అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ

అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ

SHYAMPRASAD +91 8099099083
0
🟧🟩🟪🟨🟦🟫🟧🟩🟪🟨🟦🟫🟧🟨

ఒక సమావేశం లో ఉపన్యాసం సందర్భంగా గురుాజీ 30 ఏళ్ల వ్యక్తిని నిలబడమని అడిగారు.
  
మీరు హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో నడుస్తున్నారు. మీ ముందు నుండి ఒక అందమైన అమ్మాయి వస్తున్నట్లయితే, మీరు ఏమి చేస్తారు ?

ఆ యువకుడు - ఆమెనే చూస్తాను.

గురూజీ అడిగారు - అమ్మాయి ముందుకు కదిలితే, మీరు వెనక్కి తిరిగి చూస్తారా ?

యువకుడు - అవును, నా భార్య నా వెంట లేకపోతే ! (సమావేశంలో అందరూ నవ్వారు)

గురూజీ అప్పుడు అడిగారు - ఆ అందమైన ముఖాన్ని మీరు ఎంతకాలం గుర్తుంచుకుంటావో చెప్పు ?

(మరో అందమైన ముఖం కనిపించే వరకు) ఆ యువకుడు 5 - 10 నిమిషాలు అన్నాడు.

గురూజీ ఆ యువకుడితో - ఇప్పుడు ఆలోచించండి,

మీరు భద్రాచలం నుండి హైదరాబాద్ కు వెళుతున్నారు. నేను మీకు ఒక ప్యాకెట్ పుస్తకాలు ఇచ్చి, ఈ ప్యాకెట్‌ ను హైదరాబాద్ లోని ఒక గొప్ప వ్యక్తికి అందజేయమని చెప్పాను.

మీరు ప్యాకెట్ డెలివరీ చేయడానికి హైదరాబాద్ లోని అతని ఇంటికి వెళ్లారు.

మీరు అతని ఇంటిని చూసినప్పుడు, అతను పెద్ద బిలియనీర్ అని మీకు తెలిసింది.
 
10 కార్లు, 5 గురు చౌకిదార్లు ఇంటి బయట నిలబడి ఉన్నారు. మీరు ప్యాకెట్ యొక్క సమాచారాన్ని లోపలికి పంపితే, అప్పుడు వారు స్వయంగా బయటకు వచ్చారు. మీ నుండి ప్యాకెట్ తీసుకున్నారు. మీరు బయలుదేరడానికి సిద్ధమయినప్పుడు, మిమ్మల్ని ఆయన పట్టుబట్టి ఇంటిలోనికి తీసుకువెళ్లారు. మీ దగ్గర కూర్చుని వేడి ఆహారాన్ని వడ్డించారు. బయలుదేరేటప్పుడు, మిమ్మల్ని అడిగారు -
మీరు దేనిలో వచ్చారు ? అని, మీరు స్థానిక రైలులో వచ్చానని చెప్పగా, అతను డ్రైవర్‌ తో, మిమ్మల్ని గమ్యస్థానానికి తీసుకెళ్లమని చెప్పారు.
మీరు మీ గమ్యం చేరుకోగానే ఆ బిలియనీర్ నుండి ఫోన్ - సోదరా మీరు హాయిగా చేరుకున్నారా ? అని.
 
ఇప్పుడు చెప్పు, ఆ ప్రముఖుడిని మీరు ఎంతకాలం గుర్తుంచుకుంటారు ?

 యువకుడు అన్నాడు - గురూజీ ఆ వ్యక్తి ని చనిపోయే వరకు మనం మరచిపోలేము.

 గురూజీ యువకుడి ద్వారా సభను ఉద్దేశించి మాట్లాడుతూ
"ఇది జీవిత వాస్తవికత."

 "అందమైన ముఖం కొద్దిసేపు మాత్రమే గుర్తుకు వస్తుంది.
 కానీ మన అందమైన ప్రవర్తన జీవితకాలం ఉంటుంది.

Good morning, friends.
🌈🌈 
K. V. R. Rao.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!