Responsive Advertisement

స్వర్గలోకంలో కరోనా ... హాస్య కథ

స్వర్గలోకంలో సభ నడుస్తున్నది .

అందరూ ఆనందంగా హుషారుగా ఉన్నారు...
సడన్ గా వాయుదేవుడికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది..
..ఎక్కడ నుంచి మెసేజ్ అని అడిగాడు ఇంద్రుడు..
.యమలోకం నుంచి ఇంద్రా...
"అక్కడ ఎదో కరోనా వైరస్ వచ్చిందంట...
చాలా ప్రమాదకరం అంట....
మనల్ని మాస్కులు వేస్కోమంటూ.....యమ సీరియస్ గా...యమ వార్నింగ్ మెసేజ్ పంపాడు యముడు".

ఇంద్రుడు వెంటనే.... అక్కడ ఎప్పుడూ ఎదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదా, 
ఐనా ఏది పడితే అది తినడం ,ఎలా పడితే ఆలా ఉండడం వల్లే ఇలాంటివన్నీ వస్తాయి అని వాళ్ళకి తెలీదా ...
మనకి ఇదేమైనా కొత్తా చెప్పు ...
ఇదివరకు ఇలాగే ఇబోలా వైరస్ అని, 
స్వైన్ ఫ్లూ అని, 
నా బొంద అని  ఎదో ఒకటి మన నెత్తి మీదకి తెస్తూనే ఉంటారు...ఈ నరక లోకం వాళ్లు.
 మనది స్వర్గం ఇక్కడకి ఎలాంటి వైరస్ రాదు.
.వచ్చిన బ్రతకదు...నేను బ్రతకనివ్వను..
.నువ్వు టెన్షన్ పడకు వరుణా అంటూ వెటకారంగా నవ్వాడు.

 ఇంకెప్పుడు వాట్సాప్ గ్రూప్ లో ఇలాంటి మెసేజెస్ పెట్టొద్దని చెప్పు ఆ యముడు కి.

మేటర్ సీరియస్ అవునో కాదో అని తెల్సుకుందాం అని, వరుణ దేవుడు ఆ మెసేజ్ ని నారదుడి కి ఫార్వర్డ్ చేసాడు. 
చాలా రోజుల నుంచి కొత్త న్యూస్ లేక వెయిట్ చేస్తున్న నారదుడుకి ఆ మెసేజ్ చాలా ఆనందం ఇచ్చింది..
అంతే వెంటనే చిడతలు కొట్టుకుంటూ నరకం కి బయలుదేరాడు. 
నరక లోక ముఖ్య ద్వారం దగ్గర మాస్కులు వేసుకున్న యమ భటులు కనిపించారు....లోపలకి వెళ్లబోతుంటే నన్ను ఆపి
 నా టెంపరేచర్ చెక్ చేసారు..
.నా చిడతలు మీద తంబురా మీద 
శానిటైజర్ జల్లారు.
..నా అరచేతుల్లో కూడా వేసి శుభ్రంగా తుడుచుకోమన్నారు...
నేను లోపల కి వెళ్లే సరికి అందరు మాస్కుల్లోనే ఉన్నారు 
..యముడు చిత్రగుప్తుడి తో సహా...యముడు కరోనా వైరస్ కోసం చెప్పిన జాగ్రత్తలు తీసుకోమన్నాడు...
కొత్త పాపులని కూడా వైతరణి నది కి అవతలి ఒడ్డు నే  ఆపి
 14 రోజులు అయ్యాక టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి లోనికి రానిస్తున్నారట.

మేటర్ తెలుసుకున్న నారదుడు, వెంటనే బ్రహ్మ లోకం వెళ్ళాడు ..అప్పటికే బ్రాహ్మ నాలుగు ముఖాలకి నాలుగు మాస్కులతో ఉన్నాడు...

నారదుడు వెంటనే ...ఈ విషయం అప్పుడే మీ వరకు వచ్చిందా నాన్న గారు అన్నాడు...

నువ్వు మెంబర్ ఐన వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ రా నేను ..
.నువ్వు నాకే చెప్తున్నావా...

అయ్యో అలా అనలేదు నాన్నగారు అంటూ .....ఆఆఆఅచ్ అని తుమ్మాడు నారదుడు...

బ్రహ్మ కోపం గా తుమ్మే.. టప్పుడు ఆ చెయ్యో...లేక నీ చిడతలో అడ్డుపెట్టుకోవచ్చు కదా అన్నాడు ...

నాన్నగారు ఇది కరోనా తుమ్ము కాదండి..
.నరక లోకం నుంచి వస్తున్నపుడు 
వయా.. కైలాసం ... వచ్చాను .
దాని చల్లదనం వల్ల కావచ్చు అండి..

ఏంటి నువ్వు నరక లోకం నుంచి వచ్చావా..
.ఆ విషయం చెప్పవేం...
ఇంకో 14 రోజుల వరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా సెల్ఫ్ quarantine అవ్వాలి అర్ధం అయ్యిందా.
.అంటూ మంత్రం చదివాడు ....
వెంటనే నారదుడి చుట్టూ బుడగ లాంటిది వచ్చేసింది...

అక్కడ వైకుంఠ ముఖ ద్వారం లో కూడా జయ విజయులు 
మాస్కులు వేసుకుని ..."వైకుంఠం is closed until further notice " అని డోర్ కి కాగితం అంటించేసారు. 

ముల్లోకాలు అల్లకల్లోలం అవుతున్నా ఏమి పట్టనట్టు ఇంద్ర లోకం లో జనాలు మాత్రం నార్మల్ గా తిరుగుతున్నారు...అనుకున్నదంతా అయ్యింది....
మరుసటి రోజు న్యూస్ పేపర్ లో "ఇంద్ర లోకం లో తోలి కరోనా కేసు" అంటూ headlines పెట్టేసారు.
 విషయం లోకి వెళ్తే..
 యమ లోకం లో శిక్ష పూర్తి చేసుకుని స్వర్గం కి వచ్చిన ఒక మాజీ  
పాపి వల్ల ఇంద్రలోకం లోకి కరోనా
 ఎంటర్ అయ్యి పోయింది...
నిర్లక్ష్యం వల్ల తెచ్చుకున్న తంట..
వెంట వెంటనే పాకి ..
.స్వర్గం ని నరకం చేసి పడేసింది...చేతులు కాలి పోతున్నాయి ...పట్టుకుందాం అని ఆకుల కోసం ఏ లోకం కి వెళ్లిన ...అన్ని "closed down.
 " ...ఒక్క కైలాసం తప్ప ....వెంటనే  శివుడు దగ్గరికి పరిగెత్తాడు ఇంద్రుడు ...
చేసిన తప్పుని క్షమించి ....రక్షించమని శివుడిని కోరుకున్నాడు..
.శివుడు మాస్క్ తీసి...
చూడు ఇంద్రా!..నువ్వు చేసింది క్షమించ రాని తప్పు.....కరోనా వైరస్ వల్ల అన్ని లోకాలకి ముప్పు...ఇకనైనా నీ వేయి కళ్ళు తెరిచి జాగ్రత్త గ ఉండు అన్నాడు

ఇంద్రుడు ఇంకా convince కాలేక, విషాన్నే మింగిన మీకు ఈ కరోనా 
ఒక లెక్కనా ...దయచేసి ఇంద్ర లోకాన్ని  కాపాడండి అన్నాడు.

 శివుడు ప్రశాంతం గా కరోనా కి మందు లేదు...మింగటానికి అది విషము కాదు ..
.కాబట్టి నివారణ ఒకటే మార్గం..
.కాబట్టి నన్ను ఇంకా విసిగించకుండా ...చెప్పింది చేయుము.
 ...వెంటనే స్వర్గాన్ని మూసేయి ...
అందరిని వాళ్ల వాళ్ళ ఇంటికి పంపు....
కొత్తగా వచ్చే వాళ్ళని 14  రోజులు..
త్రిశంకు స్వర్గం లోనే ఆపి పరీక్షలు చేశాకే అనుమతించు ..
.నువ్వు కూడా కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు ....
పరిస్థితి ని ఎప్పటికప్పుడు ఆకాశవాణి ద్వారా తెలుసుకో...వేళ్ళు అని పంపించేశాడు.

ఇంద్రుడు స్వర్గం కి తాళం వేసి..ఇంటి ముఖం పట్టాడు..
.ఇంద్రుడి భార్య శచీదేవి sanitizer తో చేతులు కడుక్కుంటూ .
..ఎందుకండీ అంత డల్ గ ఉన్నారు అందీ...

ఇంద్రుడు, " రోజు స్వర్గం లో ఉండే వాడిని 
ఈ రోజు ఇలా ఇంట్లో ఉండవలిసి వచ్చింది" అన్నాడు. 

శచీదేవి, "చాల్లేండి మేము రోజు ఇంట్లోనే ఉంటాం... 
ఆ మాటకి వస్తే ఇలాంటి సమయం లో ఇంట్లో ఉండటమే స్వర్గం"

 అంటూ నవ్వుతూ.. రేడియో ఆన్ చేసింది...అదే సమయం లో ఆకాశవాణి లో

 చిత్తూరి నాగయ్య గారి పాట " గృహమే కాదా స్వర్గ సీమ " అంటూ పాట వస్తుంది ..

.చూసారా "సూపర్ టైమింగ్" అందీ శచీదేవి .....

stay home ....stay safe ...stay blessed ...😊😆

Post a Comment

0 Comments