🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక _*అద్భుతమైన లేఖ*_ ఇది. 🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸🙏🏼🌸🙏🏼
👉🏽 తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ ఒక తండ్రి *టీచర్* కి రాసిన లేఖ.
🙏🏼ఇది ప్రతి _*తల్లికి, తండ్రికి, టీచర్*కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.🙏🏼
ఆర్యా,
" మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు. కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.
అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను.
ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు.
ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకి రావచ్చు.
అలాంటి జీవితంలో వాడికి *నమ్మకం, ప్రేమ, ధైర్యం,ఆత్మవిశ్వాసం* తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా...? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా...?
🌷ఒక మిత్రుడుంటే ఒక *శత్రువు* కూడా ఉంటాడని నేర్పండి.
🌷అందరు మనుషులూ *న్యాయంగా ఉండరనీ*,
🌷అందరూ *సత్యసంధులు కారనీ* వాడికి తెలియాలి.
🌷ఒక దుష్టుడున్న చోట ఒక *వీరుడు* కూడా ఉంటాడనీ ,
🌷*జిత్తులమారి* రాజకీయ నేత ఉండే చోటే *అంకితభావం* తో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి.
🌷అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా *సొంతంగా సంపాదించుకున్న* పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి.
🌷స్కూల్లో *మోసం చేసి పాసవటం కన్నా ఫెయిలవటం* ఎక్కువ _*గౌరవం*_ గా ఉంటుందని నేర్పండి.
🌷ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం,
🌷గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం,.. నేర్పండి.
🌷అందరితో *మృదువు* గా ప్రవర్తించమనీ,
🌷కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.
🌷 *అసూయ* వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది.
🌷చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.
🌷వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి.
🌷కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.
🌷ఓటమిలో కూడా _*కీర్తి ప్రతిష్ఠలు*_ ఉండవచ్చనీ,
🌷గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి.
🌷క్రూరులను ఎగతాళి చెయ్యటం నేర్పండి.
🌷 _*పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో*_ నేర్పండి,
🌷కానీ అదే సమయంలో ఆకాశంలో ఎగిరే పక్షుల గూఢమైన రహస్యాల గురించి,
🌷ఎండలో ఝుమ్మనే తేనెటీగల గురించి,
🌷పచ్చని కొండలమీద పూసే పువ్వుల గురించి కూడా చెప్పండి
🌷అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ, వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి.
🌷అందరూ మందని అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి.
🌷అందరు చెప్పేదీ వినమనీ,
🌷సత్యమనే జల్లెడతో వడబోసి *మంచిని మాత్రమే గ్రహించమనీ* చెప్పండి.
🌷 తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి
🌷 కానీ తన *హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని* నేర్పించండి.
🌷 అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ,
🌷 ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.
🌷 ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ,
🌷 అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.
🌷 ఇదీ క్రమం టీచర్...
🌷మీకు వీలైనంత వరకూ ప్రయత్నించండి.
వాడు మంచి పిల్లవాడు.
వాడు మా అబ్బాయి.
🌸🌷🌸🌷🌸🌷🌸🌷
Hi Please, Do not Spam in Comments