శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీ శ్రీ) జయంతి (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983)

శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీ శ్రీ) జయంతి (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983)

SHYAMPRASAD +91 8099099083
0

అభ్యుదయ కవి..శ్రీరంగం శ్రీనివాసరావు(శ్రీ శ్రీ) జయంతి ఏప్రిల్30న ఆమహాకవికి నివాళులు అర్పిస్తూ........

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం  ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

జీవిత గమనం..

 శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాసరావు  1910 లో పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీరంగం సూర్యనా రాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగామారింది.  

ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలో  చేసాడు. 
1925లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 
1931 లో మద్రాసు విశ్వ విద్యాల యంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
1935లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరాడు. 
1938లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరాడు. 
ఆ తరువాత  ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 

1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం,జగన్నాథుని రథచక్రా లు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.*

1947లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. 

పిల్లలు లేని కారణం చేత 1949లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.

శ్రీ శ్రీ సాహిత్యం..

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు 

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి.

"వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే!శబ్ద ప్రయోగం లో నవ్యతను చూపించాడు.

శ్రీశ్రీ తన ఆత్మ కథను"అనంతం" అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించా డు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.

1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటి
సారి గా ప్రచురితమైంది. మహాప్రస్థానం,  జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. 

మహాప్రస్థానం..

"మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! పదండి ముందుకు పదండి అని ఉవెత్తున లేచి గర్జించిన సింహం వలె అరిచాడు.

 తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటి కి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు.*

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయనరచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. 

ప్రముఖ సినిమా పాటలు..

●మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
●హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
●నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన) 
●తెలుగువీర లేవరా(అల్లూరి సీతారామరాజు) 
●పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)

1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గాప్రచారం నిర్వహించాడు.  హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది.  

 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించ డానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970లో ఆయన షష్టిపూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.

కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.

 (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983)



*నేడు  మహాకవి శ్రీశ్రీ జయంతి…* 

సందర్భంగా...ఆయన రచించిన  కవిత్వం మీ కోసం  ......

కుదిరితే పరిగెత్తు.., లేకపోతే నడువు.., అదీ చేతకాకపోతే.., పాకుతూ పో.., అంతేకానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు.

ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, 'స్నేహితుడొకడు మోసం చేశాడని,' ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళి పోయారని, అలాగే ఉండిపోతే ఎలా?

దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే, తలుచుకుంటే, నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా, నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది,

అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు, పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా.., ఏదీ ఆగిపోడానికి వీల్లేదు.

 లే... బయలుదేరు... నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక భాదల సంకెళ్ళను తెంచేసుకో, పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు, నువ్వు పడుకునే పరుపు, నిన్ను చీదరించుకోకముందే, బద్దకాన్ని వదిలేయ్.

నీ అద్దం, నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో, నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్, మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు కారిస్తే కాదు.., చెమట చుక్కని చిందిస్తేనే.., చరిత్రను రాయగలవని తెలుసుకో.

చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే... అస్త్రాలు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!