ఆ ఏనుగు శుభ్రంగా స్నానం చేసి రోడ్డు ప్రక్కగా నడుచుకుంటూ వస్తోంది. దానికి ఎదురుగా ఋరదలో పొర్లిన ఒక పంది
తన తోకను ఆడిస్తూ వచ్చి పోయే వారి మీద బురదపడేలా నడుస్తోంది. ఏనుగు ఆ పందిని చూసి దూరంగా నడవసాగింది. అది గమనించిన పంది మరో పందితో చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి ప్రక్కకు తప్పుకుంటోంది అని గర్వంగా చెప్పింది.
ఆ మాటలు విన్న గుర్రం ఈ ఏనుగును నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా అనడిగింది. దానికి ఆ ఏనుగు "అది బురదలో దొర్లి వచ్చింది, నేను ఒదిగి ప్రక్కకు వచ్చింది దాని మీద ఉన్న బురద నా మీద పడితే నేను అశుద్దం అవుతాను " అంది
మరది నిన్ను హేళన చేస్తుంది కదా? అంది గుర్రం. అవును అది దాని నైజం, అందుకే దానికింకా దూరంగా ఉండాలి. ఇది నా నైజం అంది.
నీతి: మనం నీతిమంతులం అయితే చాలదు, అవినీతి పరులకు దూరంగా ఉండాలి.
Hi Please, Do not Spam in Comments