కథ - దానం

కథ - దానం

ShyamPrasad +91 8099099083
0
_🔥 *సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే..*🤷‍♂_

_*మహాభారతం* లో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి...!_

_జూదం, ద్రౌపదీ వస్త్రాపహరణం, కురుక్షేత్ర యుద్ధం.. వీటినే చూపెడతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన "నీతికథలు" ఎన్నో ఉన్నాయి..!!_

_అందులో ఒకటి ఇది..._👇🏻

_పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేశాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే  రాజ్యానికి తీసుకు వెళ్ళాడు._

_ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది._

_అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్ళు ఇచ్చింది. వారు తాగేశాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది !_

_ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ? అని చెప్పడంతో.. ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!_

_ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు._

_ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్ళారు._

_కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేశాడు.._

_రాజా.. ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.._

_*కృష్ణా... మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా  పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు. ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన  అవసరం లేదు..! ఈయన రాజ్యంలో బీదవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు.. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో... ఈయన రాజ్యంలో అంతమందిని   పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను  అన్నారు !*_

_తన రాజ్యస్థితిని  తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు !! 😭😭_

_👉🏻 *సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం... ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా  వివరించారు !!!*_

_👉🏻 మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.. ప్రజలు ఎప్పుడు మారుతారో..!_
 
🙏🇮🇳

Post a Comment

0Comments

Hi Please, Do not Spam in Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!