తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని..

తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని..

SHYAMPRASAD +91 8099099083
0
🍁తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని..🍁

పదమూడేళ్ల నుంచి టీనేజీ ప్రారంభం అవుతుంది. 18 ఏళ్ల నుంచి యౌవనం మొదలవుతుంది. ఈ పిల్లల్లో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్లు విడుదలవుతాయి. వీటన్నింటి ప్రభావంతో వారి ఆలోచన విధానమూ మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

స్వేచ్ఛ కోరుకుంటారు. తల్లిదండ్రుల సహాయం లేకుండా తాము ఏదైనా చేయగలమని అనుకుంటారు. వారికంటూ ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. 

స్నేహితులపై ఆధారపడటం మొదలుపెడతారు. తమ ఈడు వారే అర్థం చేసుకోగలరనే భావన వారిలో కలుగుతుంది. ఇదే తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని పెంచుతుంది.

👉పెద్దవాళ్లు అనుమానిస్తారు...

తల్లిదండ్రుల తీరు మరోలా ఉంటుంది. తమ పిల్లలు ఏదీ చెప్పకపోవడంతో... అనుమానించడం మొదలుపెడతారు. ప్రతిదీ ప్రశ్నిస్తుంటారు. ‘ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు...’, ‘ఎవరితో ఛాటింగ్‌ చేస్తున్నావు...’, ‘మీ లెక్చరర్‌తో మాట్లాడమంటావా...’, ‘నీ స్నేహితుల పేర్లు చెప్పు’... అంటూ ఆరా తీస్తారు. వాళ్లు అనుసరించే ప్రతి ఫ్యాషన్‌ని విమరిస్తారు. వీటన్నింటితో పిల్లలూ చెప్పడం మానేస్తారు.

👉పెద్దవాళ్లు ఏం చేయాలంటే.... 

* రోజంతా ఎక్కడ ఉన్నా... సాయంత్రం అందరూ కలిసి భోజనం చేయాలనే నియమాన్ని పెట్టాలి. దాన్ని అధిగమించకూడదని హెచ్చరించాలి.

* అన్ని విషయాలు మీకే తెలుసనే ధోరణి వద్ధు అమాయకంగా ప్రశ్నిస్తూ, వాళ్ల నుంచి ఎక్కువ విషయాలు తెలుసుకునేలా చూడండి. పిల్లలు చెప్పేది సాంతం వినాలి. తరువాత వాస్తవాలు ఆలోచించాలి.

* ఇంట్లో ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు పిల్లల అభిప్రాయాలు కచ్చితంగా పరిగణించాలి.

* వాళ్ల చదువు, అభిరుచులు ఏవైనా సరే... వాళ్ల అభిప్రాయం, ఆసక్తికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ పిల్లల నిర్ణయం తప్పనుకుంటే అర్థమయ్యేలా వివరించి, నిర్ణయాధికారం వాళ్లకే వదిలేసి చూడండి.

* పిల్లలు చేసే పొరపాట్లకు హితబోధ వద్ధు అది వాళ్లకు నచ్చదని అర్థం చేసుకోండి. బదులుగా ‘తప్పు ఎక్కడ జరిగిందో గ్రహించు, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో నీకు తెలిసే ఉంటుంద’నే పదాలు వాడితే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.🍁

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!