మాటకున్న శక్తి:

మాటకున్న శక్తి: 


ప్రతి వ్యక్తి లోని విశిష్టమైనశక్తి భాండాగారం నిద్రాణమై ఉంది. దానిని మనం ప్రోత్సహిస్తే వారే అతిరథమహారధులు అవుతారు. అదే మాటను వారిని నిరుత్సాహపరచడం వల్ల ఆ వ్యక్తి  నాశనానికి, పతనానికి , మరణానికి కారణం అవుతాం. కురుక్షేత్రం యుద్ధంలో అర్జునుడికి  రథసారథి శ్రీకృష్ణుడు, కర్ణుడికి  రథసారథి శల్యుడు. శల్యుడు కర్ణుడిని యుద్ధం జరిగేటప్పుడు నీవు గెలవలేవు, ఓడి పోతావు అని నిరంతరం నిరుత్సాహపరుస్తూ  ఉండేవాడు కర్ణుడు ఓడిపోవడానికి కారణమయ్యాడు. అర్జునుడును శ్రీకృష్ణుడు నువ్వు శక్తివంతుడువు, ఎన్నో వరాలు పొందినటువంటి విశిష్ట వ్యక్తి వి మరియు నేనున్నా నీకు  మనం గెలుస్తాం అని పదేపదే ప్రోత్సహిస్తూ యుద్ధం చేయించి  అతి పెద్ద కౌరవ సైన్యం మరియు మహా యోధులు ఉన్న యుద్ధంలో అర్జునుడు విజయం పొందాడు. దానికి కారణం అర్జునుడుకి శ్రీకృష్ణుడు ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహం.  హనుమంతుడుని కూడా శ్రీరాముడు అదేవిధంగా ప్రోత్సహించాడు. నీవు మామూలు వ్యక్తి కాదు అతి శక్తివంతుడువు. ఆ ప్రోత్సాహమే హనుమంతుడు  ఎన్నో విశిష్టమైన కార్యాలు చేసి యుగయుగాలుగా మనం కొలిచే దైవం అయ్యారు. ఈరోజు నుంచి మన మాటలు ఆ విధంగా ఉపయోగించి  పై వారిలో ఉన్న విశిష్టతను గొప్పతనాన్ని గుర్తుచేసి మహా వ్యక్తిలుగా మారె ప్రయత్నం చేద్దాం.

Post a Comment

0 Comments