లో నాన్నగారు అటు ఇటు తిరుగుతూ కనిపించారు....
అమ్మ సోఫా లో కూర్చొని గడియారం వైపు చూస్తోంది.... తమ్ముడు బర్త్ డే కేక్ ని చేతిలో పట్టుకొని నాన్నగారి వంక చూస్తున్నాడు...!

వాళ్లను చూసి వెంటనే మెల్లిగా డోర్ వద్ద నుండి వచ్చి బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పేసుకొని మళ్లీ చాటింగ్ మొదలెట్టింది...!

ఇంతలో నాన్నగారు ...
"బిందు....బిందు..." అంటూ పిలిచారు... తమ్ముడు... అమ్మ కూడా పిలవడం మొదలెట్టారు....
ఏరోజు లేనిది ఈరోజు కొత్తగా బిందు డోర్ లాక్ చేస్కోవడం వాళ్లకు విచిత్రంగా అనిపించింది...
కాస్త భయంగా కూడా అనిపించింది....
పిలవడంతో పాటు ఈసారి తలుపులను కూడా బాదడం మొదలెట్టారు నాన్నగారు...!

వాళ్ళు అంతలా పిలుస్తున్న కూడా బిందు కప్పుకున్న దుప్పటి తీయలేదు..వాళ్ళ పిలుపుకు స్పందించలేదు కూడా .... ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉంది.... ఇంతలో బిందు సెల్ ఫోన్ వైబ్రేట్ అయ్యింది.... వెంటనే బిందు మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ ఆన్సర్ చేసింది.... అటు వైపు నుండి బర్త్ డే విషెస్ చెప్పారు.... బిందు సంతోషంతో థాంక్ యు సో మచ్.... అని చెప్పి ఇంకేదో మాట్లాడింది...!

 ఇంతలో నాన్నగారి వాళ్ళ పిలుపులు కాస్త అరుపులుగా మారడంతో....  అయిష్టంగానే Call Cut చేసి వెళ్లి డోర్ తీసింది..!

డోర్ తీయగానే నాన్నగారు... " Many More Happy Returns of the Day రా  కన్నా " అంటూ ఎంతో ప్రేమతో బిందు ని విష్ చేశారు.... అమ్మ... తమ్ముడు కూడా...!

Cake Cut చేయించారు.... నాన్నగారు ఏదో బహుమతి కూడా ఇచ్చారు తనకి...కానీ బిందు కి అవేవి పెద్ద సంతోషాన్ని కలిగించలేక పోయాయి ఆ సమయంలో...
 దాంతో పాపం అమ్మ,నాన్న,తమ్ముడేమో తనకి బాగా నిద్రొస్తుందేమో...అందుకే కనీసం ఆ Gift ని open కూడా చేయకుండానే గది లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది...!
అనుకున్నారు

దాదాపుగా మూడు నెలలకు పైనే అయ్యుంటుంది బిందు నాన్నగారితో కూర్చొని  మాట్లాడి... చాలాసార్లు నాన్నగారు మాట్లాడడానికి ప్రయత్నించారు.... కానీ ఈ మధ్య బిందు బాగా బిజీ అయిపోయింది.... ప్రాజెక్ట్ వర్క్ లు... కంబైన్డ్ స్టడీస్.... extra classes అనుకుంటూ చాలా బిజీ అయిపోయింది.... ఒకప్పుడు నాన్నకు గుడ్ మార్నింగ్ చెప్పేదాక తన డే ని స్టార్ట్ చేయని బిందు ఇప్పుడు రోజు మొత్తంలో ఒక్కసారి కూడా నాన్నతో మాట్లాడడానికి సమయం ఇవ్వట్లేదు.... ఎప్పుడు లేనంత బిజీగా మారిపోయింది ఈ మధ్య..... ఎంతగా అంటే తన పుట్టిన తేదీ రోజే  నాన్నగారి బర్త్ డే  అనే విషయం మర్చిపోయేంతగా...!!

బిందు ప్రవర్తన నాన్నగారికి కొత్తగా అనిపించింది...
ఏవేవో అనుమానాలు కలిగాయి తనలో....
కానీ తన కూతురి మీద ఉన్న నమ్మకానికి ఆ అనుమానాలు పటాపంచలు అయ్యాయి....!

మరుసటి రోజు ఉదయం నాన్నగారు సోఫా లో కూర్చొని పేపర్ చదువుతున్నారు.... బిందు నాన్నగారి ముందు నుండే బ్యాగ్ తీస్కొని బయటకు వెళ్ళింది.... నాన్నగారు చూసారు కానీ ఏం అడగలేకపోయారు....
బహుశా స్నేహితుల దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నారు.... కానీ అమ్మ అడిగేసింది... " ఎక్కడికే... బ్యాగ్ తీస్కొని బయల్దేరావ్..." అంటూ...

" బట్టలు డ్రై క్లీనింగ్ కి ఇవ్వడానికి అమ్మా " అని చెప్తూ చెప్తూనే గేట్ దాటేసింది....!

సరిగ్గా వాళ్ళ ఇంటి నుండి ముప్పై అడుగులు వేస్తే డ్రై క్లీనింగ్ షాప్ వచ్చేస్తుంది.... మహా అంటే ఓ పది నిమిషాల నడక...!

బిందు బయల్దేరి గంట కావొస్తుంది... ఇంకా ఇంటికి రాలేదు....
నాన్నగారు కంగారుగా.. 
"రేయ్... ఓసారి బయటకి వెళ్లి చూడు... అక్క షాప్ దగ్గర ఉందేమో " అంటూ కొడుకుని బయటకి పంపాడు...!

పది నిమిషాల్లోనే తిరిగివచ్చి... " అక్క...అసలు షాప్ కి రాలేదు అంట నాన్నగారు " అని చెప్పేసరికి.... నాన్నగారు కుర్చీలోంచి లేచి టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకొని బిందు సెల్ కి కాల్ ట్రై చేశారు.... కాల్ కనెక్ట్ కాలేదు...!
బిందు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చేశారు...  కానీ తను వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు...!

నాన్నగారికి ఏం చేయాలో పాలు పోలేదు.... తెల్సినవాళ్ళ అందరికి ఫోన్ చేశారు... కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది....!

" ఓసారి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అండి.." అంటూ అమ్మ ఏడుస్తూ అనేసరికి నాన్నగారు సరేనంటూ కళ్ళు తుడుచుకుని...కంప్లైంట్ ఫైల్ చేయడం కోసం ఫోటో కోసం బిందు రూమ్ లోకి వెళ్లారు....!

అలా వెళ్ళగానే ఇలా టేబుల్ మీద ఫోటో కనిపించింది... టక్కున ఫోటో తీస్కొని రూమ్ నుండి బయటకు వస్తూ ఒక్కసారిగా ఆగిపోయి తన చేతిలో ఉన్న ఫోటో వంక చూసారు.... ఎవరో అబ్బాయి ఫోటో అది... ఇందాక తను ఫోటో తీసిన ఆ టేబుల్ వంక చూసేసరికి ఓ లెటర్ గాలికి శబ్దం చేస్తూ కనిపించింది...!

దగ్గరికెళ్లి లెటర్ తెరచి చూశారు నాన్నగారు...

" నాన్న... నేను ఈ ఫోటో లో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను.... ఇద్దరం కలిసి దాదాపుగా ఆరు నెలలుగా ప్రేమలో ఉన్నాం.... పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాం.... కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు అని తెల్సు నాకు.... పైగా ఈ మధ్య ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపేస్తున్నారు....
అందుకే భయపడి మీకు చెప్పలేదు.... మమ్మల్ని కల్సి బ్రతకనివ్వండి... మాకు మీ అవసరం లేదు... దయచేసి మాకోసం వెతికి..మా జీవితాలను నాశనం చెయ్యకండి...!! "

నాన్నగారు ఉత్తరం మొత్తం చదివి.... రూమ్ తలుపులు మూసేసుకున్నారు....!

సరిగ్గా వారం రోజుల  తరువాత బిందు ఆటో దిగింది ఇంటి ముందు....
ఆటో శబ్దం విని బయటకు పరిగెత్తుకుంటు వచ్చాడు తమ్ముడు....
బిందు ని చూసి ...
" అమ్మ... అక్క వచ్చేసింది..." అంటూ అరిచాడు.... ! అమ్మ కూడా బయటకు వచ్చింది.... బిందు వంక చూస్తూ అలా నిలబడిపోయింది...!

బిందు... అమ్మని తముణ్ణి చూస్తూ సిగ్గు తో తల దించుకొని  భయంతో బయటే నిల్చుండిపోయింది.... తమ్ముడు బిందు దగ్గరికి వెళ్లి.. " లోపలికి పద అక్క... " అంటూ ప్రేమగా పిలుస్తూ బిందు చేతిలో ఉన్న బ్యాగ్ తీస్కొని... తనను లోపలికి తీసుకెళ్లాడు.... బిందు కి ఏం అర్థం అవ్వలేదు.... లోపలికి వెల్లగానే అమ్మ బిందు ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.... బిందు అంత విచిత్రంగా అనిపించింది.... తను చేసిన పనికి అందరూ కోప్పడతారు... తిడతారు అనుకుంది.... కానీ ఇక్కడ అంత విచిత్రంగా జరిగేసరికి తనకు మెల్లిగా అర్థం అయ్యింది.... తను రాసిన ఆ లెటర్ వీళ్ళు చదవలేదు అని... ! 

మరి అయితే ఆ లెటర్ ఏమైనట్టు.... ఎవరు చదివినట్టు....
 " నాన్నగారు...".... యెస్... ఆ లెటర్ నాన్నగారే చదివి ఉండాలి... అవును నాన్నగారే చదివారు.... కానీ నాన్నగారు ఎక్కడ.... తను వచ్చి ఇంతసేపు అయిన నాన్నగారు ఎక్కడ కనిపించలేదు....!

బిందు... " అమ్మ.... నాన్నగారు ఎక్కడ...? " అంటూ అమ్మని అడిగింది...!

అమ్మ ఏడుస్తూ ...  గోడ వంక చూసింది..!
బిందు గోడ వంక చూసి ఖంగుతింది...!

నాన్నగారి ఫోటో కి దండ వేసుంది... బిందు కి పిచ్చి ఎక్కినంత పని అయింది.... తను ఆ షాక్ నుండి తేరుకోకముందే తమ్ముడు ఏడుస్తూ ఓ లెటర్ తీసుకొచ్చి బిందు కి ఇచ్చాడు...!

అందులో.....

"అందరూ నన్ను క్షమించండి.... నేను బిందు ని లైంగికంగా వేదించాను.... తను ఇన్నిరోజులు ఎవరికి చెప్పలేదు.... కానీ ఈ మధ్య నా వేదింపులు బాగా ఎక్కువ అవ్వడంతో... తను ఎవరికైనా చెప్పేస్తుంది అన్న భయం నాలో మొదలైంది.... అందుకే ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను......"

ఆ లెటర్ చూసి.... బిందు ఒక్కసారిగా కూలబడిపోయింది.... తన తల పగిలిపోయినంత పని అయ్యింది.... గుండె బరువు ఎక్కిపోయింది.... నోట మాట రాని స్థాయికి చేరుకుంది...!

తనని చూస్తూ అమ్మ.... నాన్నను దూషిస్తుంది... తను బిందు పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆ లెటర్ లో రాసింది నిజం అనుకొని.......!

బిందు ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా భారంగా అడుగులు వేస్తూ తన గది లోకి వెళ్ళింది... రూమ్ లోకి వెళ్లి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడ్చింది.... తల ను గోడకు బాదుకుంటూ ఏడ్చింది.... చేతులతో తలను కొట్టుకుంటూ ఏడ్చింది.... నేలపై కూలింది.... కన్నీటి ధార ప్రవహించింది తన కళ్ళ నుండి.... నేలపై తలను వాల్చిన తనకు ఎదురుగా ఉన్న టేబుల్ వైపు దృష్టి సారింది.... లేచి టేబుల్ దగ్గరికి చేరుకుంది..!

నాన్నగారు తన పుట్టిన రోజు ఇచ్చిన గిఫ్ట్ ని తన చేతిలోకి తీసుకుంది... అది ఓపెన్ చేసినట్టు అనిపించింది తనకు.... దాన్ని పూర్తిగా ఓపెన్ చేసేసరికి ... ఏవో కాగితాలు కనిపించాయి... పోయినేడాది తన పుట్టిన రోజు సందర్బంగా గా US లో మాస్టర్స్ చేయాలని ఉంది అని నాన్నగారితో అంది బిందు....
 అందుకోసమే నాన్నగారు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తన US చదువుకోసం కేటాయించి మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు...
దాని తాలూకు పేపర్స్ అవి....!

అది చూసి బిందు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు... బయటకి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదిమిపట్టి కుమిలి కుమిలి ఏడ్చింది.... బిందు ఆ గిఫ్ట్ ని కింద పెడుతుండగా ఆ గిఫ్ట్ బాక్స్ అడుగు భాగాన ఉన్న ఓ లెటర్ క్రిందపడింది.... బిందు దాన్ని తెరచి చదవడం మొదలెట్టింది.....

" బిందు.... ఎలా ఉన్నావ్ రా బంగారు.... ఈ లెటర్ నువ్ చదువుతున్నావ్ అంటే ఖచ్చితంగా నువ్ చేసింది తప్పు అని తెలుసుకొని తిరిగి వచ్చి ఉంటావు.... పర్లేదు బంగారు.... తెలిసో తెలియక చేసిన తప్పుల్ని దేవుడు లెక్కేట్టడులే.... ఇక ఈ మనుషులు లెక్కెడతారు అంటావా.... ఆ అవకాశం వాళ్లకు ఇవ్వను నేను....
నా బంగారాన్ని ఎవరైనా ఏదైనా అననిస్తానా నేను..... అందుకే నువ్ చేసిన తప్పు జనాలకు కనబడకుండా తప్పు నా మీద వేసుకున్నాను.... కాబట్టి... నిన్ను ఎవరు ఏం అనరు... నువ్ సంతోషంగా ఉండొచ్చు.... కాకపోతే నేను చెప్పిన అబద్ధం వల్ల నీ ముందే నన్ను జనాలు తిడుతూ ఉండొచ్చు.... కానీ నువ్ అవేం పట్టించుకోవద్దు రా తల్లి.... నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు....
అవి వినడానికి నేను ఎలాగూ ఇక్కడ ఉండను కదా....!

హ... నువ్ అన్నది నిజమే తల్లి... ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపుకుంటున్నారు...
ఎక్కడో ఎవరో చేశారని నన్ను కూడా వాళ్ళతో పోల్చావు చూడు అది కాస్త బాధను కలిగించిందిరా బంగారు.... కాస్త కాదు చాలా....
బొత్తాలు పెట్టుకోకపోతే ఎగిరిపోయే చొక్కా లాంటి పరువు ప్రతిష్టల కోసం నిన్ను ఎలా చంపుకుంటాను అనుకున్నావ్ రా....!

నాన్నను రా తల్లి.... గుండెల మీద పెట్టుకొని పెంచాను... నీకు చిన్నపాటి జ్వరం వచ్చిన తెల్లవార్లు జాగారం చేసి మరీ కంటికి రెప్పలా కాపాడుకున్నాను నేను...
నీ రేపటి భవిష్యత్ గురించి నా గతాన్ని , ప్రస్థుతాన్ని సైతం తాకట్టు పెట్టాను నేను....
నీలో మా అమ్మని చూసుకొని నువ్వే నా సర్వస్వమ్ అనుకొని అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ బతికాను రా కన్నా....
అలాంటి నేను నీ ప్రాణాలు తీస్తాను అని ఎలా అనుకున్నావ్ రా....!

తొమ్మిది నెలలు మోసే తల్లిని దేవత అంటూ పూజిస్తారు.... కానీ మిమ్మల్ని  తొమ్మిది నెలలు మోసే ఆ తల్లిని కవచం లా కాపాడుకుంటూ... భూమి మీదకి అడుగు పెట్టిన నిన్ను 22 ఏళ్ళు భుజాల మీద ఎట్టుకొని పెంచిన నాన్నను మాత్రం కసాయి వాణ్ణి చేశావ్ ఈరోజు... చచ్చిపోయాను రా బంగారు.... నువ్ రాసిన ఆ అక్షరాలు చూడగానే చచ్చిపోయాను నేను....!అందుకే శాశ్వతంగా చచ్చిపోదాం అని నిర్ణయించుకున్నాను..! నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేను రా తల్లి...!!

నాన్న అంటే నమ్మకం రా...
నా నమ్మకానివి రా నువ్....
ఏరా తల్లి.... నాతో పాటు నువ్ బైక్ మీద వస్తూ మొబైల్ లో చాట్ చేస్తూ కూర్చుంటే నా బండికి ఉన్న అద్దంలో కనిపించదు అనుకున్నవా .... కనిపించిన కూడా ఎవరు అని అడగలేను...
కారణం నమ్మకం....
నా కూతురు అనే నమ్మకం.. ఏది చేసినా నాకు చెప్పి చేస్తుంది అనే నమ్మకం.... కొడుకుల్ని గది బయటే ఉంచి....
కూతుళ్ళని గుండెల్లో దాచుకునే నాలాంటి పిచ్చి తండ్రులు ఎందరో ఉన్నారు..... కానీ ఆ కూతుళ్లు మాత్రం నాన్న గుండెల మీద తంతూ వాళ్లకు నచ్చినట్టుగా బతికేస్తున్నారు...!

అసలు ఏం కావాలి రా మీకు.... ఏదైనా సరే మన దగ్గర లేకుంటేనే కదా బయట వెతుక్కోవాలి....
అసలు ప్రేమ అంటే ఏంటి... !

కేరింగ్ హ.... ఎవడో గాలికి తిరిగే వెధవ మిమ్ములను తిన్నవా అంటూ మూడు పూటలు పలకరిస్తేనే కేరింగ్ అంటే.... ఆ మూడు పూటలు మీకు తిండి పెడుతున్న పేరెంట్స్ చేసేదాన్ని ఏమనాలి...?

బహుమతులు.... పాతిక రూపాయలు పెట్టి ఓ గ్రీటింగ్ కార్డ్.. పదిహేను రూపాయలు పెట్టి ఓ చాక్లెట్ కొనిస్తేనే ప్రేమ పుట్టేటట్టు అయితే.... పుట్టినప్పటి నుండి ఈరోజు దాకా నువ్ వాడే ప్రతీది కొనిచ్చిన తండ్రి మీద మీకు ఏ స్థాయిలో ప్రేమ ఉండాలి మరి....??

మేము ఇవ్వలేని ప్రేమలు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు తల్లి.... ?

పోనీలే కన్నా.... నువ్ ఏది చేసినా నాకు...సంతోషమే.... ఓ తండ్రిగా  నువ్ చేసే ప్రతీదాన్ని సపోర్ట్ చేస్తాను నేను....
అందుకే నిన్ను సపోర్ట్ చేయడానికి నా ప్రాణం కూడా పణంగా పెట్టాను....
నువ్ సంతోషంగా ఉండడమే నాకు కావాలి.... ఓ తండ్రిగా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం నా భాద్యత... ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి..... ఇక పై నిన్ను సపోర్ట్ చేయడానికి నేను కూడా ఉండను.......
అమ్మా మా అమ్మను నీలో చూసుకున్నాను...
నా సర్వస్వం నువ్వే అనుకున్నాను...
మా అమ్మతో చెప్పుకున్నట్టే
నా మనోవేదన నీకు చెప్పాను అంతే కాని....నీ మనసు కష్టపెట్టడం నా ఉద్దేశ్యం కాదురా బంగారం....
బిందు చేతిలో నాన్న రాసిన ఉత్తరం కన్నీళ్లకు తడిసిపోయి అక్షరాలు చేరిగిపోతుంటే తన కన్నీటి పొరల మధ్యనుంచి నాన్న ఉత్తరం తాలూకు అక్షరాలు మసగ్గా కనిపిస్తుండగా నిశ్శబ్దంగా కూలబడిపోయిన బిందుకు తన గుండె చప్పుడు సైతం లబ్ డబ్ అని కాకుండా "బిందు బిందు" అంటూ నాన్నగారి పిలుపులా వినబడుతుంటే కుమిలిపోతున్న బిందు నోటి నుండి "నాన్నా నన్ను క్షమించు"అంటూ బయటకొచ్చిన ఆ శబ్దం ఆ గది గోడల మధ్యలోనే ఇంకిపోయింది.....
****************************************

లవ్వు, కొవ్వు అని తిరిగి మోసపోయే తింగరిబుచ్చిలకు ఈ పోస్ట్ అంకితం.

Comments

Popular posts from this blog