కథ - ఎందుకలా జరిగింది ?

కథ - ఎందుకలా జరిగింది ?

SHYAMPRASAD +91 8099099083
0
*గుణపాఠం నేర్పించే ఈ కథ చదవండి.* 

ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..
3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు . దాని మీద ప్రజల అభిప్రాయం 
తెలుసుకోవాలి అనుకున్నాడు . 
.
నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు . దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు 
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది . 
.
దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చింది . దాని నిండా
" ఇంటూలే ". ఖాళీ లేదు . 
.
ఏడుస్తూ తనకు నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .
.
మాస్టారు అతడిని ఓదార్చారు . అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు గురువుగారు . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు . 
.
" నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందొ అక్కడ క్రింద నేను పెట్టిన రంగులతో , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసు లో ఉంది . 
.
వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు . 
.
ఎందుకలా జరిగింది ? 
.
ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం.

👉 *ఒకరి జీవితాన్ని విమర్శించి  పడకొట్టడము వారికి చాలా సులభం కాని  వారి జీవితాన్ని సరిచేయడము వారికి చేతకాదు*.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!