మొపాసా ఒక కథ రాశాడు.
ఒక వ్యక్తి ప్రియురాలు న్యుమోనియాతో సడన్ గా చచ్చి పోతుంది. అతను తీవ్రంగా దుఃఖ పడతాడు . ఆమె చూసుకునే అద్దం నుంచి ఆమె చెప్పుల వరకూ ఆమె జ్ఞాపకాలు రగిలిస్తుంటే తీవ్రంగా కలత చెందుతాడు. అంతటి ప్రేమికురాలిని శవపేటిక లో పెట్టి మేకులు కొట్టే సీన్ మర్చిపోలేక పోతాడు.
ఆమెను సమాధి చేసిన స్మశానానికి ఒక రాత్రి వేళ వెళ్తాడు. కనీసం ఆమె సమాధి అయినా చూడాలని
చీకట్లో ఆమె సమాధి గుర్తించలేక ఒక సమాధి మీద కూచుంటాడు. ఇంతలో ఆ సమాధి పై రాయి కలదటం తో అదిరి పడి లేచి నిల్చుంటాడు
ఆ సమాధి మీద ఇలా రాసి ఉంటుంది "జాన్ ఓలివాంట్ అనే ఇతను తండ్రికి కృతజ్ఞుడు గా, భార్యకు విశ్వాస పాత్రుడు గా, బిడ్డల మీద ప్రేమ కల్గి సజ్జనుడు గా జీవించాడు"
సమాధి లోంచి జాన్ ఓలివాంట్ ఆత్మ బయటికి వచ్చి చూపుడు వేలుతో దాన్ని చెరిపేసి ఇలా రాస్తుంది
"జాన్ ఓలివాంట్ అనే ఇతడు తండ్రి చేతిలోంచి ఆస్తి లాక్కునేందుకు నిర్దయగా ప్రవర్తించి అతని చావుకు కారణమయ్యాడు. భార్యా బిడ్డల పట్ల పరమ దుర్మార్గుడు. ఇరుగు పొరుగుల్ని బాధించి మోసపుచ్చే వాడు. దొంగతనాలు కూడా చేసి పనికిమాలిన వాడు గా చచ్చాడు"
చుట్టూ చూస్తే ప్రతి సమాధి నుంచీ అన్ని ఆత్మలూ బయటికి వచ్చి బంధువులు రాసీన అబద్ధాలు చెరిపేసి నిజాలు రాస్తుంటాయి. చచ్చీ చెడీ ప్రియురాలి సమాధి వెతికి వెళ్ళి చూస్తాడు
అక్కడ ఇలా రాసుంటుంది
"She loved
She was loved
And she died"
అతను చూస్తూ ఉండగానే అతని ప్రియురాలు సమాధి నుంచి బయటికి వచ్చి దాన్ని చెరిపేసి ఇలా రాస్తుంది
"ఈమె ఒక వర్షాకాలం రాత్రి తన ప్రియుడిని మోసగించే ఉద్దేశంతో
ఎవరి కోసమో బయటకు వెళ్ళి వాన లో తడిసి న్యుమోనియా తో పోయింది"
ఇంతే, కథ !!
ఒక వ్యక్తి మరణించగానే అతడిని/ఆమెను ఆకాశానికెత్తి ఆహో ఓహో అని మనం చేసే కీర్తనలు, స్తుతులూ, నిందలూ మన వైపు నుంచే
వాళ్ల ఆత్మలు బయటికొచ్చి నిజాలు రాస్తేనో చెప్తేనో తప్ప అసలు "వాళ్ళేంటి?" అనేది తెలీదు. ఎవడి కథ వాడే “నిజం గా” చెప్పుకోవాలి తప్ప మన perspectives కేవలం మనవే!
అవన్నీ సత్యానికి అటో ఇటో ఉంటాయి
Hi Please, Do not Spam in Comments