లక్ష్యం సాధించాలంటే

లక్ష్యం సాధించాలంటే

జీవితంలో లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానాలను పొందినవారిని చూసినప్పుడల్లా,  వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవడం సహజం. మనకంటూ ఓ పట్టికను తయారుచేసుకుని దాన్ని రోజూ అనుసరించగలిగితే విజయం మన సొంతం  కావడానికి ఎక్కువ సమయం పట్టదు.‌* అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే... మళ్లీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే. ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చేవరకూ ఎదురు చూస్తుండాలి. 
* ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్యసాధనలో శారీరక, మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే. 
* సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది. 
* రోజూ చేయవలసిన పనులను ఓ  పట్టికలా రూపొందించి, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యంవైపు వెళ్లే మార్గం సుగమం అవుతుంది. 
* కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించాలి. వారితో అన్ని విషయాలను పంచుకోవాలి. మీ   ఆలోచనలకు వారి చేయూత మీలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. 
* లక్ష్యం వెంట పరుగులు వద్దు. మీకు నచ్చినట్లు, నమ్మకంతో ప్రయత్నించండి. మీరు చేరుకోవలసిన లక్ష్యం మిమ్మల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. 
* ఒకే దిశగా ఆలోచిస్తే పరిష్కారం  దొరకదు. దీనికోసం ఆలోచనాశక్తిని పెంపొందించుకుంటే, ఫలితం మీకే తెలుస్తుంది.
* ఎవరైనా లక్ష్యం చేరుకోలేకపోతున్నారంటే, కారణం వారికి తగినంత శక్తి లేకపోవడం కాదు, కావలసినంత విజ్ఞానం లేకపోవడం కూడా. కాబట్టి విజ్ఞానాన్ని పెంచుకుంటూ, సాధించాలనే తపనా, కోరిక ఉండాలి. అప్పుడే అనుకున్నది సొంతమవుతుంది.

Post a Comment

0 Comments