కథ - రంగును చూసి అవమానించకండి

కథ - రంగును చూసి అవమానించకండి

SHYAMPRASAD +91 8099099083
0
ఒక వ్యక్తి ఒక హోటల్ కి వెళ్ళాడు 
అక్కడ ఒక నల్లని అమ్మాయి ఒక మూలన కూర్చున ఉన్నదీ 
ఆమెను చూడగానే ఈ తెల్లని మనిషికి ఎందుకో తెలియని కోపం 
ఆమె చిరునవ్వును చూసి ఇంకా ఎక్కువ ఆగ్రహం వచ్చింది 

ఆమె పైన ఏదో కోపం సాధించాలని తన పర్సు బయట తీసి ఇక్కడ వచ్చిన అందరికి నేను ఉచితంగా drinks ఇస్తున్నానని ఎవరు ఎంతైనా తీసుకోండని చెప్పాడు కానీ ఆ నల్లని అమ్మాయికి తప్ప అని చెప్పాడు 

ఆ అమ్మాయి  ఆ తెల్లని వ్యక్తికి ధన్యవాదాలు అని చెప్పింది 
ఆమె చర్యకు  ఇంకా కోపం వచ్చి వెయిటర్ ని పిలిచి అందరికి భోజనాలు కూడా నా డబ్బుతోనే కానీ ఆ ఒక్క అమ్మాయికి తప్ప అన్నాడు 

అప్పుడు కూడా ఆ అమ్మాయి అతని చూసి చిన్న చిరునవ్వుతో కూడిన ధన్యవాదాలు తెలిపింది  
ఇక కోపం ఆపుకోలేక  రిసెప్షన్  దగ్గరకు వెళ్లి అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు అలా నవ్వుతుంది ఎంత అవమానించినా అని అడిగాడు 

ఆ అమ్మాయి ఈ హోటల్ ఓనర్ అని అతను చెప్పగానే ఆ తెల్లమనిషి  నివ్వెరపోయాడు  

రంగును చూసి అవమానించకండి  
అందమైన మనసును చూడండి 
అవమానించినా ఎదురుతిరగని తన సహనాన్ని  గుర్తించండి 
ముఖ్యమైన విషయం ఏంటంటే  
తన కోపమే తన శత్రువు అదే నష్టమూను

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!