తెలుసుకుందాం- పని చేద్దాం

తెలుసుకుందాం- పని చేద్దాం

SHYAMPRASAD +91 8099099083
0
ఒక ఏడు ఏళ్ళ అబ్బాయి వీధి పైన హాయిగా నడుస్తూ వెళ్తున్నాడు 
వీధి లో ఎవరో  పడేసుకున్న ఒక్క రూపాయి  అతనికి దొరికింది 
ఆ రోజు మొదలు ఆ పిల్లాడు ధించిన  తన తలను తన జీవితం అంత  పైకెత్తలేదు ఏదైనా దొరుకుతుందేమో అని 
ఇప్పుడు  అతని వయసు 75 ఏళ్ళు
తనకు దొరికింది 750 రూపాయలు అతను పోగొట్టుకున్నది  అందమైన ప్రకృతిని 
పచ్చని చెట్లను అందులో రోజు పూస్తున్న రంగుల పువ్వులను 
ఇంద్రధనస్సు ను చూడలేదు 
పసిపిల్లల ఏడుపులు వినిపించలేదు వారి నవ్వులు కనబడలేదు  
మొత్తానికి వెలకట్టలేని ఎన్నో అందాలను ఆనందాన్ని పోగొట్టుకున్నాడు  

ఇది ఓ పిల్లాడి జీవితం కాదు ప్రస్తుత  సమాజం 
వృద్ధులకు అంటే తమంతట  తాము  పని చేయలేని వాళ్లకు పింఛను  ఇచ్చారు అన్న గారు 
అది కాస్త 200 చేశారు రాజశేఖర్  గారు 
పదవిలోకి రాగానే చంద్రన్న  1000 ఇచ్చాడు దిగిపోతున్నాడు మళ్ళీ పదవిలోకి రావాలని 2000 చేసాడు 
పదవి పోయిందిగాని  ఇప్పుడు జగనన్న 2250 ఇస్తూ ప్రతి ఏడూ 250 పెంచుతూ ఉంటానని  హామీ  ఇచ్చాడు 

ఇప్పుడు గొప్పగా నిరుద్యోగులకు  ఉద్యోగాలంటూ  వాలంటీర్ లను  నియమించాడు  చెప్పాలంటే వాలంటీర్ అనే పదం  వాడకూడదండి  వారికి ఎందుకంటే జీతం  తీసుకుంటున్నారు  కనుక 
సరే ఏదో అన్నారు అనుకున్న వారికీ ఇస్తున్న  జీతం 5000 
సోమరిగా చేసి మనుషులకు ఇస్తున్నది 2250 నుండి 3000 

ఈనెల ఉదయం రవి కూడా ఇంకా రాలేదు పాపం అప్పుడే ఇంటికే పింఛను వచ్చి ఇచ్చి వెళ్లారు తీసుకుంటున్న వారికి 
ఇక నెల నెల సరుకులు అదే అండి బియ్యము పప్పు  ఉప్పు అంత వారే  తెచ్చి ఇచ్చేస్తారు  

ఇక బయటి  ప్రపంచంతో  పని ఏముందండి  ఈ మనుషులకు 
కష్టపడి పని చేయాల్సిన అవసరం అంతకంటే లేకపోయే  
ఇక మన  రాష్ట్రం ఎందుకు ఉన్నత  స్థాయికి  చేరుకుంటుంది  
ఎక్కడ వేసిన గొంగళి  అక్కడే అన్నట్టు  దిగజారిపోయే పరిస్థితే  కానీ అభివృద్ధి అనేది ఏ కోశానా  కనిపించడం  లేదు 

మధ్యమధ్యలో మిడి  మిడి జ్ఞానంతో  ఎవడో రెచ్చగొడితే 
అంతకంటే దిగజారిపోయిన జ్ఞానంతో  మతకల్లోలాలు  కుల  హత్యలు  

జపాన్ దేశంలో చెత్తబుట్టలో  అన్ని పరికరాలు  ఒక్కటిగా  వేసి ఇస్తే కఠినమైన  శిక్షలు  
ఇంట్లోని చెత్తను హాని చేసే బ్లేడ్  గాజు ఒప్పులు విడిగా పొడి తడి చెత్త లను వేరు చేసి ఇవ్వాలి 
ఆ అలవాటు  పసిప్రాయం  నుండే పిల్లలకు అలవాటు చేస్తారు 
అమెరికా లో వీధుల్లో  ఏ వీధి కుక్కలు కనిపించవంట
ప్రభుత్వం కనిపించిన కుక్కల్ని దత్తత తీసుకుని వెళ్ళిపోతారంట 
ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు సైతం తెలియక ఏ ఇతర మనుషులకైనా హాని చేస్తే ఆ యజమానికి కఠినమైన శిక్షలు ఎక్కువ మొత్తంలో  పరిహారం చెల్లించాల్సి ఉంటుంది 

అందుకే అక్కడ అభివృద్ధి చాల వేగంగా ఉంటాయి 
చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వాళ్ళ సూత్రం
కానీ మనకు పెద్ద తప్పులకు కూడా శిక్షలు లేవు అందుకే చెలరేగిపోతున్నారు 

నేను ఒక్కదాన్ని  మారి ఏమి చేయగలను నాతో ఏమైనా దేశం మారిపోతుందా అనే ఆలోచన అందరికి 
కచ్చితంగా నీ ఒక్కరిలో వచ్చిన మార్పు నీ చుట్టూ ఉన్న వారిని మారుస్తుంది
మన సమయంలో కాకపోయినా మన అలవాట్లు పెరిగి పెద్దదై భవిష్యత్తులో భారతదేశం బాగుంటుందేమో 

ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ఉచితాలను చూస్తూ బయట విలువైన అభివృద్దులను ఎన్నింటినో మనం సృష్టించలేకపోతున్నాం  

ఒక్క క్షణం ఆలోచించండి

మీ 
శ్యామ్ ప్రసాద్

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!