ఉగాధినై వస్తున్నా

ఉగాధినై వస్తున్నా

ShyamPrasad +91 8099099083
0
🌹ఉగాధినై వస్తున్నా🌹
**********************
వస్తున్నా వస్తున్నా 
మీ కోసం వస్తున్నా 
మౌనంతో వస్తున్నా
వికారికి వీడ్కోలు చెప్పేస్తూ వస్తున్నా
వసంతమై వస్తున్నా
శార్వాణిని నే తీసుకు వస్తున్నా
కాల గమనంతో కలిసి వస్తూన్నా
కరోనాని ఖతం జేద్దామని వస్తున్న 
కంగారుగా వస్తున్నా
ముంగిట ముగ్గులు లేకున్నా
ముడుచుకొని వస్తున్నా
సడిలేని సడాకు పైన
వడి వడి అడుగులతో వస్తున్నా
ఇంట్లో ఉన్నవారికి  మాత్రమే ఉగాదినై వస్తున్నా 
పసుపు గడపల మీదుగా 
పదిలంగా వస్తున్నా
మామిడి తోరణమై వస్తున్నా
మహమ్మారిని  మట్టుబెట్ట డానికి వస్తున్నా
షడ్రుచులను మీకిస్తున్నా
ఆరోగ్యానికి రక్షణగా నిలుచున్నా
ఆనందాలను పంచుతున్నా
ఆనందాలు మీ సొంతం కావాలన్నా
మీ జీవితం మీ చేతుల్లో పెడుతున్నా
వ్యక్తిగత పరిశుభ్రత నే  కావాలనుకుంటున్నా
బయటకు వెళ్లడం వద్దు
ఇంట్లోనే ఉండడం ముద్దంటున్నా
కరోన కాటుకు గురి కావద్దంటున్నా
ప్రభుత్వానికి సహకరించమంటున్నా
ప్రాణాల్ని రక్షించుకోమంటున్నా
అనుక్షణం సేవలనందించే పారిశుద్ద, 
వైద్య దేవుళ్ళకు  నమస్కరిస్తున్నా
ప్రతి క్షణం సైనికుడై కాపాడుతున్న
పోలీసులకి సలాం చేస్తున్నా
జాగ్రత్తగా వుండమంటున్నా
కరోనాను తరిమి కొడదామని కోరుకొంటున్నా
కరోనా  కరిగిపోయిన వేళా 
ప్రతినిత్యం ఉగాధినై వస్తా
నవ కాంతుల శోభలు పరిచేస్తా
వసంతాలెన్నో జల్లెస్తా .   ఈ రోజుతో వికారి వెళ్ళిపోతోంది నిజంగా ప్రపంచానికి ఎంత వికారం చూపింది కరోనా తో. రేపు శార్వరి అంటే అమ్మవారు ఆమే రక్షణ. మనకు అంతా మంచి జరగాలని కొరుతూ...తెలుగు సంవత్సరాది (ఉగాది) శుభాకాంక్షలు
*******************   

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!