“గడియారపు ముల్లు”
కన్నా... పెద్ద ముల్లు కొంచం వంకర అయినట్లుంది.... ఆగిపోయింది....
మా తాతలనాటి గడియారం రా....
ప్రతీ రోజు చూస్తూ వుంటే.... గతించిన రోజులు, బంధువులు, బంధుత్వాలు పదే పదే గుర్తుకు వచ్చి ఈ వయసులో కూడా లేని ఓపిక వస్తుంది....
నేటి మీ తరం వారికి అవన్నీ అక్కర్లేదులే ....
ఆనందం వచ్చినా... దుఃఖం వచ్చినా.... ఏదో ట్యూబులో సినిమాలు .... ఇతరత్రా చాట్ తోనో మనసు మళ్లించుకుంటారు .... వెర్రి నాగన్నలు .....
అవి తాత్కాలిక ఉపశమనమేరా....
ఆ సమయంలోనే నా అనే వాళ్ళు ప్రక్కన వుంటే... కొండంత బలం......
ఏదో ఆ మాట ఈ మాట అనుకున్నా నా అన్నవాళ్లు అభిమానవంతులు రా.....
మీ తరం చూస్తూ వుంటే..... ఎదురుగా కనిపించే సీతాకొక చిలుక అందాలు శాశ్వతం అనుకుంటున్నారు....
అందం, అద్దం అప్పుడప్పుడు చూచుకోవటానికే .....
నిరంతరం అదే ఆస్వాదనలో వుంటే... జీవితానికి అర్ధం వుండదు.... చివరికి మిగిలేది అసంతృప్తి....
బాబోయ్.... ఆ గడియారం సంగతి నేను చూస్తానులేవే బామ్మా!!.....
పెద్ద క్లాసు పీకేస్తున్నావు......
జ్ఞాన కేంద్ర కుటుంబ చిట్టి చిన్నారి ఉవాచ....
పాత తరం గడియారం నడక ముల్లు మీద ఆధారపడి వుండేది..... అంటే.... నేను స్వతంత్రుడనైనా... ఉమ్మడి కుంటుంబ వ్యవస్థలో సలహకో, సాయానికో ఒకరి మీద ఆ ముల్లు మాదిరి అలుపు సోలుపు లేక అలా తిరిగుతూ వున్న ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇంటిల్లిపాది నన్ను కనిపెట్టుకుని వుండేటట్లుగా వుండేది....
నేటి తరం డిజిటల్ గడియారం .... ఆహూ.... మాటి మాటికి బాటరీ మార్చటం.... ఆగిపోతే క్రొత్తది వీజీగా దొరుకుతోంది కదాని దీనిని నిర్లక్ష్యం చేయటం.....
కన్నా... ఇప్పటి తరం అలాగే వున్నారురా... అవసరం వున్నప్పుడు మాత్రమే నా వాళ్ళు , తీరిన తరువాత పరాయి వాళ్ళు .... ఆఖరికి రక్త సంబంధీకులును కూడా.....
అందుకనే.... మనం ఎంత హోదాలో వున్నా స్వతంత్రులం కాదు బాబూ ....
ఆధారపడవలసినదే....
మల్లె తీగకి ఆధారముంటేనే కదురా.... పై పైకి ఎగబాకి గుబురుగా తయారై మల్లె వాసన చుట్టు ప్రక్కలకు కూడా గుభాలిస్తుంది.....
మనిషి కూడా అంతే నాన్నా.....
సహాయం పొందుతూ, నిస్వార్ధంగా సహాయం చేస్తూ వుంటేనే... యావత్ మానవ జాతి ఊతంగా వుండి ... నీ ఎదుగుదలకు సాయం చేస్తుంది.
కాదంటావా..... బామ్మ మాట బంగారు మూటరా... వినుకోవా కన్నా!!....
Hi Please, Do not Spam in Comments