Responsive Advertisement

కథ -ఏదీ మంచిది ఏది చెడ్డది.

ఏదీ మంచిది ఏది చెడ్డది.
................................................
కురుక్షేత్ర సంగ్రామంలో  అంపశయ్య మీద వున్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు వదలాలని వేచివున్నాడు. పాండవులకు ముఖ్యంగా ధర్మరాజుకు భీష్ముడు రాజనీతి ధర్మనీతిని బోధించాడు.

కన్నప్రేమపై మమకారం ప్రాణమిత్రులను సహితం శత్రువులుగా మారుస్తుందని ఓ చిలుకకథను ధర్మరాజుకు బోధించాడు.

బ్రహ్మదత్తుడనే రాజు వేటకు వెళ్లినపుడు గాయపడిన చిలుక ఒకటి దొరుకుతుంది.ఆ చిలుకను అంత:పురానికి తెచ్చి పెంచుకోసాగాడు. రాజు చిలుకల మధ్య సాధారణ పరిచయం కాస్తా గాఢ స్నేహంగా మారింది. చిలుక స్వేచ్ఛగా రాజు కొలువులో ఎగిరేది.

కొన్నాళ్ళకు బ్రహ్మదత్తుడికి మగసంతానం కలుగుతుంది.కొన్నేళ్ళకు చిలుకకు కూడా సంతానం కలుగుతుంది.
రాజకుమారుడు ఒకరోజు చిట్టిచిలుకను పట్టి ఆడిస్తూ పసితనపు చాపల్యం వలన దాని పీకపిసిగి చంపేస్తాడు.చిట్టి చిలుక మరణాన్ని తట్టుకోలేక చిలుక అమితంగా రోదిస్తుంది. కోపంతో వూగిపోయి ఎగిరి తనవాడి గోళ్ళతో యువరాజు కళ్ళను పొడి చేస్తుంది. యువరాజు అంధుడైతాడు.h

రాచకొలువు ఎన్నాళ్ళలైన పాము పడగనీడేనని చిలుక గ్రహించి ఎగిరి  నేరుగా రాజుముందు వాలుతుంది.రాజును ఉద్దేశించి చిలుక ''ఓ రాజా నీ కొడుకు అకారణంగా నా సంతానాన్ని మెడవిరిచి చంపేశాడు. కోపంతో నేను నీ కొడుకు రెండు కళ్ళను పొడిచి అంధుడిని చేశా, నాకు నీతో ఇక స్నేహం పొసగదు వెళ్లోస్తానని'' చెపుతుంది.

అందుకా రాజు ఓ చిలుక మిత్రమా తెలియని పసితనంలో నా కుమారుడు నీచిలుక సంతానాన్ని చంపేశాడు. అందుకు ప్రతిగా శోకంతో కోపంతో నా కొడుకును గ్రుడ్డివాడిని చేశావు.చేసిన తప్పుకు నువ్వు విధించిన శిక్ష సబబే.మరిఎందుకు మన స్నేహాన్ని తృణికరించి వెళ్ళిపోతున్నానంటున్నావు, ఇది సమంజసమా ! మన నెయ్యాన్ని ఎందుకు కొనసాగించకూడదు అంటూ అభ్యర్ధిస్తాడు.

అందుకా చిలుకా సంసారబంధమనేది విడదీయరానిది, పుత్రవ్యామోహన్నది ఎంతటి నీచకార్యానికైనా పురిగొలుపుతుంది.పుత్రుడు మరణించినందుకు ఇప్పటికినీలో నా పైన పగరగిలే వుంటుంది. రాజుకున్న ఈ పగ చెలరేగి నా ప్రాణాలను హరించకముందే నిన్ను వీడిపోవడం ఉత్తమం అని చెప్పి ఎగిరిపోతుంది.

ఓ ధర్మరాజా బంధుప్రీతితో, పుత్రవ్యామోహంతో ఉండవద్దు. అలా  నీవు యుక్తాయుక్త జ్ఞానాన్ని మరువవద్దంటూ హితబోధ చేశాడు.

ఇంకా

"ఒరులేయవి యొనరించిన
నరవర ! యప్రియము తన మనంబునకగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణం పరమ ధర్మపథములకెల్లన్. " 

ఓ ధర్మరాజా!ఇతరులు తెలిసో తెలియక నీకు హని చేస్తే, అలాంటి అప్రియాన్ని తిరిగి వారికి చేయకు.ఇదే ఉత్తమ ధర్మమని గ్రహించు.
-------------------------------------------------------------------

Post a Comment

0 Comments