నది అంటే ఏమిటి ? నదమంటే ఏమిటి ?

నది అంటే ఏమిటి ? నదమంటే ఏమిటి ?

SHYAMPRASAD +91 8099099083
0
నది అంటే ఏమిటి ? నదమంటే ఏమిటి ?
...................................................

ఏరు = చిన్న మధ్యమ జలప్రవాహం.కొంతదూరం మేరకే ప్రవహించి నదులలో  కలుస్తుంది.
వాగు = కొండమీదుగా జారి ప్రవహించు ఏరు.

జలపాతం = కొండలోయలలో కాని మరేదేని ఎత్తైన ప్రదేశంనుండి నీరు పడటం.పాతం అంటే పైనుండి పడటం అని అర్థం.

వంక = సమతల ప్రదేశంలో ప్రవహించు జలం.

నది = తూర్పు వైపు ప్రవహించు అతి పెద్ద అతిదూరం పయనించే జలప్రవాహం.బంగాళాఖాతంలో చేరునదులు.

నదం = పడమర వైపున ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేవి.ఉదా॥ నర్మద, తపతీ నదులు.

సెలయేళ్ళు = నిరంతరం ప్రవహమున్న ఏరులు. చుట్టు ప్రక్కల భూములు సస్యశ్యామలంగా ఉంటాయి.

మడుగు = నిత్య జలప్రవాహం వలన దగ్గరగా ఏర్పడిన చిన్న జలాశయము.

బావి = చిన్న పరిమాణంలో లోతుగా వుండి నీటిని తోడుకోవటానికి ఉపకరించునది.

నూయి = పెద్ద పరిమాణంలో వుండి వ్యవసాయం కొరకు నీరు అందించునది.

కోనేరు = విశాలమైన జలాశయం.  దేవాలయాల వద్ద వున్నవాటిని కోనేరు అనడం కద్దు. దేవాలయం వద్ద కాకపోయినా నిరంతరం జలకళవుంటే దానిని కోనేరు అని అంటారు.,

దరువు = నీటి ప్రవాహమున్న ఏటిలో నదిలో ఒక కాలువను తీసి దానినిని లోతైనబావికి కలిపి ఏతాము లేదా కపిల ద్వారా నీటిని తోడటం.

ఏతాము = చిన్నబావికి లేదా దరువుకి దరి పడిపోకుండా రాతికట్టడం వుంటుంది. ఆ రాతి కట్టడంలో బయటికి పొడుచుకు వచ్చినట్లుగా రెండు రాతిదూలాలు ఉంటాయి. వాటి మధ్య అటోకాలు ఇటోకాలు పెట్టి నీటి ఇనుప బానతో నీళ్ళుపైకి పంపడం. రెండు పిడికిళ్ళ మందంగా వున్న వెదురు లేదా ఇతర కర్రను తీసుకోని ఒక చివర ఇనుప బానను కట్టి వుంటారు.

కపిల = కపిల అనగా  వ్యవసాయ బావి నుండి ఎద్దులసాయంతో మోట/కపిలబాన ద్వారా నీటిని తోడటం. రెండు జతలఎడ్లు ఇద్దరు రైతులు అవసరం. ఇరుసుమీద పెద్దమోకుతో మోటను ఎద్దుల ద్వారా లాగటం.ఎద్దులులాగే సమయంలో ఏటవాలు గుంతలో నడుస్తాయి.ఈ ఏటవాలు గుంతను భారి అనంటారు.

గూడ = ఒక బకెట్ కు పైనా క్రిందుగా రెండేసి పొడుగాటి తాళ్ళను కట్టి జలప్రవాహాల నుండి  లేదా జలాశయాల నుండి నీటిని బయటకు చిమ్మడం.చిమ్మిన నీరు కాలువల ద్వారా పంట పొలాలకు మళ్ళిస్తారు. గూడ వలన అతి తక్కువ మేర మాత్రమే సాగుకు వీలైతుంది.

కపిల, ఏతాం, గూడ అనే వ్యవసాయ నీటిని తోడే క్రియలను యూట్యూబ్ లో చూడవచ్చు.
......................................................................

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!