రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి 1861 మే 7 వ తేదీ

రవీంద్రనాథ్ ఠాగూర్  జయంతి 

వంగదేశంలో ( కలకత్తా) 1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు14వ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా  విచిత్రంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివే ఠాగూర్ నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉంటూ బయటి ప్రపంచం ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ , ఇంటి వద్దనే చరిత్ర , భూగోళం పాఠ్యాంశాలు వంటివి అభ్యసిస్తూ ,పాఠశాలకు వెళ్లడంపట్ల నిరాసక్తి వ్యక్తం చేసేవాడు. ఠాగూర్ ద్విజేంద్ర నాథ్, సోదరి స్వర్ణకుమారి రచనా రంగంలో ప్రసిద్ధిగాంచినవారు. ఠాగూర్ భార్య మృణాలినీ దేవి, రేణుకా టాగూర్ ,శ్యామేంద్రనాథ్ ఠాగూర్  వీరి సంతానం.
 అనేక కావ్యాలు రచించిన ఠాగూర్ గీతాంజలి కి నోబెల్ బహుమతి రావడం ప్రపంచ ఖ్యాతిని పొంది విశ్వకవి అనే బిరుదును పొందడం జరిగింది.
రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశుభ్రత, సత్యాన్నే పలుకుట, కాలినడక, పెద్దలను, గురువులను గౌరవించటం వారికి నేర్పేవారు. 1919 లొ "కళా భవన్" ను ఆయన స్తాపించారు. ఇక్కడ విద్యార్ఢులు విభిన్న కళాలను నెర్చుకునేవారు.  రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకసారి సేవాగ్రాం దర్శించినప్పుడు అక్కడ గాంధీ స్థాపించిన విద్యావిధానంలో విద్యార్థుల క్రమశిక్షణ వారి పనితీరును చూసి ముగ్ధుడై ఇలాంటి శిక్షణ మా విద్యార్థులకు కూడా అలవడితే బాగుండునని తలంచారు. శాంతినికేతన్ అనేది స్థాపించకుండా ఉండి ఉంటే సేవాగ్రామంలోనే తన శేష జీవితాన్ని గడిపే వాడిని అని రవీంద్రనాథ్ ఠాగూర్ అనేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆహ్వానం మేరకుమహాత్మా గాంధీ  శాంతినికేతన్ లోని ఆ కళావైభవాన్ని దర్శించినప్పుడు జ్ఞాపకార్థం ఒక ఫోటో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యార్థులకు క్రమశిక్షణ అలవడాలి దాని పట్ల విద్యార్థులు నిర్లక్ష్యం వహిస్తున్నారు, వారికి తగిన శిక్షణ ఇవ్వమని కోరగా గాంధీగారు విద్యార్థులతో మాట్లాడి స్వయంగా దగ్గరుండి  చెప్పటమే కాకుండా  ఆచరించే విధానం చూపించారు.రవీంద్రనాధటాగగూర్ డెబ్భై ఏళ్ళ ప్రాయంలో చిత్రకళా సాధనను ప్రారంభించి, వేసిన చిత్రాలు లండను, ప్యారిస్, న్యూయార్కు మొదలగు నగరాలలో ప్రదర్శించబడ్డాయి. ఆయన దాదాపు రెండు వేల చిత్రాలను గీశాడు.
రవీంద్రుడికి సంగీతమంటే మిక్కిలి ప్రీతి. ఆయన బెంగాల్ జానపద గీతాలను, బాపుల్ కీర్తనలను విని ముగ్ధుడయ్యేవాడు. ఆయన స్వయంగా గాయకుడు. భారతీయ సంగీతంలో రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక శాఖను ఏర్పరచిన వాడు రవీంద్రుడు.
 ఠాగూర్ గారు రచించిన" ఎక్లచలో"  గీతాన్ని తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. ఆ పాట అర్థం
" ఎవరు కేక విని రాకపోయినా ఒక్కడవే పదవోయ్, ఒక్కడవే ఒక్కడవే ఒక్కడవే పదవోయ్ "ఇలా సాగుతుంది. ఇది మహాత్మా గాంధీ  గారికి  చాలా ఇష్టమైన గీతం.రవీంద్రనాథ టాగోర్ 1896లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సదస్సులో మొట్టమొదటిగా బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరాన్ని ఆలపించాడు. రవీంద్రుడు వ్రాసిన "జనగణమణ" ను జాతీయ గీతంగా ప్రకటించేముందు "వందేమాతరం", "జనగణమన" లపై దేనిని జాతీయ గీతంగా ప్రకటించాలని సుదీర్ఘ చర్చ, తర్జన భర్జనలు జరిగాయి. రాజ్యాంగ సభ కమిటీ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా, వందేమాతరంను  జాతీయ గేయంగా ప్రకటించారు.

సేకరణ.... 🙏🙏🙏

Post a Comment

0 Comments