పెద్దలారా.....మేలుకోండిపిల్లలకు ...మంచిని నేర్పండి

పెద్దలారా.....మేలుకోండిపిల్లలకు ...మంచిని నేర్పండి

SHYAMPRASAD +91 8099099083
0
మంచిని..

25 సంవత్సరాలకు ముందు గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది.

ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.

ఆ ఊరిలో రైతులు పంట కోసే సమయంలో పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు.

పిల్లలు ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.

ఎవరు ఎక్కువ కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది.

పిల్లలంతా ఆనందంగా ఆ పోటీలో పాల్గొనేవారు.

ఆ పిల్లలలో ఒక్కడికి IIT లో సీటు వచ్చి పక్క రాష్ట్రానికి చదువుకు వెళ్ళిపోయాడు.

ఆ అబ్బాయి 6 సంవత్సరాలు తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడు.

ఆ అబ్బాయికి చిన్ననాటి పుచ్చకాయలు తినే పోటీ గుర్తొచ్చి ఊరి బయటే ఉన్న కూరగాయల మార్కెట్టుకెళ్లి....

మొట్ట మొదట పెద్ద పుచ్చకాయను తృప్తిగా తినేసి వెళ్లాలని అనుకున్నాడు.

మార్కెట్లోకి వెళ్ళగానే ఒక చోట ఒక యువ రైతు పుచ్చకాయల పోటీ జరుపుతుండటం చూసి ఆనందంగా అక్కడికి వెళ్ళాడు.

కానీ ...

ఆ పోటీలో అన్నీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి....

ఎక్కడ వేదికినా పెద్ద సైజు కాయలే కనబడలేదు.

ఆ అబ్బాయికి చాలా నిరాశ కల్గింది.

దేశంలోనే పెద్ద పుచ్చకాయలు పండించే ఊరిలో .....

చివరికి పెద్ద కాయలే పండ లేదు.

దీనికి కారణం ఏమై ఉంటుంది? అని ఆ అబ్బాయి ఆలోచించాడు.

చివరికి దానికి కారణం కనుక్కొన్నాడు.

తాను చిన్నగా ఉన్నప్పుడు...రైతులు కాయలపోటీల్లో...పెద్ద పెద్ద కాయలను ఇచ్చి వాటి గింజల్ని మాత్రం ఒక గిన్నెలోకి ఉంచమని... పిల్లల్ని కోరేవారు.

తర్వాతా ఆ గింజల్ని సేకరించి మళ్ళీ నాటుకొని పెద్ద పెద్ద కాయలని పండించేవారు.

కానీ తర్వాత ....ఆ రైతుల కొడుకులు ....వారసత్వం తీసుకొని
ఈ పోటీలు నిర్వహించసాగారు.

👉వారు ....పుచ్చకాయల పోటీల్లో పెద్ద కాయలకు బదులు ....చిన్న చిన్న నాసి రకం కాయల్ని ఇచ్చి పోటీలు జరిపారు. ఆ చిన్న కాయల గింజల్ని సేకరించారు.

పెద్ద కాయలను మాత్రం లాభాలకు అమ్మేవారు.
అలా ప్రతి సంవత్సరం చేశారు.

సరిగ్గా...4 సం. ల కే పెద్ద కాయలు కాయడమే నశించిపోయింది.

👉మనం కూడా ....మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో చాలా ఘోరంగా విఫలం అవుతున్నాము. 

👉వారికి పనికిమాలిన పుచ్చు గింజల్లాంటి పద్దతులను నేర్పించి......
మార్కులు వస్తే చాలు....ఇక మనుషులు ఏమైపోయినా ఫర్వాలేదు....
పెద్ద ఉద్యోగం వస్తే చాలు...తల్లి దండ్రులను తన్ని తరిమేసినా ఫర్లేదు......

ఆడపిల్లలను ....ఆకలిగా చూసినా ఫర్లేదు....బాగా డబ్బు సంపాదిస్తే చాలు.....

.పేదవాడికి కాస్త సాయం చేయక పోయినా ఫర్లేదు......

ఆస్తులు కూడబెడితే చాలు.....అన్న చందంలో.... పెద్దలు జీవించడం వలనే......

 ఈ నాడు ఇంట్లోని ఆడబిడ్డను బయటికి పంపాలంటే ....భయపడే దౌర్భాగ్యం దాపురించింది.

👉పెద్దలారా.....మేలుకోండి
పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి

వచ్చే కాలమంతా బాగుంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!