2 నెలలు

2 నెలలు

SHYAMPRASAD +91 8099099083
0
నాకు ఒక విషయం అర్ధం కావట్లేదు.
మీకు అర్ధం అయితే చెప్పండి.
రెండు నెలలు అంటే 60 రోజులు.
ఈ 60 రోజుల్లో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది.
2 నెలలు జీతాలు లేకపోతే ప్రయివేటు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
2 నెలలు ఫ్యాక్టరీలు నడవకపోతే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.
2 నెలలు ఫ్యాక్టరీ లు నడవక పోతే ఓనర్లు ప్రభుత్వాన్ని సాయం ప్రకటించమని అడుగుతున్నారు.
2 నెలలు ప్రభుత్వ, ప్రయివేటు బస్సులు నడవకపోతే యాజమాన్యాలు అప్పుల పాలు అయిపోయాము అంటున్నారు.
2 నెలలు పనులు లేకపోతే వలస కూలీలు సొంత ఊరికి వెళ్లిపోతున్నారు.
2 నెలలు హాస్టల్ లో జనాలు లేకపోతే హాస్టల్స్ మూసేస్తున్నారు.
2 నెలలు జీతాలు ఆలస్యం అయితే నో సగం జీతం వస్తేనో మేము ఎలా బ్రతకాలి అని ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు.
2 నెలలు సినిమా హాళ్లు మూతపడినందుకు ఇప్పుడు ఓపెన్ చేశాక టిక్కెట్ రేట్లు పెంచుకుంటాం అంటున్నారు.
2 నెలలు క్యాబ్స్ తిరగనందుకు క్యాబ్ ఓనర్లు,డ్రైవర్లు హై కోర్ట్ మెట్లు ఎక్కారు.
2నెలలు లాక్ డౌన్ ఉన్నందుకు టోల్ గేట్ల వాళ్ళకి సాయం ప్రకటించే దిశగా NHAI ఆలోచిస్తుంది.

ఇలా ప్రతి ఒక్కరు చిన్న వర్క్ షాప్ నుండి పెద్ద ఇండస్ట్రీ వరకు ప్రభుత్వం వైపు చూస్తున్నారు.
నేను వీళ్ళు ఎవ్వరిని తప్పు పట్టట్లేదు.
ఎవరి ఇబ్బందులు వారివి.

కాకపోతే_ఒక_రైతు

ఏడాదికి 2 లేదా 3 పంటలు పండిచడానికి 365 రోజులూ వంచిన నడుము ఎత్తకుండా ఎండనకా వాననకా కష్టపడి పండించిన పంటలు చేతికి అందే సమయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల చేతికి రాకపోయినా లేక చేతికి వచ్చిన పంట కి గిట్టుబాటు ధర లేక రూపాయి పంట పావలాకి అమ్మాల్సి వచ్చినా ఒకవేళ పావలాకి అమ్మితే పంట కోసిన కూలి కూడా రాదని తెలిసి పంటని భూమాతకి వదిలేసినా
అయ్యో పాపం ఆ రైతు కుటుంబం పరిస్థితి ఏమిటి అని ఒక్కరి కి కూడా ఆలోచన రాదు ఎందుకు ?
రైతు కష్టం ఏ రాజకీయ నాయకులు, పార్టీలు పట్టించుకోరు ఎందుకు ?
రైతు అభిమానవంతుడు కనుక అడుక్కోడు.
రోడ్డెక్కి ధర్నాలు చెయ్యడు.ఏ ప్రభుత్వం మీద,వ్యవస్థల మీద తిరగబడడు.
ఆయన ధ్యేయం ఒక్కటే పుట్టెడు పంట పండించి అందరి కడుపుకి పట్టెడు అన్నం పెట్టాలి అనే తాపత్రయం తప్ప తన కడుపు గురించి తన కుటుంబం గురించి తన బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచించడు అందుకే కదా రైతు అంటే అందరికీ చులకన.

ఇవాళ ఒక రైతు దగ్గర 70 బత్తాయిలు 150 రూపాయల కి కొన్నాను.
అవే కాయలు ఫ్రూట్స్ షాప్ లో కొంటె 500 రూపాయలు.
సూపర్ మార్కెట్ ,మాల్స్ లో అయితే ఇంకా ఎక్కువే.
అయిన అక్కడ నోరు మూసుకొని కొంటాం.
కానీ రైతుల దగ్గర మాత్రం బేరాలు చేస్తాం.

ఆలోచించండి.మీ పరిధిలో మీరు రైతు కి ఏదైనా సాయం చేయగలరేమో ప్రయత్నించండి.

రైతే దేశానికి వెన్నుముక🌹🙏🏻
జై కిసాన్ 🌹🙏🏻
ఈ భూమ్మీద అందరి కడుపులు నింపడానికి కష్ట పడుతున్న రైతుల అందరికి నా పాదాభివందనాలు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!