ప్రేమ ఎంత విలువైనదో ........

*అనగనగా ఒక ద్వీపం ఉండేది.*
💐💐💐💐💐💐
ఆ ద్వీపంలో *ఆనందం, దుఃఖం, జ్ఞానం, ప్రేమ, ఈర్శ్యా ...మొదలైన అన్ని భావాలు - గుణాలు - లక్షణాలు జీవించేవి.*
😢😢😢😢😢😢
👉అకస్మత్తుగా ఒకరోజు ఆ ద్వీపం శాశ్వతంగా మునిగిపోతుందనీ అందువల్ల సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండని ప్రకటించబడింది.
👉ఆ ద్వీపంలోని భావాలు - గుణాలు - లక్షణాలు అన్నీ ద్వీపాన్ని విడిచి పోవడానికి పడవలను ఏర్పాటు చేసుకున్నాయి. 
👉ప్రేమ మాత్రం చివరి క్షణం వరకు ఆ ద్వీపాన్ని విడువలేక ఉండిపోయింది.
ఎటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోయింది. ద్వీపం దాదాపు మునిగిపోతునప్పుడు ప్రేమ సహాయం కోరడం ప్రారంభించింది. 
👉అదే సమయంలో "రిచ్ నెస్ (ధనవంతత్వం) " అద్భుతంగా ఏర్పాటు చేసుకున్న ఒక పెద్ద ఓడలో వెళుతూ ఉంటే...ప్రేమ సహాయం అడిగింది. ప్రేమను చూసి రిచ్ నెస్ "ఓ ప్రేమా! నేను ఇప్పుడు సహాయం చేయలేను! ఎందుకంటే ఈ ఓడ బంగారం, వెండి, విలువైన రత్నాల పెట్టెలతో పూర్తిగా నిండిపోయి ఉంది. ఒక్కరికి కూడా స్థలం లేదు!! ఇంకా చాలా మంది ఉన్నారుగా! వారిని అడుగు" అంటూ వెళ్లిపోయింది. 
👉ప్రేమ అందమైన పెద్ద ఓడలో అటుగా వెళుతున్న "గర్వాన్ని"సహాయం అడిగింది. "ప్రేమా! నేను నీకు సహాయం చేయలేను! నువ్వు పూర్తిగా తడిసిపోయి ఉన్నావు! అదీగాక నీకు బురద అంటుకుని ఉంది. నిన్ను తీసికెళితే నా పడవ చెడిపోతుంది "అంటూ వెళ్లిపోయింది. 
👉ప్రేమ దగ్గరగా వెళుతున్న "దుఃఖాన్ని" సహాయం అడిగింది. "ప్రేమా! నేను నీకు సహాయం చేయలేక పోయినందుకు చాలా దుఃఖపడుతున్నాను!!! ఎందుకంటే ఈ పడవను నా ఒక్క దాని కోసమే తయారు చేసుకున్నాను.ఇందులో మరో వ్యక్తి పట్టలేరు!! " అంటూ వెళ్లిపోయింది. 
👉ప్రేమ అటుగా వెళుతున్న "ఆనందాన్ని "సహాయం అడిగింది. " క్రొత్త ప్రదేశాలనూ, క్రొత్త అనుభవాలను రుచి చూడ బోతున్నానన్న సంతోషంతో ఉన్న " ఆనందానికి" ప్రేమ మాటలు వినిపించనేలేవు.
👉 ఆ వెనుకనే వచ్చిన "ఈర్ష్య"ను సహాయం అడిగింది. " తనను అందరూ దాటి వెళుతున్నారు. వాళ్ళను ఎలాగైనా దాటి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న " ఈర్ష్య" ప్రేమ మాటలను విని కూడా విననట్టు వెళ్ళిపోయింది. 
👉 *అకస్మాత్తుగా ప్రేమను ఎవరో పిలిచారు." ఓ ప్రేమా! ఇటు రా! నా పడవలో ఎక్కు! నేను నిన్ను తీసికెళతాను." అంటూ ఓడలోకి ఎక్కించుకుంది. ఆ పడవలో మరికొంత మంది కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళనూ,ఆ పడవలోని వ్యక్తులను చూస్తూ ప్రేమ మైమరచి పోయింది. పడవ ఒడ్డుకు చేరుకున్న తర్వాత సహాయం చేసిన ఆ వ్యక్తి ఎలా అకస్మాత్తుగా సహాయం చేసిందో అంతే అకస్మాత్తుగా తన దారిన తాను వెళ్లి పోయింది. ప్రేమ ప్రక్కనే ఉన్న "జ్ఞానాన్ని" ప్రశ్నించింది. " నాకు సహాయం చేసింది ఎవరు????" "అది' కాలం'!!" అంది జ్ఞానం. "కానీ ఎందుకు' కాలం' నాకు సహాయం చేసింది?" అడిగింది ప్రేమ. అప్పుడు మెరుస్తున్న కళ్ళతో జ్ఞానం ఇలా చెప్పింది. "ప్రేమ ఎంత విలువైనదో అర్ధం చేసుకోగలది కాలం మాత్రమే!!*
🙏✊✊🙏✊✊🙏
మంచి ఆలోచన గల వారు ఎప్పడికి గేలుస్తారు... ❤️

Post a Comment

0 Comments