విజయాన్ని అందుకోవడానికి ఒక సీక్రెట్ - Marshmello Theory

జీవితంలో మంచి సత్ఫలితాలు సాధించి విజయాన్ని అందుకోవడానికి ఒక సీక్రెట్*

ఒక టీచర్ గారు క్లాసులో పిల్లలందరికీ ఒక టోఫీ (చాక్లెట్) ఇచ్చి పిల్లలతో" పిల్లలూ! మీరు ఎవరు ఈ టోఫీని 10 నిమిషముల వరకు తినకండి" అని చెప్పి అతను క్లాసు బయటకు వెళ్ళిపోయాడు.
  కొద్ది సమయం వరకు  క్లాసు అంతా నిశ్శబ్దంగా ఉంది..ప్రతి విద్యార్థి తన ఎదురుగా ఉన్న టోఫీని చూస్తున్నారు .సమయం గడిచేకొద్దీ దాన్ని తినకుండా ఉండగలగటం వాళ్లకు చాలా కష్టంగా అనిపించింది.
  పదినిమిషాల తర్వాత టీచరు క్లాస్ లోకి వచ్చారు.. క్లాసులో కేవలం ఏడుగురు  మాత్రం టో ఫీని తినలేదు. మిగిలిన అందరూ టోఫీ నీ తింటూ వాటి రుచి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ టీచరు రహస్యంగా ఏడుగురి పేర్లు తన డైరీలో రాసుకున్నారు.

   ఆ టీచర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాల్టర్ మైకేల్. కొన్ని సంవత్సరముల తర్వాత అతను డైరీలో రాసుకున్న ఏడుగురి పేర్లు చూసి వారు గడుపుతున్న జీవితం గురించి పరిశోధన చేశాడు .అతను గ్రహించిన దేమిటంటే  ఆ ఏడుగురు వారి వారి జీవితాల్లో ఎంతో గొప్ప గొప్ప విజయాలను సాధించి వారు ఎన్నుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.
      ప్రొఫెసర్ వాల్టర్ మిగిలిన వారి జీవితాలను కూడా పరిశోధించాడు.
వారిలో చాలా మంది సాధారణ జీవితాలను మాత్రమే.
 గడుపుతున్నారు. మిగిలిన కొంత మంది ఆర్థికంగా వెనుకబడి పోయి వారి జీవితాలలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న ట్లుగా గ్రహించాడు.
 ఈ పరిశోధన ఫలితాన్ని ప్రొఫెసర్ వాల్టర్ ఒక్క వాక్యంలో ఇలా చెప్పాడు.
 *ఎవరైతే ఒక్క పది నిముషాలు సహనంగా ,నిగ్రహంగా ఉండలేరో వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని సాధించలేరు*
    ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ సిద్ధాంతాన్ని Marshmello Theory అంటారు. దీనికి ఈ పేరు రావటానికి గల కారణం ప్రొఫెసర్ వాల్టర్ పిల్లలకు ఇచ్చిన టోఫీ పేరు
Marshmello.
    ఈ సిద్ధాంతం( theory) ప్రకారం ప్రపంచంలో అత్యుత్తమ విజయాన్ని సాధించిన వారిలో ఉండే ప్రత్యేక గుణం *సహనము*(patience).
ఈ గుణం జీవితంలో సంభవించే కష్టనష్టాలకు నిరాశ చెందకుండా తట్టుకునే శక్తిని ఇస్తుంది. తద్వారా మనం ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న వాళ్ళం అవుతాం.
    దీని గురించే  మనకు Educare లో  జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి రియాక్షన్ ఇవ్వకుండా ఓర్పుతో కొద్దిగా ఆగి రెస్పాన్స్ మాత్రం ఇవ్వాలని చెప్పారు.....
   *Patience is the essence of life*.

Post a Comment

0 Comments