కవల సోదరులను 69 సంవత్సరాల అనంతరం కలిపిన రెడ్ క్రాస్.

కవల సోదరులను 69 సంవత్సరాల అనంతరం కలిపిన రెడ్ క్రాస్.

SHYAMPRASAD +91 8099099083
0
కవల సోదరులను 69 సంవత్సరాల అనంతరం కలిపిన రెడ్ క్రాస్.
--------------------------------------------- 
పోలాండ్ ఐరోపాలో చిన్నదేశం. 1939 సెప్టెంబరు 1 వ తేదీన నాజీ జర్మని పోలాండ్ పై దాడి చేసి  ఆక్రమించింది. అదే నెలలో  సోవియట్ రష్యా కూడా పోలాండ్ పై దాడి చేసింది.ఇరు రాజ్యాలు ఒక ఒప్పందానికి వచ్చి చెరిసగం పంచుకోవడం జరిగింది. 1941లో నాజీ జర్మని  పోలాండ్ ను పూర్తిగా ఆక్రమించడం జరిగింది.

నాజీ అక్రమణతో  పోలాండ్ లో జాతి వివక్షత సామూహిక నరమేధం మొదలైంది. ముఖ్యంగా పోలాండ్ లో వున్న Jews పట్ల మారణహోమం అధికమైంది.

రోజుకు రెండు వేలమంది చొప్పున Gas chambers లో పంపి చంపేవారు.  బలంగా దృఢంగా వున్నవారిని నిర్బంధ కార్మికులుగా మార్చి వారితో నాజీలు వెట్టిచాకిరి చేయించేవారు.

ఇలా నిర్బంధ కార్మిక శిబిరాలకు పంపినవారిలో ఎలిజిబెత్ ఒక్కరు. ఈమె పోలాండ్ జాతీయురాలు. భర్త అమెరికన్ ఆర్మీలో పనిచేసేవాడు. ఎలిజిబెత్ ను నాజీలు 1944లో నిర్బంధశిబిరానికి తీసుకురావడం జరిగింది.

బానిసశిబిరంలో చేరునప్పటికే ఎలిజిబెత్ గర్భవతి. గర్భవతిగా వున్న ఎలిజిబెత్ నిర్బంధ చాకిరి  చేయలేక బాగా బలహీనపడింది. ఈ సమయంలోనే ఈమె కవల పిల్లలకు జన్మనివ్వడం జరిగింది.కొద్దిరోజులకే మిత్రరాజ్యాలు జర్మనీని ఓడించడం వలన నిర్బంధ శిబిరాలలో వెట్టి చేస్తున్న వారందరికి విముక్తి లభించింది.

ఎలిజిబెత్ కి కూడా విముక్తి లభించింది, కాని ఆమె బాగా శోషించి శుష్కించి పోయివుంది. ఇద్దరు పిల్లలను సాకేంత శారీరక మానసిక ఆర్ధిక పరిస్థితులు ఆమెకు లేవు. అందుకే పసిపిల్లలు ఇద్దరిని పోలాండ్ లోనే ఇతరులకు దత్తతకు ఇచ్చి అమెరికా వెళ్ళిపోయింది.

అమెరికా అయితే వెళ్ళిపోయింది కాని కన్నపేగు బంధాన్ని తెంచుకోలేక పోయింది. బిడ్డలకోసం అనేక ప్రయత్నాలు చేసింది కాని ప్రయోజనం లేకపోయింది.

పోలాండ్ లో రెండు వెర్వేరు కుటుంబాలు పిల్లలను దత్తు తీసుకొన్నాయి. ఈ రెండు కుటుంబాలకు ఎవరికెవరో తెలియదు, సంబంధంలేదు.

కవలలో ఒక్కడి పేరు Poznanski. ఇతను పోలాండ్ అర్మీలో చేరాలనుకొంటున్నపుడు ద్రువీకరణ పత్రాలు పరిశీలనలో తనకో కవల సోదరుడున్నట్లు తెలుసుకొన్నాడు. 

మరో కవల సోదరుడైన
Skrzunecky కూడా 17 సం॥రాల వయస్సులో తనకొ కవల సోదరుడున్నట్లు తెలుసుకొన్నాడు.వెంటనే Skrzunecky తన కవల సోదరుడిని కనుక్కోనేటందుకు రెడ్ క్రాస్ సొసైటీని అశ్రయించాడు. అయినా ఫలితం దక్కలేదు.విధిలేక స్క్రిజ్ నెక్కి  అమెరికా వెళ్ళిపోయాడు.

కొన్ని సంవత్సరాల అనంతరం పోలాండ్ లో వున్న పోజనాన్ స్కి కష్టపడి తల్లి చిరునామా తెలుసుకొన్నాడు. అప్పటినుండి తన కవల సోదరుడిని వెతకసాగాడు.

2014 సంవత్సరంలో  అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటి విభాగమైన Red cross Restoring family links సంప్రదించి Skrzynecky   చిరునామా కొరకు ప్రయత్నించాడు. 

వారు ఇతనికిచల్లటి కబురందించారు.అమెరికాలో వున్న కవల సోదరుడి వివరాలు అందించారు.

2015 లో సోదరులిద్దరు పోలాండ్ దేశంలోని వార్సా ఎయిర్ పోర్టులో కలుసుకొన్నారు. ఒకరికొకరు చూచుకోగానే ఉద్విగ్నానికి లోనై కన్నీటి పర్యంతమై ఒకరికొకరు ఆలింగనం చేసుకొన్నారు. అన్నదమ్ముల భావోద్వేగ అలింగన సన్నివేశ దృశ్యాన్ని రెడ్ క్రాస్ సొసైటి కెమెరాతో క్లిక్ మనిపించింది.

తరువాత జరిగిన సమావేశంలో దాదాపు 48 సం॥ రాల క్రిందట మా ఇద్దరికి 
 కవలలమన్న సంగతి వేరువేరుగా  తెలిసినప్పటికి, సం॥రాలు గడిచేకొద్ది మాలోని రెండవవాడు బ్రతికివుంటాడనే నమ్మకాన్ని కోల్పోయామని, అలాంటిది రెడ్ క్రాస్ సొసైటి మా ఇద్దరిని ఏకం చేసిందని కృతజ్ఞతలు తెలియచేశారు.

----------------------------------------------------------------------------------

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!