కథ -సన్యాసి

కథ -సన్యాసి

SHYAMPRASAD +91 8099099083
0
ఒక కథ* 

ఒక రాజుగారికి సన్యాసులంటే ఎంతో భక్తి. 

సంసారాన్ని త్యజించి, ముక్తి మార్గంలో పయనించే సన్యాసులు అందరి కన్నా గొప్పవారని ఆయన విశ్వాసం. 

అటువంటి సన్యాసులు భిక్షమెత్తుకుని బతకటం ఆయనకు నచ్చలేదు. 

అందుచేత ఆయన మంత్రిని పిలిచి, ‘‘మన రాజ్యంలో ఉన్న ఒక్కొక్క సన్యాసికి పదివేల వరహాల చొప్పున పంచిపెట్టండి, ’’ అన్నాడు.

దేశంలో సన్యాసులకు కొదవలేదు. కానీ..అందరికీ తలా పదివేలూ ఇస్తే ఖజానా ఖాళీయే. అయినా రాజుకు ఎదురు చెప్పలేక, ‘‘చిత్తం, అలాగే!’’అని మంత్రి వెళ్లిపోయాడు.

మర్నాడు సభలో రాజు మంత్రిని, ‘‘మీకు అప్పగించిన కార్యం నెరవేర్చారా?’’ అని అడిగాడు. ‘‘క్షమించాలి మహారాజా! సన్యాసి అనేవాడు ఎవడూ నాకు కనిపించలేదు.’’ అన్నాడు మంత్రి.

రాజు ఆశ్చర్యపోయాడు.

‘‘అవును, ప్రభూ! నిజమైన సన్యాసి తుచ్ఛమైన ధనం స్వీకరించడు. ధనం స్వీకరించిన వాడెవడూ నిజమైన సన్యాసి కాజాలడు’’ అన్నాడు మంత్రి.

*చావు వచ్చినపుడు* *సన్యసించేదెట్లు*
*కడకు మొదటి కులము* *చెడినయట్లు*
*పాపమొకటి గలదు* *ఫలమేమి లేదయా!*
*విశ్వదాభిరామ* *వినురవేమ* !

అవసాన దశకు చేరుకున్నప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నావా? అంటే పూర్వాశ్రమంలో 
చేసినవన్నీ తప్పులన్నట్టేగా.గతంలో జరిగిన పాపం
ఎటూ పోదు. దాని ఫలితం అనుభవించక తప్పదు. 
సన్యసిస్తే మంచిఫలితం వస్తుందనుకుంటున్నావా? అదంతా వొట్టిది .....
అంటున్నాడువేమన.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!