లేటెస్ట్ సామెతలు/కోవిదులు(COVID లు):లేటెస్ట్ సామెతలు/కోవిదులు(COVID లు):

👉 క్వారంటీన్ లోకి పోయి  క్యారం ఆడినట్లు..
👉క్వారంటీన్లో కెళ్ళి కరోన అంటించుకున్నాడట

👉అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని ఒంట్లో కరోన ఉంది.

👉అగ్ని శేషము,శతృదేశము,ఋణ శేషము, కరోనా శేషము ఉంచరాదు

👉ఇల్లు అలకగానే  పండగ కాదు
దగ్గు రాగానే కరోనా కాదు

👉కరోనా సోకి లోకం ఏడిస్తే
కల్లు కావాలని ఒకడేడిచాడట

👉అనగనగా మంచి రాగం, 
తిరగగ తిరగగా కరోనా రోగం

👉కరువైనా, కరోనా అయినా ఒంటరిగా రావు

👉ఇల్లే తీర్థం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం, రోడ్డెక్కితే యమపురి
Stay home, stay safe

👉ఇంట్లో నిలువు, కరోనాను గెలువు

👉కక్కొచ్చిన, కరోనా వచ్చినా ఆగవు

👉నిప్పు ముట్టనిదే చేయి కాలదు.
బయట తిరగనిదే కరోనా రాదు

👉కంది పండితే కరువు తీరును
కోవిడ్ సోకితే ప్రాణం పోవును

👉కరోనా సోకినోళ్ళ దగ్గరకు కన్నోళ్లను కూడా పంపరాదు

👉కట్టు లేని క్వారంటీన్- గట్టులేని చెరువు

👉కప్పలు కూస్తే వర్షం పడును
కరోనా సోకితే పడిశం పడును

👉కానీకి కొబ్బరికాయ ఇస్తారని కాశీ దాకా పోయినట్లు,
పోషకాహారం పెడతారని క్వారంటీన్ కి పోయాడట.

👉కారణం లేకుండా కరోనా సోకదు

👉కరోనా పోయేదాక ఇంట్లో కూర్చుంటే, కలకాలం బయట తిరగవచ్చు.

👉కాళ్ళ దగ్గరకు వచ్చిన బేరం కాశీకి వెళ్లిన దొరకదు.
ముక్కు దగ్గరికి వచ్చిన కరోనా మూలిగే దాక పోదు

👉 క్వారంటీన్ కి పోయి కరోనా తెచ్చిండట

 👉కాలం గడిచిపోతుంది-కోవిడ్ నిలిచిపోతుంది

 👉దాగబోయిన దొంగ గాంధీ దవాఖానలో దూరిండట.

👉ఐసోలేషన్ లో  ice cream తింటే సుఖమా!

👉కరోనా కాలానికి అడుక్కుతినబోతే ఉన్న బొచ్చే కాస్త ఊడ్చుకుని పోయిందట.

Post a Comment

0 Comments