గుడ్డి నమ్మకం

గుడ్డి నమ్మకం

SHYAMPRASAD +91 8099099083
0
గుడ్డి నమ్మకం

ఒక పెద్ద చెరువు దెగ్గిర ఒక కొంగ వుండేది. ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి, తింటూ వుండేది. కాని ఆ కొంగ కాల క్రమేణ ముసలిది అయిపోయి, ముందరిలా చేపలు పట్టలేక పోయేది. కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే వుండిపోయే పరిస్థితి వచ్చేసింది.

“ఇలా అయితే కష్టం, నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను,” అనుకుంది కొంగ. అలాగే ఒక ఉపాయం తట్టింది.

చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు, చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది.

అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా వుండే ఒక పీత ఉండేవాడు. ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి, “ఎందుకు ఇలా వున్నారు?” అని అడిగింది.

“ఏమి చెప్పమంటావు?” అంది కొంగ. “నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది.”

“అదేమిటి” అని పీత ఆరాటంగా అడిగాడు.

“ఈ రోజు చెరువు దెగ్గిర ఒక జ్యోతిష్యుని చూసాను. అయిన ఈ ప్రాంతంలో పన్నిండు సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు. ఈ చెరువు ఎండి పోతుంది. మనం అందరం పోతాము. నాకు నా గురించి బెంగ లేదు, నేను ఎలాగా ముసలి దాన్ని అయిపోయాను. కానీ మీరందరూ ఇంకా చినా వాళ్ళు. మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖం గా వుంది.” అంది కొంగ.

పీత వెళ్లి విషయం చాపలుకు చెప్పాడు. చేపలన్నీ ఏడవడం మొదలెట్టాయి, “అయ్యో! ఎలాగా! మనం అందరం చచ్చి పోతామా?”

“పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు వుంది, కావాలంటే నేను మిమ్మల్ని అందరిని ఒక్కొక్కటి గా తీసుకుని వెళ్తాను” అని కొంగ ప్రస్తావించింది. వెంటనే అన్ని చేపలూ ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి.

అలా రోజు కొంగ ఒక చాపను పక్షి ముక్కులో పెట్టుకుని  యెగిరి పోయేది. కానీ వేరే చెరువు దేగ్గిరకి కాదు. కొంత దూరంలో కొన్ని బండల దెగ్గిర ఆగి, చాపను చంపి తినేసేది. సాయంత్రానికి అలిసి పోయినట్టు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది.

ఇలా కొన్ని రొజూ గడిచాయి. ఒక రోజు పీత, “నన్నూ తీసుకుని వెళ్ళవా, నాకు ప్రాణం కాపాడ్కునే అవకాశం వస్తుంది” అని కొంగను ప్రాధేయ పడ్డాడు.

కొంగ, “రోజు చాపలు తిని బోర్ కొడుతోంది, ఈ రోజు పీతని తినచ్చు” అనుకుని, “దానిదేముంది, ఇవాళ నిన్నే తీసుకుని వెళ్తాను” అంది.

కానీ పీత చాలా పెద్దగా వున్నాడు. కొంగ పక్షిముక్కులో పట్టడు. అందుకే పీత కొంగ వేపుమీద ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరూ ప్రయాణం మొదలెట్టారు. కొంత సేపటికి పీతకి అసహనం పట్టలేక, “ఇంకా యెంత దూరం?” అని అడిగాడు.

“మూర్ఖుడా! నిన్ను ఏ చెరువు దేగ్గిరకీ తీసుకుని వెళ్ళటం లేదు! నిన్నూ ఆ చేపల లాగా బండల దేగ్గిరకు తీసుకుని వెళ్లి తినేస్తాను” అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది.

పీతకి పిచ్చ కోపం వచ్చింది. గట్టిగా కొంగ మెడను పంజాలలో పట్టుకుని పీక నొక్కి చంపేసాడు. అలా ప్రాణాలతో సహా మళ్ళీ చెరువుకి వెళ్లి జరిగినది మిగిలిన చేపలకు చెప్పాడు.

ఇకపై  మనం ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పే మాటలలో స్వార్తముందా, అని ఆలోచించాలి, అని చేపలు, పీత నిశ్చయించుకున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!