కథ -జీవితమంటే పోస్టు మ్యాన్

కథ -జీవితమంటే పోస్టు మ్యాన్

SHYAMPRASAD +91 8099099083
0
☘ "  జీవితమంటే .....????  " ☘
       ☀  ఎంత ఆలోచించినప్పటికీ జీవితమంటే ఎమిటో తెలియక సతమతమవుతున్న ఒక జీవితపు ప్రయాణ బాటసారి  గురువు వద్దకి  వెళ్ళి "స్వామీ ....!!!! ఎంత ఆలోచించినా జీవితం అంటే ఎమిటో తెలియట్లేదు ఇక మీరే నాకు జ్ఞాన ప్రదాత అని శరణు వేడాడు . 
     ☀   అది చూసిన గురువు గారు ఆ శిష్యుడిని  పోస్టు మాస్టర్ వద్దకి తీసుకెల్లి ఈరోజటి "ఉత్తరాల సంచిని " శిష్యుడికి ఇప్పించి ఆ సంచిలో ఉన్న ఉత్తరాలను అడ్రసుల వారీగా పంచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు .అది చూసిన ఆ బటసారి కొంత ప్రశ్నార్థకంగా చుస్తూ ......!!! సరే గురు శాసనమని స్వీకరించి ముందుకి సాగుతాడు . అలా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచుతూ ఉండగా ఒక ఇంటికి  వచ్చిన ఉత్తరంలో ,ఆఇంటి బిడ్డకు ఉద్యోగం వచ్చిందని లేఖ ఉంటుంది , అది చూసి  సంతోష పడతాడు . మరో ఇంటికి వచ్చిన లేఖలో వారి బంధువొకరు మరణించారన్న వార్త చూసి బాధపడతాడు , ఇంకో పేద వృద్ధురాలికి పించను డబ్బులు మనీ ఆర్డర్ ద్వరా ఇచ్చి సంబరపతాడు . ఇంకొకరి బంధువుల ఇల్లు మంటలలో కాలిపోయిందన్న  ఉత్తరమిచ్చి విలపిస్తాడు .అలా తిరుగుతూ సాయంకాలానికి గురువుగారి ఆశ్రమానికి  చేరుకొని విచారంగా కూర్చుంటాడు . గురుదేవుల రాకను గమనించి గబుక్కున లేచి కొంత అలసటతో కొంత విచారంతో కొంత తెలుసుకోగలిగానన్న సంతోషంతో గురువుగారి పాదాలకు మనస్కరించి వెళ్ళిపోతాడు .
         ఏంటీ .......!!! కథ ను మధ్యలో ఆపాననుకుంటున్నారా .......నిజమేనండి  కథ అయిపోయింది ,
     !!!...ఆలోచించండి ఆ శిష్యుడికి  ఏమి అర్థమయ్యుంటుంది .....?????
       తెలిసిన వారికి సరే ....., లేనివారికి చెపుతాను , 
 "....జీవితమంటే పోస్టు మ్యాన్ భుజానికున్న ఉత్తరాల సంచి లాంటిది అందులో  సంతోషం , బాధల కలబోతల ఉత్తరాలున్నట్టు , జీవితం కుడా సుఖ దుఃఖాల కలబోత అన్నిటినీ భరిస్తూ ముందుకి సాగడమే జీవితం .... "

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!