ఒక అద్భుతం విలువ 83 రూపాయలు

ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు...

చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు...

మూడుసార్లు లెక్కపెట్టాడు..

తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..

ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా 

తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..

షాప్ లో ఆవిడ తనవేపు చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...

షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది..

ఏమి కావాలి బాబు అని..బాబు చెప్పాడు..

నాకు ఒక అద్భుతం కావాలి అని..

షాప్ ఆవిడ అర్ధం కానట్టూ ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది..

నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని..చెల్లి చాలా కష్టపడుతోంది..అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది..అని అడిగాడు బాబు...

ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..

ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబు అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది..బాబు మాటలకి విషయం అర్ధం అయ్యి ఆవిడకి బాధేస్తోంది....

నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు..అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను..అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు...

ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న 

పొడుగ్గా ఉన్న , మంచిగా తయారయ్యి ఉన్న , హుందాగా ఉన్న ఒకాయన బాబుని అడిగారు...

ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా అని ...

బాబు చెప్తున్నాడు..చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతోందంటా..

అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను...సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను..

అని చెప్తుంటే బాబుకి తెలీకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి....

ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు నీ దగ్గర ఎంత డబ్బు ఉందీ అని..బాబు చెప్పాడు 83 రూపాయలు...అని...అదీ వినపడి వినపడనట్టు..

ఓ అవునా ...తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే..ఏదీ పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం.. అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం..

ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ కి డైరెక్టర్...ఆయన ఒక్కరే చిన్నిపాప సమస్యకు వైద్యం చెయ్యగలరు...

ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేకుండానే ఆపరేషన్ జరిగింది...తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది...తల్లి అంటోంది...

ఎంత అద్భుతం జరిగిందీ...

అది కూడా ఒక్క పైసా 

ఖర్చు పెట్టనక్కరలేకుండానే అని తండ్రితో అంటోంది...

అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు...

వాడికి మాత్రమే తెలుసు...

ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని...

కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం...

కల్మషం లేని ప్రేమ, స్వార్ధం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి..దేవుడిని నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది..

అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో...

మనిషికి మనిషి సాయం చెయ్యాలి, అని అనుకోవాలి, అంతే...

Post a Comment

0 Comments