తెలుసుకుందాం

Responsive Advertisement

కథ - సమయం విలువ

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
      సమయం విలువ
🥀🥀🥀🥀🥀🥀🥀🥀

ఒకసారి  ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అయితే ఆ వ్యక్తికి  అతను యమధర్మరాజుని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీ డుళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, వెంటనే యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముని కానీ నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను  అని , యమధర్మరాజు ఆ వ్యక్తికి  ఒక డైరీ ఇచ్చారు. నీకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అది జరుగుతుంది కానీ గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. ఆ వ్యక్తి  డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. మొదటిపేజీలోనిది చదివాడు అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. తర్వాత పేజీ చదివాడు, "తన స్నేహితుడు ఎలక్షన్లలో గెలిచి మంత్రి పదవి రాబోతోంది " అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా ఈలోపే  యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి  డైరీని తీసుకుని నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వేస్ట్ చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టు కున్నావు నీ యొక్క మృత్యువు  నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు  యముడు . ఆ వ్యక్తి  చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు.

 ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే ఈశ్వరుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా ఈశ్వరుని కృప నిండి ఉంటుంది.

🥀🥀🥀🥀🥀🥀🥀

ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచోతికి ఇచ్చి  "మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి "అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనము పర చింతన చేస్తూ సమయము  వేస్ట్ చేసుకుంటున్నాము. మన అదృష్టాని మనమే వంచన చేసుకుంటున్నాం... 
ఓం శాంతి🙏

Post a Comment

0 Comments