రాజుగారి కొలువులోని అధికారులు

రాజుగారి కొలువులోని అధికారులు.
----------------------------------------------
గతంలో రాజుగారి కొలువులో ఉండే అధికారుల సంఖ్య రమారమి డెబ్బైరెండుమంది.వారి గురించి ఇవ్వడమైనది. ఓపికగా చదవాలి సుమా!
(1)గురువు-శిక్షణ ఇచ్చేవాడు.
(2) ప్రధానమంత్రి
 (3) సామంతుడు 
(4) సేనాపతి 
(5) ద్వార పాలకుడు 
(6) అవసారిక (అంతరంగికుడు - Persnal Asst)
(7) ఘటికానిర్దారిక (కాలాన్ని నిర్ధారించి కొలిచేవాడు) 
(8) గణక (Accountant) 
(9) లేఖక ( writer)
(10) పౌరాణిక - పురాణ పఠనం చేసేవాడు (11)పురోహితుడు
(12)జ్యోతిష్కుడు 
(13) కావ్యజ్ఞ (కవి )
(14) విద్వజ్జన (విద్వాంసుడు) 
(15) దేవతార్చక (ఇంటి దేవుడికి పూజారి) 
(16) మాల్యకారక (పూలమాలలు అల్లేవారు) 
(17) పరిమళకార (పరిమళ ద్రవ్యాలు తయారుచేసేవాడు 
(18) గోష్ఠాధికార (గోవుల పాలకుడు) 
(19) గజాధికార (ఏనుగుల పర్యవేక్షకుడు) 
(20) అశ్వాధికార (గుర్రాల పర్యవేక్షకుడు) 
(21) భాండాధికార (Treasurer) 
(22) ధాన్యాధికార ( head of allkinds of grains) 
(23) అంగరక్షక (body guard) 
(24) సూత - రథచోదకుడు (charriate incharge)
(25) సూద - పాకశాస్త్ర ప్రవీణుడు (Kitchen incharge)
(26)బేతాళ - మాంత్రికుడు (Magician ) 
(27) మల్ల - మల్ల యుద్ధం చేసేవాడు 
(28) తాంబూలిక (తాంబూలం చేసి అందించేవాడు )
(29) తాళవృత్తక (వింజామర/విసనకర్రతో విసిరేవారు ) 
(30) నరవాహక - (నరులను మోసేవాడు శవాలను మోసేవాడు) 
(31) ఛాత్రిక (గొడుగుపట్టేవాడు) 
(32) చామరిక (చమురి మృగం వీవన విసిరేవాడు - దేవాలయాలలో ఉన్నితో చేసిన వింజామరలాంటిది)
(33) కళాచిక (కాహళ ఊదేవాడు - గొప్ప మేళంలాంటిది) 
(34) కరసారిక (పావురాల సంరక్షకుడు - పావురాలు ఉత్తరాలు అందచేసేవి) 
(35) పాదుకాదార ( పాదుకలు తెచ్చేవాడు) 
(36) నర్తకుడు 
(37) గాయకుడు 
(38) వైణికుడు (వీణధారి) 
(39) శాకునిక (శకున శాస్త్రం తెలిసినవాడు) 
(40) మాగధ (వందమాగధ స్తోస్త్రం-మహరాజాధిరాజరాజ పరమేశ్వర అంటూ కీర్తించేవాడు) 
(41) వైతాళిక (నిద్రలేపువాడు - మేలుకొలుపు పాడేవాడు) 
(42) పరిహాసిక (విదూషకుడు) 
(43) కరదీపికాకార (చేతిలో దీపం లేదా కాగడాతో ఉండేవాడు) 
(44) కంచుకి (అంత:పుర కావలికాడు ) 
(45) క్షౌరక (మంగలి) 
(46) రజక ( చాకలి ) 
(47) సౌచిక (బట్టలు కుట్టేవాడు - Tailor) 
(48) చర్మకారక (చర్మంతో పనిచేసేవాడు - చెప్పులు వ్యవసాయ పనిముట్లు చేసేవాడు 
(49) ముద్రాధికార (రాజముద్రలు వేసేవాడు.
(50) పురపాలక (పురపాలకుడు - Municipal commissiner)
(51) వనపాలక (gardener) 
(52) నరవైద్య (Doctor for numan beings)
(53) గజవైద్య ( Doctor for elephants) 
(54) అశ్వ వైద్య (గుర్రాలకు వైద్యం చేసేవాడు 
(55) పశువైద్య (veternary Doctor) 
(56) భేరివాదక(భేరి వాయించేవాడు - పెద్ద చర్మ వాయిద్యం - ఢంకా లాంటిది 
(57) మురజ (పెద్ద ఢంకా వాయించేవాడు) 
(58) రౌమక (ఉప్పుపై పర్యవేక్షణాధికారి -inspector of salts) 
(59) శిలాచ్చేదిక (శిల్పి) 
(60) కాంస్యకారిక (కంచులోహపని చేసేవాడు) 
(61) కుంభాకార (కుమ్మరి) 
(62) చిత్రకారుడు 
(63) వ్యవహారిక ( వర్తకుడు) 
(64) మృగయార్థిక (వేటగాడు ) 
(65) పక్షి ఘోషక (పక్షులను పెంచువాడు) 
(66) తిలపిసకక(నూనే తీయువారు / గాండ్లవారు) (67) రాయభారి 
(68) ఉగ్రాధికార (ఆహార పదార్థములు మొ॥జాగ్రత్త పరచువాడు) 
(69) వేశ్యాజన (వేశ్యలు -వేశ్యలు కూడా సర్వ శాస్త్రాలలో నిష్ణాతులు) 
(70) బంటు (సైనికుడు) 
(71) స్వర్ణకార (బంగారు పనిచేసేవాడు 
(72) కఠారిక (కత్తిని చేతబట్టి కాపాడువాడు)

--------------------------------------------------------------

Post a Comment

0 Comments