పోస్టుకార్డు మనీయార్డర్లు మరచిపోయాం.కాని అవి ఎప్పుడు పుట్టాయో తెలుసా !
...........................................................
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో 1766 లో తపాలా వ్యవస్థ దక్షిణ భారతదేశంలో మదరాసులో ఊపిరి పోసుకొంది.
బొంబాయి కలకత్తా మధ్య తపాలా బట్వాడా కు 26 రోజులు,
బొంబాయి నుండి మదరాసుకు 17 రోజులు
మద్రాసు నుండి కలకత్తాకు 19 రోజులు తపాల బట్వాడా కొరకు సమయం పట్టేది.
1789 లో హైద్రాబాదు నుండి బొంబాయికి తీసుకు వెళ్ళె రెండున్నర రుపాయల బరువుగల (coins weight) తపాలాకు 8 ఆణాలు,
మచిలీపట్నం బొంబాయికి 12 ఆణాలు,
మచిలీపట్నం మద్రాసుకు వెళ్ళెతపాలాకు నాలుగాణాలు వసూలు చేసేవారు.
1840 తరువాత కుంఫిణి ప్రభుత్వం మదరాసులో పోస్ట్ మాస్టర్ జనరలును నియమించింది.
1844 లో తీసుకొన్న ఉత్తరాలకు బట్వాడా చేసే ఉత్తరాలకు తాలూకా పోస్టాఫీసులలో రశీదులు ఇచ్చేవారు.
1854 తరువాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీలో ఒకేరకం తపాలా వ్యవస్థ అమలులోనికి వచ్చింది.
1877లో VPP పద్ధతి వచ్చింది.
1878 లో పోస్టులు ఇన్స్ స్యూరెన్స్ ఏర్పాటుచేశారు.
1879లో పోస్టుకార్డులు ప్రవేశపెట్టారు.
1880 లో మనీ ఆర్డర్ పద్ధతి ద్వారా డబ్బు పంపుకోనే వీలు కల్పించారు. మనీ ఆర్డర్ ను తపాలా కార్యాలయంలోనే తీసుకోవలసి వచ్చేది.
1882లో postal Savings పద్ధతి వచ్చింది.
1883లో Reply card పద్ధతిని ప్రవేశపెట్టారు.
1884 లో మనీ ఆర్డర్లను ఇంటి వద్దకే వెళ్ళి ఇచ్చేపద్ధతి వచ్చింది
.................................................................................................. జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.
Hi Please, Do not Spam in Comments