అతలాకుతలమైంది అంటూంటారుగా ఏమిటీ అర్థం ?

అతలాకుతలమైంది అంటూంటారుగా ఏమిటీ అర్థం ?
.....................................................

అతలాకుతలమైంది
అట్టులా ఉడికిపోతోంది
పెనం మీద నుండి పోయిలో పడ్డటైంది
ముందు నూయి వెనుక గొయి
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి

మొదలైనవి జాతీయాలు సామెతలు. జాతీయాలు కాని సామెతలు కాని అనుభవసారంతో పుట్టినవే. ఇలాంటి జాతీయాలు సామెతలు వలన చెప్పాల్సిన విషయాన్ని సులభంగా అర్థమైయ్యేలా చెప్పొచ్చు. ఒక విషయాన్నో సంగతినో తేల్చి చెప్పటానికి నిత్యజీవితంలో ఎదురైన సంఘటనలను ఉదాహరించి చెప్పటం.

ఇక అట్టులా ఉడికిపోతోంది అనే జాతీయాన్ని తీసుకొందాం.ఏదైనా సంఘటన ఒక్కటి ఒక ప్రాంతంలో బలంగా ఇబ్బంది పెడుతోంటే ఈ మాటను ఉపయోగిస్తారు. అట్టు అంటే దోశ. పెనం వేడిగా వుంటే తప్ప దోశ రాదు.దోశ పిండిని వేడి పెనంపైన వేయగానే అతి కుతకుత ఉడుకుతుంది. ఆ సమస్య కూడా కుతకుత ఉడుకుతోందని అర్థం.

ఇక పెనంపై నుండి పోయిలో పడ్డట్టు అంటే ఒక సమస్య కొరకరాని కొయ్యగా వుంది. ఉన్నట్టుండి ఆ సమస్య మరోకోణంలో తీవ్రరూపం దాల్చింది. ఇలాంటి సమయంలోనే ఈ సామెతను వాడటం జరుగుతుంది. రొట్టె ఒకటి వేడి పెనం మీద బాగా కాలుతోంది. అది పొరబాటున పోయిలో పడితే మాడి మసైపోతుంది. ఏదైనా సంఘటన కూడా సమస్యాత్మకంగా వుంటే మరోదారిలో వెళ్ళి తీవ్రమైతే పెనం మీద నుండి పోయిలో పడ్డట్టైంది అంటారు.
ఉదా॥

ముందు నూయి వెనుక గొయి. నూయి గోయి రెండు లోతైనవే. పడితే పైకి రావడం కష్టం. ముందుకు వెళితే నూయిలో పడతాం, వెనక్కు వెళితే గోయిలో పడతారు.

మంచి ఉదా॥ ఏమంటే ఆఫీసులో వుంటే బాగుతో ఇంటికిపోతే  పెళ్ళాంతో వేగినట్టుంది పరిస్థితి.

అమ్మబోతే అడవి కొనబోతే కొరవి అనే సామెతను రైతుపట్ల ఎక్కువగా వాడటం జరుగుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు ఆ పంటను అమ్మటానికి వెళితే సరైన గిట్టుబాటు దొరకదు. అలాగని అమ్మకుండా ధాన్యాన్ని ఇంటిలోనే వుంచుకొంటే అప్పుల బాధ వుండనే వుంటుంది. సంసారం జరగడం కష్టమైతుంది. రైతు కష్టాన్ని చూచే ఈ సామెత పుట్టిందనుకొంటా.

పంటని అమ్మటానికి అడవిలో నికి వెళితే కొనేవారు ఎవరుంటారు. క్రూరమృగాలు తప్ప.పంటను అమ్మకుండా ఇంట్లోనే వుంచుకొంటే సమస్యల కొరవితో సతమతం కావడం తప్పదు.

ఈ మధ్యకాలంలో కరోనాతో అగ్రరాజ్యం అతలాకుతలం అనే వార్తను మనం చూచే వుంటాం. అతలాకుతం అంటే ఏమిటో నిజమైన అర్థం నాకు తెలియదు. నేను ఊహించి కింద వివరణ ఇస్తున్నా.బహుశా ఇది వాస్తవం కాకపోవచ్చు. వాస్తవం కాకపోతే విజ్ఞులు తెలియ చేయవచ్చు. ఊహా మాత్రమే.

మన పురాణాలను బట్టి  భూలోకానికి కిందన ఏడులోకాలు ఉన్నాయి. అవి

1.అతల, 2. వితల, 3. సుతల, 4. రసాతల, 5. తలా తల, 6.మహాతల, 7. పాతాళ లోకాలు .

 పైన ఆరు లోకాలున్నాయి. అవి
భూలోక, 
1. భువర్లోక , 2. సువర్లోక , 3. మహార్లోక , 4. జనర్లోక , 5.తపోలోక  6. సత్యలోకాలు.

ఇందులో పాతాళలోకమైన అతల  ఎవో సంక్లీష్ట కారణాల వలన కుతలమైంది.అంటే అతలం తీవ్రమైన సంక్షోభంలో పడి కాస్తా కుతలమైంది.
అ+ తల  = అతల = తలకలది = తలమానికమైనది  = ముఖ్యమైనది.

కు+తల = కుతల = తలలేనిది, ప్రాముఖ్యం కానిది.

కరోనా సంక్షోభంలో కూరుకుపోయి అమెరికా అతలాకుతలమైపోయింది.
..............................................................................................

Post a Comment

0 Comments