ఆచార్య ఎన్జీ రంగా (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995)

ఆచార్య ఎన్జీ రంగా (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995)

SHYAMPRASAD +91 8099099083
0
ఆచార్య ఎన్జీ రంగా వర్ధంతి సందర్భంగా*
ఎన్.జి.రంగా
స్వాతంత్ర సమరయోధుడు🇮🇳

ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.

రంగా, 1900, నవంబరు 7 న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు హేతువాది . 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.

1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు , కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యులే . ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు.

ఎన్.జి.రంగా
జననం
గోగినేని రంగనాయకులు
నవంబరు 7, 1900
మరణం
జూన్ 9, 1995
ఇతర పేర్లు
ఎన్.జి.రంగా
భారత రైతాంగ ఉద్యమపిత
వృత్తి
లోక్ సభ సభ్యుడు , రైతు నాయకుడు
ప్రసిద్ధి
భారత స్వాతంత్ర్య సమరయోధుడు,
రాజకీయ పార్టీ
కాంగ్రెసు పార్టీ
భారత కృషికార్ లోక్ పార్టీ
మతం
హిందూ మతము హేతువాది
తండ్రి
గోగినేని నాగయ్య
తల్లి
అచ్చమాంబ

స్వాతంత్ర్య సమరంలో 

1930 లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ, 1955 లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.ఈయన కాంగ్రెసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.

రాజకీయ జీవితము 

లోక్ సభ పదవీకాలం నియోజకవర్గం పార్టీ

2వ లోక్ సభ 1957-1962 తెనాలి కాంగ్రెసు పార్టీ
3వ లోక్ సభ 1962-1967 చిత్తూరు స్వతంత్ర పార్టీ
4వ లోక్ సభ 1967-1970 శ్రీకాకుళం స్వతంత్ర పార్టీ
7వ లోక్ సభ 1980-1984 గుంటూరు కాంగ్రెసు (ఐ)
8వ లోక్ సభ 1984-1989 గుంటూరు కాంగ్రెసు (ఐ)
9వ లోక్ సభ 1989-1991 గుంటూరు కాంగ్రెసు (ఐ)

ఆయన పేరుతో జాతీయ వ్యవసాయ విశ్వ విద్యాలయము స్థాపించబడింది.
సేకరణ.....
🙏🙏🙏🙏🙏🙏

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!