ఒక చిట్టి కథ*
అవంతీపురాన్ని పరిపాలించే శూరసేనునికి
ఒక సారి ఒక వింత కోరిక కలిగింది...
గొంగళిపురుగు నుండి ...అందమైన సీతాకోకచిలుక ఎలా వస్తుందో చూడాలని....
తన వుద్యానవనం లోని మొక్కల కు గొంగళిపురుగు గూడు ఉండడం గమనించచాడు....ఎంత ప్రయత్నించినప్పటికి
సీతాకోకచిలుక ఎప్పుడు ఎలా బయటకు వస్తుందో . చూడలేకపోయాడు.....
ఇలా లాభం లేదనుకొని
మంత్రి గారికి తన కోరిక తెలియజేశాడు...
మంత్రి గారు నలుగురు భటుల్ని పంపి ఇరవైనాలుగు గంటలూ కాపలా వుంచి..సీతాకోకచిలుక వచ్చే సమయం తెలియజేయమన్నారు....ఆ శుభఘడియ రానే వచ్చింది...భటులు పరుగు పరుగున వెళ్లి రాజు గారికి తెెలియజేశారు.....రాజు గారు ఎంతో ఆత్రుత తో ఉద్యానవనానికి వచ్చి ..గొంగళిపురుగు గూడు నుండి అందమైన
సీతాకోకచిలుక రావడం గమనించారు..ఆయన ఆనందానికి అవధులు లేవు...కాని గూటీ నుండి సీతాకోకచిలుక బయటకు వస్తూ..చాలా కష్టపడడం గమనించాడు...
వెంటనే తన దగ్గర వున్న కత్తీ తో చిన్నగా ఆ గూటిని తొలగించాడు..రంగు రంగుల రెక్కలతో..అందమైన సీతాకోకచిలుక బయటకు వచ్చింది...కాని అది ఎగర లేక కిందపడిపోయింది...
ఇది చూసి రాజుగారు కలవరపడ్డారు...అపుడు మంత్రి గారు
మహారాజా ఏ జీవి ఎలా మనుగడ సాగించాలో ఆ భగవంతుడు ముందే రాసిపెట్టి ఉంటాడు.
గొంగళిపురుగు గూటిని చీల్చుకొని రావడానికి సీతాకోకచిలుక తన రెక్కలతో కొట్టుకుంటుంది..అందువల్ల ఆ రెక్కలకు బలం వచ్చి ఎగరడానికి ఉపయోగపడుతుంది....
మీరు ముందుగానే గూటిని తీసివేయడం వల్ల
అది ఎగరలేక పోయింది అన్నాడు...
**********************
పిల్లలకు అన్నీ చేతికి అందిస్తే...వాళ్లు ఎన్నటికీ నేర్చుకోలేరు...స్వయంకృషి తో పైకి రావడాన్ని ప్రోత్సహించాలి...
Hi Please, Do not Spam in Comments