భారత యుద్ధంలో వ్యూహాలు

గరుడ వ్యుహం -సర్పవ్యుహం - మకరవ్యుహం -
భారత యుద్ధం.
---------------------------------------------

ఒక పని చేయాలంటే పక్కావ్యుహం అవసరం. ప్రణాళిక (Planning) లేనట్లైతే పనిలో ఇబ్బందులు తప్పవు.వ్యుహం (Strategy) అనేది సక్రమంగా ఉంటే సగం పని పూర్తి అయినట్లే.

ఇది వ్యక్తికైనా, సంసారానికైనా, కంపెనీకైనా, దేశానికైనా వర్ధిస్తుంది.

ఇక యుద్ధంలో శత్రుపక్షం వేసే ఎత్తుగడలను ఎదుర్కోటానికి ఓ పక్కా వ్యుహం అవసరం.దీనినే war strategy అంటారు. ఒక వ్యుహం లేదా పద్ధతి ప్రకారం సైన్యాన్ని నిలపడం ముఖ్యం దీనినే వ్యుహం పన్నడం (Formation of Army) అంటారు. యుద్ధతంత్రం పూర్తిగా తెలిసినవారే సరైన
వ్యుహం పన్నగలరు. ఎదుటివారి వ్యుహంను ఎదుర్కోగలరు.

అసలు వ్యుహలు గురించి మన దగ్గర ఈ పేర్లు కాకుండా ఏమైనా సమాచారం ఉందా అంటే లేదనే చెప్పాలి. పుస్తకాలు లేవు, Drawings లేవు.

కాని భారత సంస్కృతిని అభిమానించిన సయాం (థాయ్ లాండ్) రాజు సరెసుయన్ భారత యుద్ధనీతిని 1592లో అమలుపరిచాడు.ఆయన లిఖింప చేసుకొన్న అముద్రిత పుస్తకాలు క్వారిట్జ్ వేల్స్ అను ఐరోపావాసి వాటిలో 12 సేకరించి ప్రకటించాడు. అవి మాత్రమే మన దగ్గరున్నాయి.

మహాభారత యుద్ధంలో  అభిమన్యుడు పద్మవ్యుహంలో జొరబడి పోరాడిహతుడైనట్టు మనకు తెలుసు.

ఇంతకు ఎన్ని వ్యుహలు భారత 18 రోజుల యుద్ధంలో కౌరవ పాండవులు పన్నినారో గమనిద్ధాం.

1 వ రోజు కౌరవ సేనాధ్యక్షుడు భీష్ముడు సర్వతోభద్రవ్యుహం వేశాడు.ఈ వ్యుహంలో సేన అన్ని వైపులా క్షేమంగా ఉంటుంది. వలయాకారం ప్రధానం. మధ్యలో సేన కాంపాస్ ముళ్ళలాగా ఉంటుంది. దీనిని ఎదుర్కోటానికి అర్జునుడు దండవ్యుహం (garland)పన్నినాడు.

2 వ రోజు భీష్ముడు గరుడ వ్యుహం పన్నగా, పాండవుల వైపున దుష్ట దుమ్యుడు క్రౌంచవ్యుహం పన్నినాడు. రెండు బలమైన తెలివైన పక్షులే.

3 వ రోజు భీష్ముడు మరలా గరుడ వ్యుహం వేయగా, అర్జునుడు అర్ధచంద్ర (crecent)వ్యుహం పన్నినాడు.

4 వ రోజు కురుపితామహుడు (భీష్మ ) మండల వ్యుహం పన్నగా అర్జునుడు శృంగాటక వ్యుహం (శృంగం అంటే కొమ్ము - Horn ) ప్రతిగా ఆచరించాడు.

5 వ రోజు భీష్ముడు మకర (మొసలి) వ్యుహంతో యుద్ధం ప్రారంభిస్తే పాండవ మధ్యముడు శ్యేన ( గరుడ లాంటి పక్షి) వ్యుహం తో దిగాడు.

6 వ రోజు శంతనపుత్రుడు (భీష్మ ) క్రౌంచ (మంచి వాడి ముక్కు గల పక్షి) వ్యుహంతో రణం ప్రారంభించగా దుష్టదుమ్యుడు మకర  వ్యుహంతో, అభిమన్యుడు సూచీముఖ (సూది)వ్యుహంతో యుద్ధం చేశారు. ఒకే రోజు ఒకే పక్షం వారు రెండు రకాల వ్యుహములను ప్రయోగించారు.

7వ రోజు భీష్ముడు మండల (వలంయంలాగా )వ్యుహంతో రాగా అర్జునుడు వజ్ర (పిడుగు)
వ్యుహంతో ఎదిరించాడు.

8 వ రోజు భీష్ముడు మొదట కూర్మ(తాబేలు ) వ్యుహంతో సైన్యంతో రాగా, అర్జునుడు త్రిశూల వ్యుహంతో విజృంభించగా, భీష్ముడు అదే రోజు ఊర్మి (సముద్ర అలలు లాంటి) వ్యుహంతో ఎత్తుగడ వేయగా అర్జునుడు ప్రతిగా శృంగాటక వ్యుహంతో దిగాడు.

9 వ రోజు భీష్ముడు సర్వతోభద్ర వ్యుహం తో యుద్ధం చేశాడు. అర్జునుడు నక్షత్ర మండల వ్యుహంతో .ఎదుర్కొన్నాడు.

10 వ రోజున భీష్ముడు అసుర (రాక్షస) వ్యుహంతో యుద్ధరంగంనకు రాగా, అర్జునుడు దేవ వ్యుహంతో నిలువరించాడు. భీష్ముని ఎదురుగా శిఖండి రాగా అస్త్ర సన్యాసం చేశాడు.

11 వ రోజున ద్రోణాచార్యుడు కౌరవ సేనకు నాయకత్వం వహించి శకట ( బండి ) వ్యుహంతో యుద్ధరంగంలో నిలిచాడు. అర్జునుడు క్రౌంచవ్యుహంతో వచ్చాడు.

12 వ రోజున ద్రోణుడు గరుడవ్యుహంతో రాగా అర్జునుడు అర్ధచంద్ర (నెలవంక / Crecent)వ్యుహంతో యుద్ధరంగంలో నిలిచాడు.

13వ రోజున ద్రోణుడు చక్రవ్యుహం పన్నినాడు. ఈ చక్రవ్యుహన్ని అభిమన్యుడు తుత్తుతుత్తు చేశాడు.అపుడు ద్రోణుడు పద్మ వ్యుహం పన్ని అభిమన్యుడి చావుకు కారణమైనాడు. పాండవపక్షాన ఉన్న దుష్టమ్యుడు చక్కగా యుద్ధం చేశాడు.వ్యుహం తెలియదు.

14వ రోజు ద్రోణుడు చక్రష్టక (బండిఆకులు spokes), పాదం, సూచి ముఖ వ్యుహలతొ యుద్ధం చేశాడు. అర్జునుడు సర్ప (పాము) వ్యుహంతో ఎదుర్కొన్నాడు.

15వ రోజున ద్రోణుడు పాదవ్యుహంతో యుద్ధం చేశాడు. అర్జునుడి వ్యుహమేమిటో వివరాలులేవు.కాని ఈ యుద్ధంలోనే ద్రోణాచార్యుడు అస్తమించాడు.

16వ రోజున కర్ణుడు మకర వ్యుహంతో యుద్ధ సీమలో ప్రవేశించగా, అర్జునుడు అర్థచంద్రవ్యుహంతో యుద్ధం చేశాడు.

17వ రోజున కర్ణుడు సూర్య చంద్ర వ్యుహంతో వీరోచిత యుద్ధంచేసి అసువులు బాసాడు. అర్జునుడు మహిషం (గేదె - ఎనుము)
వ్యుహంతో అంటే మృత్యు దేవత వాహన వ్యుహంతో యుద్ధం చేసి కర్ణుడిని నిర్జించాడు.

18వ రోజున శల్యుడు సర్వతోభద్రవ్యుహంతో యుద్ధం చేశాడు. అర్జునుని వ్యుహ వివరాలు అందుబాటులోలేవు.18 రోజుల మహభారత యుద్ధం ముగిసింది.

పద్మ వ్యుహంలో(మొగ్గలా ఉన్న కమలం) సైన్యం ఎలా ఉండేదో చూద్దాం.

మొదటి వరుసలో కత్తులు పట్టిన పదాతిదళం (Foot soldiers /infantry), వారికిందుగా రెండు వరుసలలోనూ పదాతిదళం (కాలిబంట్లు), వారి క్రిందుగా మూడు వరుసలలో గజదళం, అశ్విక దళంతో పాటు విలు కాండ్రు/విలుకాళ్ళు (Sodiers with arrow and bows), వారి ప్రక్కన మరలా గజదళం ఉంటుంది.దీని క్రింద పదాతి దళం, సర్వ సేనాధిపతి, అతని ప్రక్కన పదాతిదళం ఉంటుంది.
చివరి వరుసలో శూలాలు .ధరించిన పదాతిదళం, కత్తులు ధరించి శత్రువును నిలువరించే సైన్యం, వారి ప్రక్కన మరలా ఇదే నిలువరించే సైన్యం, చివరిగా కత్తిడాలులు పట్టిన పదాతిదళం ఉంటుంది.

ఆనాటి మహభారత యుద్ధంలో శతఘ్నులు(Missiles), అగ్నేయ అస్త్రాలు వగైరా మంచి మంచి (super Missiles) అస్త్రాలనువారు .వినియోగించారు..

Post a Comment

0 Comments