డాక్టర్ అమ్మ

డాక్టర్ అమ్మ

SHYAMPRASAD +91 8099099083
0
ఉదయాన్నే హాస్పిటల్ కి రెడీ అవుతున్న డాక్టర్ సుమ తో కూతురు మాట్లాడిన మాటలు ఇవి
కూతురు : అమ్మా అందరికి హాలీడేస్ ఇచ్చారు. మా ఫ్రెండ్స్ అందర వాళ్లమ్మతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఇంట్లో ఉండమ్మా ప్లీజ్
అమ్మ: రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్న కూతురిని  దగ్గరికి తీస్కోని బుజ్జగిస్తూ లేదు నాన్న, నేను వెళ్లాలి.
ఆ తల్లి ఎక్కడికి వెళ్లింది దేశ సేవ కోసం.. దేశం అంటే మట్టి కాదోయ్,దేశం అంటే మనుషులోయ్ అని నమ్మి తన దేశాన్ని కాపాడుకోవడం కోసం కుటుంబాన్ని తన కూతురి సంతోషాల్ని దూరం పెట్టి వెళ్లింది ఆ డాక్టర్ అమ్మ. అలాంటి డాక్టర్ సుమ లు ఎంతో మంది ఉన్నారు.
తన కూతురు అమ్మని అలా అడగడం చూసిన ఆ తండ్రి కళ్లు చెమ్మగిల్లాయి.. ఇప్పటినుండి వాళ్లమ్మ వచ్చేవరకు తన కూతురికి తల్లి ప్రేమను కూడా తనే ఇవ్వాలనుకున్నాడు.ఎన్ని వేల కుటుంబాలు వారి కుటుంబ సభ్యుల్ని మిస్ అవుతున్నారో మీకు తెలుసా? కరోనా పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్న వాళ్ల కుటుంబ సభ్యులు తిరిగి అంతే ఆరోగ్యవంతంగా వస్తారో రారో అని ఎంతమంది టెన్షన్ పడుతున్నారో తెలుసా.
ఇలాంటి ఎన్నో కథలు, ఎందరో చిన్నారులు వాళ్ల అమ్మానాన్నలకు దూరంగా బతుకుతున్నారు.. ఆ బాధలే అర్దం అయితే ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించరు. ఎందరో చిన్నారుల అమ్మనాన్నలు డాక్టర్లుగా, పోలీసులుగా  దేశ సేవలో ఉన్నారు . ఆ చిన్న పిల్లల బాధ కంటే మన సరదాలు ఎక్కువ కాదు . మిమ్మల్ని ఏం కోరారు ఆ ఇంటి దగ్గర ఉండండి అని మాత్రమే కదా.
రోడ్ల మీదకి వచ్చేముందు ఒక్కసారి ఆలోచించండి..ఒకే ఒక్కసారి అమ్మానాన్నల కోసం ఎదురు చూసే చిన్నారుల ముఖాల్ని తలచుకోండి. వారి బాధని ఫీల్ అవ్వండి ,బయటికి వెళ్లడం మానండి.ఇంటి పట్టునే ఉండండి. ఆ చిన్నారుల కోసం వారికి వారి అమ్మానాన్నలని తొందరగా కలపడం కోసం.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!