అత్మన్యూనత (inferiority) అంటే నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం.

ఏకాగ్రత ఉందా లేదా మొదట చెప్పు.
----------------------------------------------------
inferiority దీనినే మనం అత్మ న్యూనత అని అంటాం. అత్మన్యూనత అంటే నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవటం.

(అ) నేను అందంగా లేనని ఊహించుకోవటం.
(ఆ) నేను ధనవంతుడిని కాదని బాధపడటం.
(ఇ) నాకు సరైన తెలివితేటలు లేవని మదనపడటం.
(ఈ) నేను సరిగా చదవలేను అని నిర్ణయించుకోవటం.
(ఉ) నా ఎదుగుదలకు కుటుంబ పరిస్ధితులు అనుకూలంగాలేవని అభిప్రాయపడటం.
(ఊ) నాకేమిరాదు నాకేమి తెలియదనే స్ధిర నిర్ణయం చేసుకోవటం.

ఇలాంటివి నిన్ను నీవు తక్కువచేసుకోటానికి ఒకరకంగా కించపరచుకోవటానికి కారణాలు.

ఎప్పుడైతే నీలో అత్మన్యూనత భావం వృద్ధి చెందుతుందో అపుడే ఏదైనా ఒక పని చేయాలంటే నిర్లిప్తత అవరిస్తుంది. ఇలా నిర్లిప్తత ఆవరించిన సమయంలో పనిలో నిమగ్నమైతే ఏకాగ్రత లోపిస్తుంది.

ఏకాగ్రత లోపించడంతో చేరాల్సిన లక్ష్యాన్ని సకాలంలో అందుకోలేరు.

అత్మన్యూనత పోగోట్టుకోవాలంటే అత్మ విశ్వాసమే సరైన మందు.

ఈ విశాల విశ్వంలో ఈ రోజు శాశ్వతమని మనం భావించినది రేపు అశాశ్వితం కావొచ్చు.

ఈ రోజు అందంగా ఉన్నది రేపటికి రూపుమారి వికృతం కావొచ్చు.

ఈనాటి బలవంతుడు రేపటి బలహీనుడు కావొచ్చు.

 ప్రకృతిలో ఏది శాశ్వితం కాదు ఏది అశాశ్వితంకాదు.

అలాంటపుడు తనపై తనకు అపనమ్మకం ఎందుకు?

అత్మన్యూనత ఎందుకు?

తద్వారా ఏకాగ్రత కోల్పోవడం ఎందుకు?

నీపై నీకు నమ్మకం లేకపోతే ఇతరులకు నీపై గురెలాకుదురుతుంది.

అందుకు కష్టపడి పనిచెయ్

గత వైఫల్యాలను గుర్తు చేసుకొని కృంగిపోకు

గత వైఫల్యాన్ని ఓ అనుభవంగా మలచుకో

మంచి మిత్రులతో కాలక్షేపం చెయ్

మంచి పుస్తకాలతో కాలం గడుపు

ప్రకృతిని ఆశ్వాదించు

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపు

అవసరమైతే self hypnotise చేసుకో
 ఏకాగ్రత సాధిస్తావ్.. ప్రపంచాన్ని జయిస్తావ్

విజయం నీదే...

Post a Comment

0 Comments